Naga Panchami Today Episode పంచమి నాగదేవత దర్శనం కోసం ధ్యానం చేస్తుంది. పంచమి దగ్గరకు ఫణేంద్ర వస్తాడు. నీకు నాగదేవత ప్రత్యక్షం కాదని.. నీకు నాగదేవత దర్శనభాగ్యం కలిగించనని ఫణేంద్ర అంటాడు. దీంతో పంచమి షాక్ అవుతుంది.


పంచమి: మోక్షాబాబుని కాపాడుకోవాలి అంటే నాకు కొన్ని శక్తులు కావాలి ఫణేంద్ర. ఎలా అయినా నాగదేవత ఆశీర్వాదాలు పొందాలి. ఇప్పుడు నాకు ఆ తల్లి కరుణ కటాక్షాలు కావాలి. 
ఫణేంద్ర: అది జరగని పని పంచమి. నాగదేవత నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయినా నువ్వు ఏదో ఒక విధంగా నన్నూ నాగదేవతనే కాకుండా మొత్తం నాగలోకాన్నే మోసం చేస్తున్నావ్. అందుకే నీకు నాగదేవత ప్రత్యక్షం కాదు. 
పంచమి: కరాళి తన ప్రతాపం మొదలు పెట్టింది ఫణేంద్ర. మోక్షాబాబుని కాపాడుకోలేకపోతే నాకు అంతకన్నా అవమానం లేదు.
ఫణేంద్ర: నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావ్ పంచమి. నాగ గండం నుంచి తప్పించడం ఎవరి తరం కాదు అలాంటి మోక్ష బతికాడు. అంత వరకు సంతోషించి ఇక నువ్వు నాగలోకం బయల్దేరు. 
పంచమి: చూస్తూ చూస్తూ మోక్షాబాబుని కరాళికి అప్పగించాలా..
ఫణేంద్ర: ఎవరికైనా ఎప్పుడైనా చావు తప్పదు. నీకు పిచ్చి పట్టింది పంచమి. నిన్ను నమ్మి నేను నాగదేవతకు మాటిచ్చాను. చూస్తేంటే నువ్వు ఈ జన్మకి నాగలోకం వచ్చేలా లేవు. 
పంచమి: నేను ఆ విషయం ఎప్పుడో చెప్పాను. మోక్షాబాబుకి ఏ ప్రమాదం లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే వస్తాను. కరాళి బతికున్న వరకు మోక్షాబాబుకి రక్షణ లేనట్లే.. 
ఫణేంద్ర: కరాళిని అంతం చేయడం అంత సులభం కాదు. మృత్యువు కళ్లేదుటే ఉన్నా కనిపెట్టలేనట్లు ఆ కరాళి నీ పక్కనే ఉన్నా నువ్వు తెలుసుకోలేవు.
పంచమి: కరాళి గురించి నీకు తెలుసా ఫణేంద్ర. కరాళిని నువ్వు చూశావా..
ఫణేంద్ర: నీకు అవన్నీ అనవసరం.. నీకు మోక్ష ప్రాణాలు ఎంత ముఖ్యమో.. నేను నాగదేవతకు ఇచ్చిన మాట కూడా అంతే ముఖ్యం. నువ్వు ఈ క్షణమే బయల్దేరు పంచమి.
మోక్ష: రాదు.. రాదు.. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు పంచమి నాగలోకం రాదు.. పంచమి నా భార్య. ఎవరూ తనని నా దగ్గర నుంచి తీసుకెళ్లలేరు. నీకు చేతనైతే తీసుకెళ్లు.
పంచమి: మోక్షాబాబు నాగలోకంతో వైరం వద్దు. 
ఫణేంద్ర: మా యువరాణిని తీసుకెళ్లడం నా బాధ్యత అందుకోసం నిన్ను చంపడానికి కూడా వెనుకాడను.. 
పంచమి: ఫణేంద్ర నీకు దండం పెడతాను.. మోక్షాబాబుని ఏం చేయకు. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను.
మోక్ష: పంచమిని నేను బతికుండగా తీసుకెళ్లడం కుదరదు.
ఫణేంద్ర: నీ నోటితోనే పలికావ్ మోక్ష నిన్ను చంపి పంచమిని తీసుకెళ్తా.
పంచమి: ఫణేంద్ర అంటూ చెంప మీద కొడుతుంది. నీ మాటలను నేను క్షమించను. నాగ దేవతకు చెప్పి నీకు శిక్ష వేయిస్తా.
ఫణేంద్ర: నాగదేవత దగ్గరే తేల్చుకుందాం. ఈ రాత్రికే నేను మోక్షని చంపి నిన్ను తీసుకెళ్తాను. ఇక మోక్షని ఎవరూ కాపాడలేరు. నీ రాకని ఎవరూ ఆపలేరు. ఫణేంద్ర మాటలకు పంచమి కళ్లు తిరిగి పడిపోతుంది. 


పంచమి: మోక్షాబాబు మిమల్ని పెద్ద ప్రమాదంలో పడేశాను. తలచుకుంటేనే భయం వేస్తుంది.
మోక్ష: నాకేం కాదు పంచమి. ఫణేంద్ర బెదిరించినంత మాత్రానా నాకు ఎదో అయినట్లు బాధ పడుతున్నావ్ అవేం జరగవు పంచమి. డోంట్ వర్రీ. 
పంచమి: లేదు మోక్షాబాబు జరిగిన దాన్ని మీరు అంత తేలికగా కొట్టేయకండి. ఇష్టరూప నాగులు పగపడితే తేలికగా వదలవు.
మోక్ష: అయినా ఫణీంద్రకు అంత పగ ఏముంది పంచమి. నీకు ఇష్టం లేకుండా నిన్ను నాగలోకం తీసుకెళ్లే హక్కు తనకు లేదు కదా.
పంచమి: మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను నాగలోకం వచ్చేస్తా అని ఫణేంద్రకు మాటిచ్చాను మోక్షాబాబు. అందుకే ఫణేంద్ర మిమల్ని కాపాడటం కోసం సాయం చేశాడు.
మోక్ష: అంటే నన్ను వదిలి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నావా.. నేను అప్పుడే చెప్పాను కదా పంచమి నా ప్రాణాలు పోయినా పర్లేదు నువ్వే ఇక్కడే ఉండాలి అని. నాకు ఏం క్షేమం అవసరం లేదు. నువ్వు చాలా తొందర పడి మాటిచ్చావ్. నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకోను.
పంచమి: ఒక్కసారి ఆలోచించండి మోక్షబాబు నిన్ను చంపాలి అని వచ్చిన ఫణేంద్ర నేను మాట ఇవ్వడంతో మీ ప్రాణాలు కాపాడాడు. నాగదేవతకు తెలిసినా మరణ శిక్ష తప్పదు అని తెలిసినా ధైర్యం చేసి సాయం చేశాడు. అందుకు కారణం నేను నాగలోకం వస్తాను అని చెప్పడమే.
మోక్ష: కావాలి అంటే నన్ను చంపేసి తీసుకెళ్లమని చెప్పు కానీ నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకోను. 
పంచమి: ఫణేంద్రకు కూడా సహనం నశించింది అందుకే మిమల్ని చంపి అయినా నన్ను తీసుకెళ్తా అని అంత మొండిగా చెప్పి వెళ్లాడు. 
మోక్ష: నాకు అర్థమైంది పంచమి నాకు మేఘనతో పెళ్లి చేసి నువ్వు నాగలోకం వెళ్లి పోవాలి అని నిర్ణయించుకున్నావు. నాకు ఎవరూ వద్దు నువ్వు పక్కనుంటే చాలు.
పంచమి: కానీ ఫణేంద్ర వదలడు మోక్షాబాబు. మీ ప్రాణాలు కాపాడలేకపోతే నేను బతికి ఉండటం అనవసరం. 


మరోవైపు చిత్ర ఇంటి నుంచి వెళ్లిపోదామని చిలకలు తినిపిస్తూ తన భర్తను కాకాపడుతుంది. ఇక జ్వాల ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది అని డాక్టర్‌కి చూపించాలి అని వరుణ్ జ్వాలతో అంటాడు. తనకు ఏం కాలేదు అని జ్వాల అంటుంది. మళ్లీ ఉన్నట్టుండి జ్వాలలోకి నంబూద్రీ ఆత్మ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: అనన్య నాగళ్ల - ‘తంత్ర’ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే!