Naga Panchami Telugu Serial Today Promo: నాగపంచమి సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే పంచమి నాగమణితో మోక్షను కాపాడొచ్చు అని తెలుసుకొని దాన్ని దక్కించుకోవడానికి నాగలోకం వెళ్లిపోయి రాణి పీఠం అధిరోహించాలి అని అనుకుంటుంది. ఇక ఫణేంద్ర తన భర్త మోక్ష ప్రాణాలు కాపాడటానికి నాగమణిని తీసుకురావడానికి సాయం చేస్తానని చెప్పడంతో అతడితో కలిసి నాగలోకం వెళ్లి ఫణేంద్రను పెళ్లి చేసుకొని శాశ్వతంగా అక్కడే ఉండిపోతాను అని మాటిస్తుంది. ఇక తాజాగా నాగలోకంలో ఇష్టరూప నాగుల విషానికి విరుగుడు దొరుకుతుందని పంచమికి తెలియడంతో ఆసక్తి కలిగిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..
"పంచమి తల్లి నాగసాధువు దగ్గరకు వచ్చి తన అల్లుడిని కాపాడటానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని ప్రాధేయపడుతుంది. అప్పుడు నాగసాధువు తన దివ్య దృష్టితో చూసి నాగలోకంలో నాగ చంద్రకాంత అనే మొక్క నీటి అడుగులో పెరుగుతుందని అది ఒక్కటే ఇష్టరూప నాగుల విషానికి విరుగుడు అని అది ఒక్కటే మీ అల్లుడిని బతికించుకోవడానికి అవకాశం అని నాగ సాధువు పంచమి తల్లితో చెప్తారు. ఇక పంచమి మోక్షతో ఇష్టరూప నాగుల విషానికి విరుగుడుగా నాగలోకంలో మొక్కలు దొరుకుతాయని నాగ సాధువు చెప్పారని చెప్తుంది. దీంతో మోక్ష తనకు దేని మీద ఆశలు, నమ్మకాలు లేవని అన్నీ కనుమరుగైపోయాయని.. తాను ఏ క్షణం అయినా ఎవరికీ కనిపించకుండా కనుమరుగైపోవచ్చు అని చెప్తాడు."
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
మృత్యుంజయ యాగం చేయడంతో తన కొడుకుకు ఉన్న గండాలు అన్నీ తొలగిపోయాయని తాము భావిస్తున్నట్లు పంచమితో వైదేహి చెప్తుంది. ఇంకా ఏమైనా గుండాలు ఉంటే తమకు చెప్పమని అంటుంది. అయితే మోక్షకి ఇంకా ప్రాణ హాని ఉందని చెప్తే ఇంట్లో వాళ్లు తట్టుకోలేరు అని భావించిన పంచమి నిజం దాచేస్తుంది. దీంతో మోక్షకు గండాలు లేనప్పుడు తనతో కాపురం ఎందుకు చేయడం లేదని పంచమిని వైదేహి నిలదీస్తుంది. మీ ఇద్దరిలో ఎవరికి లోపం ఉందో చెప్పమని అంటుంది. త్వరలోనే శుభవార్త చెప్పకపోతే మోక్ష జీవితం నుంచి పంచమికి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోమని చెప్తుంది.
మోక్ష పూర్తిగా నీ మాయలో పడిపోయాడు అని మోక్షకు కనిపించనంత దూరం వెళ్లిపోమని పంచమికి తన అత్త వైదేహి చెప్పి మాట తీసుకుంటుంది. ఇక పంచమి మాట్లాడుతూ.. ఏ ఆపద ఏ అకాల మరణం లేని మోక్ష బాబుని మీకు అప్పగించి వెళ్లాలని తన ఆశ అని ఆ కోరిక నెరవేరే దశలో ఉందని తన అత్తయ్యకి చెప్తుంది. ఆ కోరిక పూర్తి కాగానే ఒక్క మోక్ష బాబు కంటికే కాదు ఇంక ఎవరి కంటికి కనిపించను అని చెప్తుంది.
ఇక మోక్షని కలిసిన పంచమి తాను శాశ్వతంగా వెళ్లిపోతున్నాను అంటే మోక్ష అస్సలు వదలరేమో అని అనుకుంటుంది. తమ మధ్య ఎడబాటు తప్పదని మీరు ప్రాణాలతో ఉండాలి అంటే నేను వెళ్లక తప్పదని అనుకొని బాధ పడుతుంది. ఇక మోక్ష నువ్వు ఇక్కడ ఉండకు పంచమి.. నేను లేని మరుక్షణం ఇంట్లో వాళ్లు నిన్ను అష్టకష్టాలు పెడతారు. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నువ్వు నీ లోకం చేరుకోవాలని పంచమితో అంటాడు.
అయితే పంచమి ఫణేంద్ర తనకు సాయం చేస్తాడని.. తాను నాగలోకం చేరుకొని నాగమణి తీసుకొస్తానని చెప్తుంది. అయితే ఫణేంద్ర నిన్ను నాగలోకం తీసుకెళ్లడానికే అలా ఆశ పెడుతున్నాడని మోక్ష పంచమితో చెప్తాడు. ఇవన్నీ కాదని తన బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్తాడు. ఇద్దరూ కలిస్తే తనకు ప్రాణ హాని కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వాలని సూచిస్తాడు. ఇందుకు ఒక రోజు గడువు ఇస్తాడు. లేదంటే నీ దారి నువ్వు చూసుకో అని పంచమితో తేల్చి చెప్పేస్తాడు.
మరోవైపు తనను నాగకన్య అని ఫణేంద్ర పూర్తిగా నమ్మేశాడు అని కారళి తెగ సంబరపడిపోతుంది. ఫణేంద్రని మాయ చేసి నాగమణి దక్కించుకోవాలని అనుకుంటుంది. ఇక ఫణేంద్ర మోక్షని బతికించాల్సిన అవసరం తనకు లేదని.. కేవలం యువరాణిని నాగలోకం తీసుకెళ్లడమే తన లక్ష్యమని అనుకుంటాడు. ఫణేంద్ర మనసులో మాటను పసిగట్టిన మేఘన నాగమణి తీసుకురావడానికి యువరాణికి సాయం చేయకపోతే పంచమి రాణి పీఠం ఎక్కిన తర్వాత చిత్ర హింసలు పెడుతుంది అని భయపెడుతుంది. యువరాణికి మోసం చేయకుండా నాగమణిని ఇక్కడికి తీసుకొచ్చే విషయంలో నిజాయితీగా ఉండని ఫణేంద్రకు సూచిస్తుంది.
Also Read: ప్రభాస్ కండలు గ్రాఫిక్స్ కాదు - క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా