Naga Panchami Today Episode కరాళి వేసిన మంత్రించిన గాజుల కారణంగా పంచమి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంది. ఇంట్లో అందరూ కంగారు పడితే నాగేశ్వరి నర దిష్టి తగిలింది వెంటనే దిష్టి తీయాలి అని చెప్తుంది. అందరూ ఒకే అంటే ఎవరూ చూడకుండా తీయాలి అని పంచమిని తన గదికి తీసుకెళ్తుంది.
పంచమి: నొప్పి తట్టుకోలేకపోతున్నా కడుపులో తిప్పుతుంది.
నాగేశ్వరి: ఈ గాజులు తీసేయాలి.
పంచమి: వద్దు. అవి పూజ చేసిన గాజులు అని చెప్పింది. అవి తీస్తే నా భర్త ప్రాణాలకు ప్రమాదం.
నాగేశ్వరి: అదంతా అబద్ధం అమ్మ. ఆ గాజులు తొడిగింది కరాళి.
పంచమి: అయితే మీరు ఎవరు. కరాళి మీకు ఎలా తెలుసు. ముందు మీరు ఎవరో చెప్పండి అప్పుడే మీ మాటలు నమ్ముతాను.
నాగేశ్వరి: నాగేశ్వరిని యువరాణి. నా కళ్లలోకి చూడు నేను ఎవరో నీకే తెలుస్తుంది. పంచమి కళ్లలోకి చూస్తే పాములా కనిపిస్తుంది. పంచమి లేచి ఎమోషనల్ అయి నాగేశ్వరిని హగ్ చేసుకుంటుంది. నాగేశ్వరి పంచమి చేతికి ఉన్న గాజులు తీసేస్తుంది. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం యువరాణి. నేను ఇక్కడే నీకు రక్షణగా ఉన్నాను. ఆ కరాళితో జాగ్రత్తగా ఉండు. మోక్ష, వైదేహి అందరూ కంగారుగా లోపలికి వస్తారు.
నాగేశ్వరి పంచమికి ఏం కాలేదు అని చెప్పి మోక్ష వాళ్లకి కంగారు పడొద్దని చెప్తుంది. ఇక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకురమ్మని చెప్పి అందులో కరాళి పంచమికి వేసిన గాలు వేస్తుంది. దీంతో ఆ గాజులు కాలి బూడిద ఎగిసిపడుతుంది. అందరూ షాక్ అవుతారు.
నాగేశ్వరి: అమ్మాయి గారి మీద దుష్ట శక్తులను ప్రయోగించారు. ఇలాంటి విషయాలు నాకు తెలుసు కాబట్టి గుర్తించాను. కొంచెం ఆలస్యం అయి ఉంటే తల్లికి, కడుపులో బిడ్డకు ప్రమాదం జరిగేది. కొత్త వాళ్లని ఇంట్లోకి రానివ్వకండి. బిడ్డ పుట్టే వరకు జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయిని ఒంటరిగా బయటకు పంపించకండి అని నాగేశ్వరి చెప్తి వెళ్తుంటే చేయి పట్టి పంచమి ఆపుతుంది. దీంతో నాగేశ్వరి నీకేం కాదు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటా అని చెప్తుంది.
ఇక ఉదయం పంచమి తులసి కోటకు పూజ చేస్తుంది. పంచమి తల్లి గౌరి వస్తుంది. పంచమి కోసం మామిడి కాయలు తీసుకొని వస్తుంది. పంచమి సందడిగా తల్లి ఒడిలో పడుకొని మామిడి కాయలు తింటుంది. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటుంది. అయితే ఇదంతా పంచమి నిద్రలో కలవరిస్తుంది. మోక్ష పంచమి నిద్ర లేపుతాడు. ఇక మోక్ష ఏమైందని అడిగితే మా అమ్మ మామిడి కాయలు తీసుకొచ్చినట్లు కల వచ్చిందని చెప్తుంది.
కరాళి తన దివ్య దృష్టితో పంచమిని చూస్తుంది. పంచమి, మోక్షలు ప్రేమగా మాట్లాడుకోవడం, కరాళి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం వింటుంది. దీంతో కరాళి మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా నుంచి తప్పించుకోలేరు అంటుంది. ఇలాగే మిమల్ని భయపెట్టి చంపేస్తా అనుకుంది. ఇంతలో ఫణేంద్ర అక్కడికి వస్తుంది.
కరాళి: మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నాగేశ్వరి మనల్ని అడ్డుకుంటుంది. ఆ నాగేశ్వరి లేకుంటే ఈ పాటికి ఆ ఇళ్లు రోధనతో కుమిలి కుమిలి ఏడుస్తుండే వారు.
ఫణేంద్ర: మనం ముందు ఆ నాగేశ్వరి అడ్డు తొలగించుకోవాలి.
కరాళి: నా దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద శక్తులు లేవు ఫణేంద్ర. నాగేశ్వరి నాగ శక్తిని అడ్డుకోవాలి అంటే ఇప్పుడు నాకున్న శక్తులు సరిపోవు.
ఫణేంద్ర: మా నాగలోకంలో నాగరాజుల కంటే నాగ కన్యలకే ఎక్కువ శక్తులు ఉంటాయి. అందుకే నేనే ఏం చేయలేకపోతున్నా.
కరాళి: నాకు వశీకరణ తెలుసు ఒకసారి ప్రయత్నిస్తా అది పనిచేస్తే ఈ రోజు నుంచి నాగేశ్వరి పని అయినట్లే. అని కరాళి మంత్రాలు చెప్పగానే కొన్ని ముంగిసలు అక్కడికి వస్తాయి. అవన్నీ అక్కడే ఫణేంద్ర పాము మీదకు దాడి చేస్తాయి. తర్వాత కరాళి వాటిని ఆపి నాగేశ్వరి మీదకు పంపిస్తుంది.
పంచమి ఇంటి దగ్గర ఉన్న నాగేశ్వరి పామును ఆ ముంగిసలు తరుముతాయి. నాగేశ్వరి పాము పంచమి ఇంట్లోకి పారిపోతుంది. అవి కూడా అక్కడికి వెళ్తాయి. ఇంట్లో అందరూ చాలా భయపడతారు. ఇక నాగేశ్వరి పాముని ముంగిసలు చుట్టు ముడతాయి. పాము మీదకు దాడి చేస్తాయి. పంచమి కూడా అక్కడికి వచ్చి తనకు రక్షణగా ఉన్న నాగేశ్వరిని చంపేసేలా ఉన్నాయని పంచమి సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.