Vasanthi Krishnan : ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలోకి ఒక్కసారి ఎంటరైన తర్వాత చాలావరకు బుల్లితెర ప్రేక్షకులకు కంటెస్టెంట్స్ అంతా దగ్గరయిపోతారు. ఒక చిన్న సైజ్ సెలబ్రిటీలుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టినవారు.. బయటికి వెళ్లేవరకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటారు. అలాంటి కంటెస్టెంట్‌లో ఒకరు వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన వాసంతి.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, ముద్దు ముద్దు మాటలతో యూత్‌ను ఫిదా చేసింది. ఇప్పటికీ వాసంతిని క్రష్‌గా భావించే యూత్ ఉన్నారు. అలాంటి ముద్దుగుమ్మ.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చింది.


బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్‌గా..
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు వాసంతి కృష్ణన్ అంటే ఎవరు అని చాలామంది ప్రేక్షకులకు తెలియదు. మోడల్‌గా, సీరియల్ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెమెరా ముందు పనిచేసినా.. ప్రేక్షకుల దగ్గర మాత్రం గుర్తింపు సాధించలేకపోయింది వాసంతి. అలాంటి తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చి.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. చాలారోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగలిగింది. టాస్కుల విషయంలో తను యాక్టివ్ కాదని, ఆటల్లో చురుగ్గా లేదని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాసంతి.. వారిని పట్టించుకోకుండా తనకు వీలైనంత గట్టి పోటీ ఇచ్చింది. అర్జున్ కళ్యాణ్ లాంటి కంటెస్టెంట్‌తో ఫ్రెండ్‌షిప్ వల్ల కూడా వాసంతి వైరల్ అయ్యింది.


ప్రేమ పెళ్లి..!
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వాసంతి కృష్ణన్.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అంతే కాకుండా స్టార్ మా నిర్వహించిన బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా కనిపించింది. అందులో అర్జున్ కళ్యాణ్‌తోనే కలిసి స్టెప్పులు వేసింది. కానీ ఇందులో కూడా తను విన్నర్ కాలేకపోయింది. తనకు కెమెరా ముందు అవకాశాలు ఎక్కువగా రాలేకపోయినా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో ఒక్కసారిగా తన ఎంగేజ్‌మెంట్ అయినట్టు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆర్టిస్ట్ అయిన కళ్యాణ్ శివ్‌ను వాసంతి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం.


ఇంటిపేరును దోచుకుంటున్నాను..
ముందుగా వాసంతి కృష్ణన్ ఎంగేజ్‌మెంట్ విషయాన్ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ షేర్ చేసిన వీడియో ద్వారా బయటపడింది. వాసంతి ఎంగేజ్‌మెంట్‌కు తనతో పాటు హౌజ్‌లో ఉన్న బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్‌తో పాటు అంతకు ముందు సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వాసంతిని ట్యాగ్ చేశారు. తను పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ శివ్ కూడా మోడల్‌గానే చేస్తున్నాడు. ‘తను నా మనసు దోచుకున్నాడు. అందుకే నేను తన ఇంటిపేరును దోచుకుంటున్నాను. ఎంగేజ్‌మెంట్ అయ్యింది. హ్యాపీ లైఫ్’ అంటూ వాసంతి కృష్ణన్.. తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలకు తెగ లైకులు వచ్చిపడుతున్నాయి.






Also Read: శుభశ్రీని కలిసిన ‘బిగ్ బాస్’ గౌతమ్ - పెళ్లిపై క్లారిటీ!