Naga Panchami Serial Today Episode 


పంచమి: ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఆడుకున్న దాన్ని కానీ ఇక్కడే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుందని ఊహించనేలేదు. నా మరణంతోనైనా నాగలోకం మోక్ష బాబుని వదిలేయాలి. నా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన మోక్ష బాబు కోసం నేను ఏం చేసినా తక్కువే. ఇక నేను ఎవరికీ సమస్య కాకూడదు అనుకుంటూ ఏడుస్తూ ముందుకువెళ్తుంటే సుబ్బు వచ్చి పంచమి చేయి పట్టుకొని ఆపుతాడు.  
క్షమించు సుబ్బు.. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నిన్ను పట్టించుకోవడమే లేదు. నేను చాలా తప్పు చేశాను సుబ్బు.
సుబ్బు: పర్వాలేదు పంచమి నాకు ఏ ఊరు.. ఎవరూ కొత్తేమి కాదు. కానీ నువ్వే నీ ఊరిలో ఒంటరి తనంతో బాధపడుతున్నావు.
పంచమి: అదేం లేదు సుబ్బు నా కథ అంతా నీకు తెలుసు. నా మనసు నా ప్రాణం అంతా మోక్ష బాబు చుట్టే తిరుగుతూ ఉంటుంది. 
సుబ్బు: తనని కాపాడుకోవడానికే కదా మహా మృత్యుంజయ యాగం తలపెట్టావు
పంచమి: అవును సుబ్బు ఈ కార్తీకమాసంలో ఆ సమస్యలు తొలగిపోవాలి
సుబ్బు: సమస్యలకు అంతం అంటూ ఉండదు పంచమి అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. అదే జీవితం. వాటికి భయపడి పారిపోకూడదు
పంచమి: నా జీవితంలో నాకు నువ్వు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను సుబ్బు. ఈ అల్పురాలు నీకు రుణపడి ఉంటుంది. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోలేను. అంత సమయం కూడా లేదు. ఇంకా నేను నిన్ను నా దగ్గర ఉంచుకోవడం సముచితం కాదు. నువ్వు మీ ఊరు వెళ్లిపో సుబ్బు
సుబ్బు: అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు. ఆవేశంలో అనాలోచితంగా తీర్చుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండవు
పంచమి: ఆలోచించేంత సమయం నాకు లేదు సుబ్బు. ఇంక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు మీ ఊరు వెళ్లిపో సుబ్బు. నువ్వు నాకు కనిపించిన ప్రాంతం ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. మీ ఊరు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటుంది
సుబ్బు: నాకు వెళ్లడం సమస్య కాదు పంచమి.. ముందు ముందు నీకు నా అవసరం చాలా ఉండొచ్చు
పంచమి: ఇక నాకు ఎవరి సాయంతోనూ పని ఉండదు సుబ్బు. ఇక నన్ను ఏ కష్టమూ దరి చేరదు. ఇప్పుడు నా ముందు ఉన్న బాధ్యతలు రెండే. ఒకటి నిన్ను క్షేమంగా మీ ఊరికి పంపించడం. రెండోది ఈ రాత్రికి నా భర్తను కాపాడుకోవడం. అందుకే చెప్తున్నా సుబ్బు నువ్వు ఒక్కడివే వెళ్లగలవా సుబ్బు లేదంటే
సుబ్బు: నా గురించి ఆలోచించకు పంచమి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోవాలి అనుకుంటే అక్కడికి వెళ్లిపోతాను. ప్రస్తుతానికి నేను ఇక్కడే నీతోనే ఉంటాను
పంచమి: కుదరదు సుబ్బు. ఈ రోజు కార్తీక పౌర్ణమి ఇక కొద్ది సేపట్లో చీకటి పడిపోతుంది. నేను పాములా మారిపోతాను. తిరిగి పంచమిగా కనిపిస్తానో లేదో తెలీదు. అప్పుడు నిన్ను పట్టించుకునేవారే లేరు. అందుకే చెప్తున్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో
సుబ్బు: నువ్వు ఇప్పుడు ఆందోళనలో ఉన్నావు. ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. మధ్యలో వదిలి వెళ్లిపోకూడదు. 
పంచమి: నేను అన్ని ఆశలు వదిలేసుకున్నాను సుబ్బు. నేను వెంటనే వెళ్లి మోక్షా బాబుకి కొన్ని జాగ్రత్తలు చెప్పి రావాలి. నువ్వు బయలుదేరు సుబ్బు. చీకటి పడే లోపు నా బాధ్యతలు తీరిపోవాలి
సుబ్బు: నేను వెళ్తే మళ్లీ రాను పంచమి. 
పంచమి: రావొద్దు సుబ్బు నువ్వు మీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్లి పోతే చాలు. నిన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నందుకు నన్ను క్షమించు. ఇక సుబ్బు వెళ్లనూ అంటే పంచమి తన మీద ఒట్టు వేసుకొని సుబ్బుని పంపించేస్తుంది. (నువ్వు వెళ్లి పోతుంటే నా జీవం పోతున్నట్లు ఉంది సుబ్బు.. ఈ పాపాత్మురాలిని క్షమించు సుబ్బు అంటూ ఏడుస్తుంది) 


మరోవైపు జ్వాలా, చిత్రలు ఆస్తి మొత్తం సమానంగా పంచుకోవాలి అని రకరకాల ప్లాన్‌లు వేస్తారు. ఇక మోక్ష చనిపోవడం ఖాయం అంటూ మాట్లాడుకుంటారు. ఇంతలో తమ భర్తలు వస్తే వాళ్లకి పనులు చెప్తారు. ఇప్పుడు చేయలేమని వాళ్లు చెప్తే కోర్టులు కేసులు అంటూ బెదిరిస్తారు. 


మోక్ష-మోహిని


మోక్ష: ఎక్కడికి వెళ్లావు మోహిని
మోహిని: ఎక్కడికి వెళ్లినా నాకు మూలికలు, ఆకు పసరులతోనే కదా పని.. వాటిని వెతుక్కుంటూ వెళ్లాను.
మోక్ష: పంచమి ఇప్పుడే వస్తాను అని వెళ్లింది. ఈ రాత్రికి ఏం జరుగుతుందా అని నాకు టెన్షన్‌గా ఉంది మోహిని
మోహిని: భయపడకు మోక్ష నీకు తోడుగా నేనున్నాను. పంచమి పాముగా మారగానే మనం అనుకున్నట్లుగా బంధించేద్దాం. 
మోక్ష: పంచమి ప్లాన్ ఏంటో తెలీడం లేదు మోహిని. నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. అంటే ఈ రాత్రికి కూడా నేను ఇక్కడే ఉండాలి. మరి పంచమి రాత్రంతా ఎక్కడ ఉంటుందో.. తను నన్ను కాటేయకుండా ఎలా తప్పిస్తుందో తెలీడం లేదు మోహిని
మోహిని: పంచమి చాలా తెలివైనది మోక్ష. మిమల్ని రక్షించడానికి తనేదో ఆలోచన చేసి ఉంటుంది. కానీ మనం కూడా అందుకు తగ్గట్టు రెడీగా ఉండాలి. ఎలా అయినా మనం ఈ రాత్రికి ఆపాము విషం సంపాదించగలిగితే తర్వాత ఎప్పుడూ నువ్వు ఆ పాములకు భయపడాల్సిన అవసరం రాదు. ఆలోగా నేను ఆ విషానికి విరుగుడు కనిపెట్టేస్తాను
మోక్ష: పంచమి పాముగా మారగానే చాలా తీవ్రతగా ఉంటుంది. ఏ మాత్రం గాయం కాకుండా బంధించి విషం తీయాలి. అది ఎంత వరకు సాధ్యమో నాకు తెలీదు
మోహిని: అవన్నీ నేను చూసుకుంటాను మోక్ష నా దగ్గర కొన్ని ఆకులు ఉన్నాయి. వాటి వాసన పీల్చగానే ఏ పాము అయినా కొద్ది సేపు ఏం అర్థంకానట్లు మత్తుగా ఉండిపోతుంది. 
మోక్ష: పంచమి వచ్చాక తను ఏం చెప్తుందో తెలిస్తే కానీ మనం ఏం చేయాలో తెలీదు. 
మోహిని: నేను పక్కనే ఉంటాను మోక్ష. మీకున్న అనుమానాలు అన్నీ పంచమిని అడిగి తెలుసుకోండి. మిమల్ని ఇక్కడే పెట్టి తను ఎక్కడికి పోతుంది. రాత్రంతా తను ఎక్కడ ఉంటుంది అనేది ముఖ్యంగా మనకు తెలియాలి. నేను పంచమి కంట పడకూడదు మోక్ష. తనకి నామీద సదాభిప్రాయం లేదు. నేను చీకటి పడ్డాక వచ్చి కలుస్తాను 


మరోవైపు మృత్యుంజయ యాగానికి సప్తరుషులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇక ఈ యాగం అకాల మరణం నుంచి విముక్తి పొందేందుకు శివున్ని వేడుకునేందుకు ఈ యాగం చేస్తారని చెప్తారు. ఈ యాగాన్ని సంజీవని యాగం అని కూడా అంటారని చెప్తారు. ఈ యాగం ద్వారా శివున్ని శాంతింపజేస్తే మృత్యువు నుంచి బయట పడొచ్చని చెప్తారు. ఇక ఈ యాగం జరిపించేటప్పుడు చాలా దుష్టశక్తులు ఆటకం కలిగించడానికి చాలా ప్రయత్నిస్తాయి అని వాటిని పట్టించుకోకుండా శివుడి మీద ధ్యాస ఉండేలా చూసుకోవాలని సూచిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.