Trinayani October 2nd Written Update: ఇప్పటికే పరిస్థితులు బాలేదు మళ్ళీ మీరు అనుమానాలతో, ఉన్న సంబంధాలు తెంచొద్దు అని తిలోత్తమ అంటుంది.


ఎద్దులయ్య: విశాలాక్షమ్మ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.


సుమన: నువ్వేంటి అక్క ఏం మాట్లాడవు?


నయని: పెద్ద బొట్టమ్మ తీసుకెళ్లకపోయి ఉంటే అసలు పాప ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను


సుమన: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా ఆపలేడట. పెద్ద బొట్టమ్మ తీసుకెళ్లకపోయి ఉంటే మీలో ఎవరో ఒకరు ఉలూచిని దాచారు. వెతకమంటే మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకెప్పుడు పాప దొరుకుతుంది. పోయింది నా పాప కదా అదే నీ బిడ్డ అయితే తెలిసి ఉండేది.


తిలోత్తమ: సుమన, పాపం నయని కూడా తన బిడ్డను కోల్పోయింది కదా అయినా సరే వెతకడం లేదు ఎక్కడుందో ఏం చేస్తుందో అని అంటుంది.


సుమన: కనబడకుండా పోయి సంవత్సరమైంది కదా ఇంక రాదు అని తేలిపోయి ప్రయత్నాలు ఆపేశారు అని అంటుంది సుమన. ఇంతలో విశాల్ ఏదో మాట్లాడబోగా హాసిని ఆపుతుంది.


హాసిని: లాగితే తెగిపోతుంది విశాల్ వద్దు వదిలేయ్ అని ఆపుతుంది.


ఎద్దులయ్య: మీరేం అనుకోను అంటే నా దగ్గర ఒక సలహా ఉంది. చీకట్లో కూడా వెలుగును తెప్పించేది కేవలం గురువుగారు మాత్రమే అని అనగా విశాల్ వెళ్లి గురువుగారిని తెస్తానని అంటాడు.


ఆ తర్వాత సీన్ లో నయని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా హాసిని అక్కడికి వస్తుంది.


హాసిని: ఏంటి ఆలోచిస్తున్నావ్?


నయని: సుమన గురించి ఆలోచిస్తున్నాను


హాసిని: దాని గురించి ఆలోచించేదేమున్నదిలే కొన్ని మంది అంతే. సంవత్సరం నుంచి నీ పాప కనిపించక పోయినా నువ్వు ఆ బాధను లోపలి దాచుకున్నావు ఒకరోజు కనిపించకపోతే అలా అల్లడిల్లిపోతుంది.


నయని: గాయత్రమ్మ ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందని నమ్మకం నాకున్నది. అయినా పెద్ద బొట్టమ్మ తీసుకెళ్లకపోయి ఉంటే ఉలూచి ఏమైనట్టు అని ఆలోచిస్తున్నాను. ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందా అని తన త్రినేత్రం దగ్గర వేలు పెట్టి ఉండగా పాము పుట్టకు చుట్టూరా నిప్పులు అంటుకున్నట్టు దృశ్యాలు కనిపిస్తాయి.


నయని: అక్క ఇక్కడ దగ్గరలో ఏవైనా పాము పుట్టలు ఉన్నాయా?


హాసిని: అగ్నిగుండం దగ్గర ఒకటి ఉంది చెల్లి. ఏమైంది?


నయని: అయితే దాని గురించి ఆలోచించాలి. ఆ మంటలు మనల్ని ఆపేస్తాయా మనమే ఆ మంటల్ని ఆపేస్తావేమో అనేది చూడాలి అని అంటుంది.


ఆ తర్వాత సీన్లో గాయత్రి పాపను ఎద్దులయ్య తన భుజం మీద పెట్టుకొని లాలిస్తాడు. ఇంతలో హాసిని వాళ్ళు అక్కడికి వస్తారు.


హాసిని: ఇంకొంచెం సేపు ఆగితే పాపని కింద పడేసేలా ఉన్నావు అని చెప్పి ఎద్దులయ్య దగ్గర్నుంచి తీసుకుంటుంది.


ఎద్దులయ్య: గాయత్రి కింద పడినా తనకేం కాదు


వల్లభ: వాళ్ల తాత ఏమైనా భీముడా?


తిలోత్తమ: తాత వరకు ఎందుకు నాన్న ఎవరో కూడా తెలియదు


నయని: ఈ పాపకు నాన్న విశాల్ బాబే


హాసిని: చిటికలో చెప్పిన సరిగ్గా చెప్పావు చెల్లి


సుమన: ఆఖరికి ఆనాధ పిల్లలకి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వడం లేదు అని అనేలోగా గురువుగారిని తీసుకొని అక్కడికి వస్తాడు విశాల్.


విక్రాంత్: నువ్వు బయటికి వెళ్ళావా బ్రో?


విశాల్: లేదు కబురు పెడితే గురువుగారు వచ్చారు. విసాలాక్షి నన్ను, నయని ని బయటికి వెళ్లొద్దు అని చెప్పింది కదా


గురువుగారు: కుజుడు వస్తున్నాడు కనుక నువ్వు, నయని, విశాలాక్షి చెప్పినట్టు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది.


సుమన: మీకు మా అక్క వాళ్ళ మొగుడు తప్ప ఇంక ఎవరు మనుషుల్లా కనిపించరా గురువుగారు. ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తారు. నా పాప కనిపించట్లేదు అని నేను ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు


గురువుగారు: కంగారు పడకు సుమన. శివ భక్తుడైన ఎద్దులయ్య ఇక్కడ ఏం జరుగుతుందో అంచనా వేయగలడు. చెప్పు ఎద్దులయ్య.


ఎద్దులయ్య: సూర్యాస్తమయానికి ముందే పెద్ద బొట్టమ్మ వచ్చి పాపని ఉయ్యాలలో పెట్టింది దాని తర్వాత పాప పాములా కూడా మారింది. అక్కడి నుంచే కనిపించడం లేదు పాప తనంతట తాను వెళ్ళలేదు ఎవరో అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. అంతకన్నా ఎక్కువ అంచనా వేయాలంటే ఇక్కడ ఇంకొన్ని సంఘటనలు జరిగి ఉండాలి.


గురువుగారు: అవి చెప్పడానికి అమ్మవారి ఇంటికి వచ్చింది. నేనే తెచ్చాను అని పసుపుతో చేసిన అమ్మవారిని బయటకు తీసుకొని ఇది పసుపు గౌరమ్మ. ఈ అమ్మే మీకు దారి చెప్తుంది. నయని, విశాల్ మీ ఇద్దరి చేతుల మీదగా అమ్మవారిని పెడతాడు.


గురువుగారు: పసుపు గౌరిని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి నాగలక్ష్మి గుడిలో నుంచి తెచ్చిన పెట్టెలో పెట్టండి. 8 నిమిషాల తర్వాత శుభ ఘడియలు వస్తాయి అప్పుడు ఆ పెట్టిని నయని కాని లేకపోతే తన బిడ్డ కానీ తీయగలరు. అందులోని గౌరమ్మని పెడితే సుమన పాప యొక్క నీడ కనిపిస్తుంది అని అనగా నయనీ విశాల్ లు ఇద్దరూ చేతిలో గౌరమ్మని పట్టుకొని పెట్టె వరకు వెళ్తారు. హాసిని ఆ పెట్టెను బయటకు తీస్తుంది.