Naga Panchami Serial Today Episode :


ఫణేంద్ర: యాగం దగ్గరకు వెళ్లేందుకు మన శక్తి సరిపోవడం లేదు.. యాగ పండితులు మహా శక్తివంతుల్లా ఉన్నారు. వారి మంత్ర శక్తిని ఛేదించి మనం లోపలికి వెళ్లలేం
నాగకన్యలు: యాగం భగ్నం చేయకపోతే నాగదేవతకు మన మీద కోపం వస్తుంది. అందుకోసం మనకు పెద్ద శిక్ష వేసినా ఆశ్చర్యం లేదు
ఫణేంద్ర: భయపడకండి.. ఇక్కడి పరిస్థితుల్ని నాగదేవతకు వివరించి చెబుదాం
నాగకన్యలు: మీరు యువరాజు కాబట్టి నాగ దేవత మిమల్ని శిక్షించదు. కానీ మాకు మరణ శిక్ష తప్పదు. అది ఏదో ఇక్కడే అనుభవిస్తాం. మేము ఆహుతి అయినా పర్వాలేదు. వెళ్లి యాగం ఆపేందుకు ప్రయత్నిస్తాం
ఫణేంద్ర: తెలిసి తెలిసి ఆత్మహుతి అవ్వడం కరెక్ట్ కాదు. అక్కడ యాగం చేస్తుంది మామూలు వాళ్లు కాదు. ఇలాంటి వన్నీ ఊహించే మన యువరాణి పగడ్భందీగా జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఇప్పుడు ఇక్కడే కాచుకొని కూర్చొందాం. యాగం పూర్తయేందుకు సమయం పడుతుంది. ఆలోపు మనకు ఏ చిన్న అవకాశం అయినా దొరకకుండా ఉండదు. ఆ సమయంలో మనం వెళ్లి దాడి చేద్దాం. యాగం పూర్తిగా చివరి వరకు చేస్తే గానీ ఆ ఫలితం దక్కదు ఆ అవకాశం కోసం ఇక్కడే ఎదురుచూద్దాం. అప్పగించి పని మధ్యలో మానేసి వెళ్లిపోవడం సరైన పద్ధతి కాడు. చివరి వరకు ఉండి చూద్దాం. 


మోక్ష- మోహిని 


మోహిని: మనసులో.. పంచమి వచ్చేస్తున్నా నిన్ను బంధించి తీసుకెళ్లడం మోక్షని నా సొంతం చేసుకొని తన దగ్గర నుంచి శక్తులు నా వశం చేసుకోవడం ఈ రాత్రికి జరిగిపోతాయి. ఇక నువ్వు శాశ్వతంగా నా దగ్గర బందీగా ఉండిపోతావ్ పంచమి. ఇక నాగమణి నా సొంతం అయిపోయినట్లే.. ఇక నాకు తిరుగు ఉండదు.
మోక్ష: మోహిని ఎలా అయినా నా పంచమిని కాపాడుకోవాలి మోహిని.. నువ్వు చేసిన సాయం నేను నా జన్మలో మర్చిపోలేను. నీకు ఈ విద్య తెలుసుకాబట్టి నా పంచమిని నేను బతికించుకునే అవకాశం అయినా దక్కింది. త్వరగా అక్కడికి తీసుకెళ్లు మోహిని.
మోహిని: దగ్గర్లేనే ఉన్నాం మోక్ష. ఇదిగో ఇక్కడే ఉండాలి. (ఇక అక్కడ ఐదు తలల పాముని చూసిన మోహిని, మోక్ష చాలా భయపడతారు.) భయపడకు మోక్ష పంచమి ఐదు తలల పాములా మారింది.
మోక్ష: నేను నమ్మను ఇది వేరే పాము 
మోహిని: ఇష్టరూపధారి పాముల జాతి నాకు బాగా తెలుసు మోక్ష ఆ పాములు ఎన్ని రూపాలు అయినా మారుతాయి. నువ్వు నా వెనకే ఉండు. నా మంత్ర శక్తిని ప్రయోగించి ఆ పామును కట్టడిచేస్తాను. ఇక మోహిని పాము మీద మంత్ర ప్రయోగాలు చేస్తుంటుంది
మోక్ష: మోహిని ఆ పాముని ఏం చేయకు. ఆ పాము నిజంగా నా భార్య పంచమి అయితే తనకు దెబ్బలు తగులుతాయి
మోహిని: నిన్ను కాటేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను మోక్ష. ఆ పాముకి ఇప్పుడు మనం ఎవరో తెలీదు. నీ మీద పగపట్టింది కాబట్టి నిన్ను పసిగట్టి కాటేస్తుంది. నువ్వు చనిపోకూడదు. పంచమికి ఏం కాకూడదు. అందుకే నాకు తెలిసిన చిన్న చిన్న మంత్ర శక్తులను ప్రయోగిస్తున్నాను. 


ఇక పంచమి పాము బుసలు కొడుతూ మోహిని, మోక్ష వైపునకు వస్తుంటుంది. ఇద్దరూ భయంతో పరుగులు తీస్తారు. ఇక ఆ పాము నిన్ను వదలదు వెళ్లిపో అని మోహిని మోక్షని పంపేస్తుంది. మోక్ష పరుగులు తీస్తాడు. ఇక మోక్ష వెళ్లిపోయాడు కాబట్టి ఆ పామును ఎలా అయినా బంధించేయాలి అనుకొని మోహిని పాము దగ్గరకు వెళ్తుంది. దీంతో పాము తన తోకతో మోహినిని చుట్టేస్తుంది. దీంతో తనని కాపాడమని మోహిని మహాంకాళిని వేడుకుంటుంది. పాము మోహిని తలను రాయికి తగిలించి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుంది. మరోవైపు యాగం దగ్గర ఫణేంద్ర, నాగకన్యలు కాచుకు ఉంటారు. 


మోక్ష పరుగులు తీస్తుంటే ఐదు తలల పాము మోక్ష వెంటే వస్తుంటుంది. ఇక మోక్ష "పంచమి నేను నమ్మలేకపోతున్నా.. నువ్వు ఇలా పాములా మారితే నేను ఎవరినో నీకు తెలీదు పంచమి ఇక నా చావును ఎవరూ తప్పించలేరు. తప్పించలేరు." అని పాముతో అంటాడు. మరోవైపు పాము మోక్షని కాటేయడానికి వస్తుంటుంది. 


ఇక యాగం దగ్గర వైదేహి దంపతులకు అగ్నికి పూర్ణాహుతి సమర్పించమని రుషులు చెప్తారు. మరోవైపు మోక్ష స్ఫృహ కోల్పోతాడు. మహా మృత్యుంజయ యాగం కూడా సంపూర్ణంగా పూర్తవుతుంది. మీ కోరిక నెరవేరుతుంది అని రుషులు మోక్ష తల్లిదండ్రులకు చెప్తారు. ఇక మోక్ష దగ్గరకు పంచమి చిన్నపాములా మారి వస్తుంది. తర్వాత పంచమిగా మారిపోతుంది. 


రుషులు సుబ్బు దగ్గరకు వెళ్తారు. యాగం దిగ్వజయంగా పూర్తయినందుకు రుషులకు సుబ్బు కృతజ్ఞతలు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.