Trinayani August 11th: నాగుపాము వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక నాగరాజు వెంటనే డోర్ వెక్కి అక్కడున్న తీగ ను చుట్టుకొని ఉండటంతో అది చూసి ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక గాల్లో ఉన్నాడు అని హాసిని  ఆశ్చర్యపోగా గాలిలో కాదు తీగ మీద ఉన్నాడు అని గురువు చెబుతాడు. దానితో ఇంట్లో వాళ్లంతా మరింత ఆశ్చర్యపోతారు. తిలోత్తమా మాత్రం దెబ్బకు షాక్ అవుతుంది.


అక్కడ మీ కంటికి కనిపించని తీగను చూపించడానికి నాగరాజు వచ్చాడు అని.. ఎవరో అక్కడ తీగని పెట్టారు అని అంటాడు. ఇక నాగరాజును మెల్లిగా దిగి వెళ్లిపోమని చెబుతాడు గురువు. ఇక విశాల్ తో ఒక అడుగు ముందుకు వేస్తే నీ గొంతు తెగిపోయేది అని అనటంతో అందరూ మరింత షాక్ అవుతారు. వెంటనే విశాల్ కు నయని మాటలు గుర్తుకొస్తాయి. ఇక సమయానికి గాయత్రి పాప కాపాడటానికి వచ్చింది అని దురంధర అంటుంది.


సుమన కూడా అదే మాట అంటుంది. ఒక సుమన చేసిన పని వల్లే గాయత్రి పాపా అక్కడికి వచ్చింది అని హాసిని అంటుంది. బాబాయ్ తో ఎంత సేపు పిల్లల్ని ఎత్తుకుంటావు అన్నావు కాబట్టి.. పాపని కిందికి దింపడం వల్ల తను తన తండ్రిని కాపాడుకోగలిగింది అని అంటుంది. ఇక ఈ దోషానికి పరిహారం ఏంటి అని గురువుని అడుగుతుంది నయని.


దాంతో గురువు అమావాస్య మరుసటి రోజు వచ్చే చంద్ర దర్శనము నాడు విశాలాక్షి అమ్మని తలుచుకుంటే దోష పరిహారం తెలుస్తుంది అని.. అది ఒకరికి చూసే అవకాశం ఉంది అని అనటంతో అయితే అది నేను చూసి నయనికి చెబుతాను అని తిలోత్తమా అంటుంది. ఇక గురువు అక్కడ నుంచి వెళ్తూ సుమన జాగ్రత్త అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. సుమన ను ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడా అని చర్చలు చేసుకుంటారు.


ఆ తర్వాత తిలోత్తమా ఎవరికో ఫోన్ చేస్తూ ఉండగా సిగ్నల్ కలవక పోయేసరికి చిరాకు పడటంతో అక్కడికి వచ్చిన నయని ఎందుకు విశాల్ ను చంపాలి అనుకున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడే అక్కడికి వల్లభ కూడా వస్తాడు. ఏమి తెలియనట్టు తిలోత్తమా ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో.. వల్లభ డోర్ కి పెట్టిన తీగ మనమే పెట్టామేమో అని నయని పొరపాటు పడుతుంది అని అంటాడు.


మేము పెట్టినట్లు ఏమైనా సాక్షం ఉందా అని వాళ్ళు.. అయినా నీకు ముందే భవిష్యత్తు తెలుస్తుంది కదా.. ఇందులో మేము పెట్టినట్లు కనిపించిందా అని ప్రశ్నిస్తారు. దాంతో విశాల్ బాబు కు ఇలా జరుగుతుందని తెలుసుకున్నాను అని చెబుతుంది. కానీ అక్కడ అలా ఎవరు చేశారో అని మాత్రం తెలియదు మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని అంటుంది. ఇక నయని మాత్రం వాళ్లే చేశారు అని అస్సలు వదలను అని వార్నింగ్ ఇస్తుంది.


అప్పుడే దురంధర అక్కడికి వచ్చి ఏం జరిగింది అనడంతో చావు గురించి మాట్లాడుకుంటున్నాము అని వల్లభ అంటాడు. ఎవరికి పోయేకాలం అని దురంధర అనటంతో.. విశాల్ అని తిలోత్తమా అనటంతో నయని కోపం గా అరుస్తుంది. అయిన గురువు చెప్పినట్లు విశాల్ కు జాతకంలో దోషం ఉందని అన్నారు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అనటంతో.. ఆ దోషం వీళ్ళనుండే వస్తుంది అని నయని అని మళ్లీ ఆపుతుంది.


ఇక దురంధర నయనిని కూల్ చేసి అక్కడ నుంచి ఇంట్లోకి పంపిస్తుంది. భర్తకు ఏం జరుగుతుందో అన్న భయంతో అలా అనేసింది ఆ మాటలన్నీ పట్టించుకోకు అని దురంధర తిలోత్తమాతో అంటుంది. ఇక పావన మూర్తి, విశాల్ పిల్లలను ఆడిస్తూ ఉండగా అక్కడికి సుమన వచ్చి విశాల్ బావగారు నాతో ఆడుకుంటున్నారు అని అంటుంది.


ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అనటంతో.. మొదటి విషయం చెప్పకుండా బాగా ఊరిస్తుంది. ఇక నయని గట్టిగా అడగటంతో.. తన చేతిలో ఆస్తి డాక్యుమెంట్లు ఉన్నాయని.. బిడ్డ పుట్టాక ఆస్తిలో వాటా వస్తుంది కాబట్టి వాటి మీద మీరిద్దరూ సైన్ చేయాలి అని అంటుంది. నయని మాత్రం ఆస్తి రాదు అని గట్టిగా చెప్పేస్తుంది.


దాంతో సుమన బాగా కోపంగా కనిపిస్తుంది. హాసిని అక్కకు బాబు పుడితే రాసిచ్చావు కదా నాకెందుకు రాసి ఇవ్వవు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దాంతో విక్రాంత్ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు అని అంటాడు. ఇక దురంధర కూడా ఈ ఆస్తి అంత వాళ్ళదే.. ఒకప్పుడు తిలోత్తమా ఆస్తిని మొత్తం కరిగించి రోడ్డుపై పడితే విశాల్ బాబు తీసుకొని వచ్చాడు అని అంటుంది. అలా సుమన అక్కడ ఆస్తి గొడవల రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే విక్రాంత్ అసలు నిజానికి నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రిని కాదు.. అని అనటంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే విశాల్ విక్రాంత్ పై కోప్పడతాడు.


also read it : Krishnamma kalipindi iddarini August 10th: 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సీరియల్: గౌరీ పక్కన ఉండటానికి కంపురంగ ఫీలవుతున్న ఈశ్వర్, సౌదామినిపై నమ్మకం పెంచుకుంటున్న సునంద?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial