Jagadhatri Today Episode: గదిలో ఎవరో ఉన్నారని వెతుకుతున్న ధాత్రిని కేదార్ పిలుస్తాడు. ఫోటోలో ఉన్న వాళ్ళని చూపించి వాళ్ల గురించి చెప్తాడు.


ధాత్రి : నేను రూమ్ క్లీన్ చేస్తాను నువ్వు వెళ్లి ఫ్రెష్ ఆవ్వు అని అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేదార్.


ధాత్రి వెనక్కి తిరిగి ఉన్న సమయంలో యువరాజ్ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఆ తర్వాత ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించి ఈయన ఎవరు అని కేదార్ ని అడుగుతుంది ధాత్రి.


కేదార్: ఈయన సూరి మామ. ఈయన మనకి చాలా సాయం చేశాడని మా అమ్మ చెప్తూ ఉండేది.


ఇంతలో సూరి మామ కౌషికి వాళ్ళ ఇంటికి వచ్చి కారు రెంట్ కి ఇచ్చాను కదా ఆ డబ్బులు ఇవ్వండి అని అక్కడే ఉన్న బూచిని అడుగుతాడు.


బూచి : డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు.


అప్పుడే అటుగా వచ్చిన సుధాకర్ సూరిని చూసి భయంతో వణికిపోతూ దాక్కోవడం గమనిస్తాడు బూచి.


బూచి: ఈ ఎమోషన్ ఏదో మనకి పనికొచ్చే లాగా ఉంది అనుకుంటాడు. సూరి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తాడు.


అప్పుడే మాట్లాడుకుంటూ టెర్రస్ గార్డెన్ లోకి వస్తారు ధాత్రి దంపతులు. ధాత్రి అప్పుడే సూరిని చూసి కేదార్ కి చూపిస్తుంది. అతనిని పట్టుకోవడం కోసం ఇద్దరూ కిందకి దిగివచ్చే లోపు అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు.


ధాత్రి : కంగారు పడకు కేదార్ అతను కార్లు అద్దెకిస్తాడు అని తెలిసింది కదా మనం కొంచెం ఎఫర్ట్ పెడితే అతనిని కనుక్కోవచ్చు.


కేదార్: అప్పుడు ఈ సుధాకర్ గారే నా తండ్రి అని నిరూపించుకోవచ్చు అని ఆనందపడతాడు.


ధాత్రి : మాధురి కేసు గురించి తేలిన వెంటనే ఈ సూరి మామ సంగతి చూద్దాం.


కేదార్: మన స్టాఫ్ అప్పుడే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తీసుకుని రిసార్ట్ దగ్గరికి వెళ్లిపోయారంట అంటాడు.


ధాత్రి దంపతులు కూడా రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే అక్కడ వాళ్ల స్టాఫ్ వుంటారు.


ధాత్రి : రిపోర్టు చూసి తల మీద రెండు సార్లు కొట్టినట్లుగా ఉంది.. మాధురి మాత్రం ఒకసారే కొట్టానని చెప్పింది అంటుంది. అలాగే కొట్టిన దెబ్బ తీరు చూస్తే అతను లెఫ్ట్ హ్యాండర్ అయి ఉంటాడు అంటుంది.


ధాత్రికి రెడ్డి గుర్తుకొస్తాడు.. అతను ఎడమచేత్తో సిగరెట్ తాగడం గుర్తుకువస్తుంది. ఈ విషయం తన స్టాఫ్ అయిన కిరణ్ కి చెప్పి నువ్వే హ్యాండిల్ చెయ్యు అంటుంది.


రెడ్డిని పట్టుకొని విచారిస్తే అతను భయపడిపోతూ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను శివని రెచ్చగొట్టి పంపించిన మాట నిజమే కానీ నేను వెళ్లేసరికి అతను చనిపోయి ఉన్నాడు అంటాడు. అది నిజమే అని నిర్ధారించుకుంటారు పోలీసులు.


కేదార్: ఫోరెన్సిక్ ల్యాబ్ లో మాధురి వేలిముద్రలు ఉన్నాయి, ఇప్పుడు తనని అరెస్టు చేస్తారేమో భయంగా ఉంది.


ధాత్రి: లేదు కేదార్, నిజం మన కళ్ళముందే ఉన్నట్లు అనిపిస్తుంది మనమే దానిని గమనించలేకపోతున్నాం అంటూ మళ్ళీ సిసిటీవీ ఫుటేజ్ ఒకసారి చూస్తుంది.


ధాత్రి: దీనికి ఒక థియరీ ఉంది, ఇప్పుడు పోలీసులు మాధురిని అరెస్టు చేయటానికి వెళ్తారు అంటుంది.


పోలీసులు మాధురి ఇంటికి వెళ్లి శివ హత్య విషయంలో మాధురిని అరెస్టు చేస్తున్నాం అని చెప్తారు. ఆ మాట వినేసరికి సుధాకర్ కి ఆయాసం ఎక్కువైపోతుంది అతనికి ఇన్హెలర్ ఇచ్చి కూల్ చేస్తారు ఇంట్లో వాళ్ళు.


వైజయంతి: వచ్చేటప్పుడు ఎవరి ఇంటికి వస్తున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము తెలుసుకో అక్కర్లేదా, అయినా మా అమ్మాయి హత్య చేయడమేమిటి?


పోలీస్: అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేయడానికి వచ్చాం అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.


కౌషికి: మీరేదో పొరపడినట్లుగా ఉన్నారు మా చెల్లి ఎప్పటికీ హత్య చేయదు అని అంటుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.