Naga Panchami Serial Today Promo: రోజు రోజుకు నాగ పంచమి సీరియల్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ముందంజలో దూసుకుపోతుంది. తాజాగా వచ్చిన ప్రోమో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


డిసెంబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరగనుందంటే..


మోహిని మరోసారి తన క్షుద్ర శక్తులను మోక్ష మీద ప్రయోగిస్తుంది. దీంతో మోక్ష పూర్తిగా మోహిని మాయలో పడిపోతాడు. ఇక మోహిని తన వశమైన మోక్షని తన ఆశ్రమానికి ఆమె వెంట తీసుకెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న పంచమి వాళ్లు వెళ్తున్న దారికి అడ్డుపడుతుంది. చేతిలో కర్ర.. కళ్లలో కోపంతో శివంగిలా మోహినికి ఎదురుగా నిల్చొంటుంది. పంచమిని చూసిని మోహిని షాక్ అవుతుంది. ఏయ్ అంటూ కేకవేస్తూ పంచమి మోహిని తల పగలగొడుతుంది. ఇక పక్కనే ఉన్న ఓ పెద్ద బండరాయిని చేతిలో పట్టుకొని మోహిని మీదకు వెళ్తుంది. దీంతో ప్రోమో ముగుస్తుంది. మొత్తానికి పంచమి పాము ఈసారి కూడా మోక్షను కాటేయలేదు.



ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..


పంచమి దగ్గరకు మోక్షను తీసుకెళ్లిన మోహిని తనలో తాను పంచమిని బంధించి తన వెంట తీసుకెళ్లిపోయి నాగమణిని తన సొంతం చేసుకొని తన అన్నని కాపాడుకోవాలని మనసులో అనుకుంటుంది. ఇక మోక్ష నుంచి శక్తులు తన వశం చేసుకొని పంచమిని శాశ్వతంగా తన దగ్గర బంధీగా ఉంచేయాలి అని అనుకుంటుంది. మోహిని కుట్రను కనిపెట్టలేని మోక్ష ఆమె వెంట పంచమి కోసం వెళ్తుంటాడు. ఇక ఇద్దరూ పంచమి ఉన్న చోటుకు వెళ్తారు.


అక్కడ పంచమి ఐదు తలల పాములా కనిపిస్తుంది. అది చూసి షాకైన ఇద్దరూ పరుగులు తీస్తారు. మోహిని పంచమి పాము మీద మంత్ర శక్తులు ప్రయోగించాలని అని చూస్తే పంచమి పాము తన తోకతో మోహినిని బంధించి చెట్టుకు విసిరి కొడుతుంది. తర్వాత మోక్ష ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి కాటేయడానికి ప్రయత్నిస్తుంది. పరుగు పెట్టి అలసిపోయిన మోక్ష ఇక తన భార్య పంచమి పాము నుంచి తన చావును ఎవరూ ఆపలేరు అని చేతులెత్తేస్తాడు.


మరోవైపు అగ్నికి పూర్ణాహుతి సమర్పించడంతో సప్తరుషులు మోక్ష తల్లిదండ్రులతో చేయించిన మహా మృత్యుంజయ యాగం దిగ్విజయంగా పూర్తవుతుంది. నాగకన్యలు, ఫణేంద్రలు యాగం ఆపలేక విఫలమవుతారు. యాగం పూర్తికావడంతో మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని రుషులు వైదేహి దంపతులకు చెప్తారు. ఇక ఐదు తలల పాముగా ఉన్న పంచమి స్ఫృహ కోల్పోయిన మోక్ష దగ్గర పంచమిగా పడుకొని ఉంటుంది.


ఇక రుషులు సుబ్బుని కలుస్తారు. తాను చెప్పినట్లు యాగాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసినందుకు సుబ్బు రుషులకు కృతజ్ఞతలు చెప్తాడు. ఈ పౌర్ణమి రోజున కూడా తన భార్య పంచమి పాము నుంచి మోక్ష తప్పించుకున్నాడు. చూడాలి మరి పంచమి తన భర్తను భవిష్యత్తులో ఎలా కాపాడుకుంటుందో.. ఇక మోక్ష తప్పించుకున్నందు నాగ దేవత ఏం చేయనుందో.. ఫణేంద్ర యాగం ఆపలేకపోయినందుకు ఆయనపై నాగదేవత ఏం నిర్ణయం తీసుకోనుందో సీరియల్ చూస్తే తెలుస్తుంది.


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : స్వప్నను గెంటేసేందుకు రుద్రాణి కొత్త ప్లాన్ – కావ్యపై రివెంజ్ తీర్చుకున్న రాజ్