Naga Panchami Today Episode కరాళి తంత్రి, కంత్రిలను పిలిచి పూజకు ఏర్పాట్లు చేయమని చెప్తుంది. మహాకాళి దర్శనం కోసం పూజ చేస్తుంది. దర్శనం అవ్వమని వేడుకుంటుంది. కానీ మహాకాళి కనిపించదు. దీంతో కరాళి ఒంటి కాలి మీద నిల్చొని ధ్యానం చేస్తుంది అయినా మహాకాళి రాదు. దీంతో మన్నించమని భక్తురాలిని ఆదుకో అని వేడుకుంటుంది. మహాకాళి దర్శనం ఇవ్వకపోతే తానే మహాకాళి దగ్గరకు వస్తాను అని కత్తితో తన పీక కోసుకుంటుంది. దీంతో మహాకాళి దర్శనం ఇచ్చి కరాళి తలను తిరిగి తన శరీరానికి అతికిస్తుంది.


కరాళి: నాకు తెలుసు మాతా ఈ భక్తురాలిని నువ్వు వదులుకోవు. 
మహాకాళి: నీ మొండి తనం నాకు తెలుసు కరాళి. కానీ అన్ని వేలలా ప్రాణాలను త్యజించడం మంచిది కాదు. 
కరాళి: మళ్లీ ఈ కరాళికి పూర్వ వైభవం కల్పించు మాతా.
మహాకాళి: అది నా చేతిలో లేదు కరాళి.
కరాళి: అన్ని సిద్ధం చేసుకున్నా మాతా ఒక్క అవకాశం ఇస్తే చాలు.
మహాకాళి: పంచమితో పోరాటం నీకు ప్రాణ సంకటం. మీఅన్న నంబూద్రీ కూడా ఇలాగే అని పంచమి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. నీకు ఆ గతి పట్టకూడదు అని నీ మనసు మరల్చాను. 
కరాళి: నేను ఒడిపోను మాతా. నేను పంచమిని చంపి నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను. 
మహాకాళి: నా భక్తురాలివి అని నీకు చెప్తున్నా పంచమి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దు. 
కరాళి: నేను మోక్షని తెచ్చి బలి ఇవ్వడం ఖాయం నాకు శక్తులు ప్రసాదించుచాలు.
మహాకాళి: నువ్వు పంచమి మీద గెలిచి మోక్షని తెచ్చినప్పుడే నీకు నీ శక్తులు ఇస్తాను. 
కరాళి: ఈ మాట చాలు మతా. నా శక్తి చూపిస్తా. 


వైదేహి పంచమి మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పంచమి గుడి నుంచి వస్తుంది. పంచమిని చూసిన వైదేహి ఆగు అని అంటుంది. ఏ ధైర్యంలో ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి పంచమి తాళి చూపిస్తుంది. 


పంచమి: ఈ ఇంట్లో మన ఇద్దరి స్థానం ఒకటే అత్తయ్య మీరు ముందు వచ్చారు నేను తర్వాత వచ్చాను. ఇద్దరం ఒక్క గూటి జీవులమే. మన ఇద్దరికీ ఈ ఇంటితో ఉన్నది తాళి బంధమే. మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. 
వైదేహి: నువ్వు నా గోటికి కూడా సరిపోవు. మర్యాదగా నా కొడుకుని వదిలేసి వెళ్లిపో లేదంటే.
పంచమి: చంపేస్తారా. ఏం చేయలేరు. నాకు నేనుగా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. 
వైదేహి: మోక్షకోసం ఓపిక పడుతున్నా లేకపోతే ఈ పాటికే నీ ఆనవాలు లేకుండా చేసేదాన్ని.
పంచమి: నాకు అర్థం కాని విషయం నా మీద మీకు ఎందుకు అంత కోపం మీ ఆస్తికి అంతస్థుకు సరిపోను అనా. అన్ని తెలిసే కదా మీరు నన్ను కోడలిగా చేసుకున్నారు.
వైదేహి: నాగ గండం నుంచి నాకొడుకును కాపాడుకోవడానికి దిక్కుమాలిన దానివైన నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. 
పంచమి: ఇప్పుడు నేను నా బాధ్యతల నుంచి తప్పుకోలేను. మోక్షాబాబు రక్షణగా ఉంటున్నాను.
వైదేహి: నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలు మా వాడికి రక్షణ అవసరం లేదు. 
పంచమి: భర్తకు శ్రీరామ రక్ష భార్య మాంగల్యం. నా భర్తని కాపాడుకోవడం నా ధర్మం. 
వైదేహి: నేను తలచుకుంటే నిన్ను ఈ లోకంలో లేకుండానే చేయగలను. పంచమి వెళ్లిపోతుంది. ఎదురుగా వైదేహి వెళ్లి నా కొడుకును వదిలేయాలి అంటే ఎంత డబ్బు కావాలో చెప్పు అని అంటుంది. తాళిని కొనడానికి ఎంత డబ్బు సరిపోదు అని పంచమి అంటుంది. డబ్బు కోసం మీరు మీ భర్తని అమ్ముకోగలరేమో నేను అమ్ముకోను అని అంటుంది. మోక్షతో నీకు పిల్లా సంతోషం ఏముందో చెప్పు అని వైదేహి అడుగుతుంది. ఇక పంచమిని తల పట్టుకోవడానికి చూస్తే పంచమి చేయి పట్టుకొంటుంది. 


జ్వాలలోకి నంబూద్రీ ఆత్మ చేరుతుంది. ఇక జ్వాల ఫణేంద్ర పాము అక్కడికి రావడంతో ఆ పాము పీక పట్టుకొని నలిపేయాలి అని చూస్తుంది. అది చూసి చిత్ర కళ్లు తిరిగి పడిపోతుంది. ఇక జ్వాలలోని నంబూద్రీ ఆత్మ ఫణేంద్ర పాముని నలిపి కింద పడేస్తుంది. 


నంబూద్రీఆత్మ: పేరు ఫణేంద్ర.. 
ఫణేంద్ర: ఎవరు మీరు జ్వాలలో చేరారు.
 నంబూద్రీఆత్మ: నాకు బాగా తెలుసు ఫణేంద్ర. పంచమి నిన్ను నా ఆశ్రమానికి తీసుకొచ్చింది. 
ఫణేంద్ర: అయితే ఏంటి నువ్వు ఆత్మవై నన్ను వెంబడిస్తున్నావ్ ఏంటి. 
నంబూద్రీఆత్మ:  నాకు ఎక్కడా లేని పగ నిన్ను చూడగానే చంపాలి అనిపించింది. 
ఫణేంద్ర: నేను నీకు ఏం చేశాను. నువ్వు నన్ను చంపాలి అన్నా చంపలేవు నంబూద్రీ. ఈ ఇంట్లో మేఘన రూపంలో ఉండేది నీ చెల్లి కరాళి అని పంచమికి చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు. నువ్వు ఆత్మ రూపంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేయలేను. కానీ నీ చెల్లెలు కరాళిని కాటేసి చంపేస్తాను. 
నంబూద్రీఆత్మ:  వద్దు ఫణేంద్ర.. ఈ ఇంట్లో నీ కార్యం నువ్వు చేసుకో నా చెల్లెలు పని తను చేసుకుంటుంది. 
ఫణేంద్ర: మీరు ఏమైనా చేసుకోండి పర్వేలేదు. పంచమికి హాని కలిగిస్తే మాత్రం కరాళి ప్రాణాలు పోతాయి. నేను పంచమిని నాగలోకం తీసుకెళ్లి పోవాలి. 
నంబూద్రీఆత్మ: నా చెల్లి మోక్షని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతుంది. అందుకే ఇక్కడే ఉంటుంది. 
ఫణేంద్ర: మోక్షకు మీ చెల్లికి త్వరగా పెళ్లి చేయండి పంచమిని నేను తీసుకెళ్లిపోతా. సరే నేను వెళ్తాను. మరో వైపు జ్వాలకు ఆత్మ వదులు తుంది. దీంతో చిత్ర పడిపోవడం చూసి లేపుతుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మమ్ముట్టి: మార్చి 23న మమ్ముట్టి 'భ్రమయుగం' తెలుగు వెర్షన్‌ - టికెట్‌ ధరలపై మేకర్స్‌ కీలక నిర్ణయం?