Krishna Mukunda Murari Telugu Serial Today Episode: కృష్ణ తన ఇంట్లో ఒంటరిగా కూర్చొని భవాని మాటలు తలచుకొని బాధపడుతుంది. తన పెద్దత్తయ్య తీరు చూస్తుంటే తన తప్పు లేకపోయినా తనని మురారిని విడదీసేలా ఉందని అనుకుంటుంది. ఇక అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. కృష్ణ దగ్గరే కూర్చొని కృష్ణకి సారీ చెప్తాడు. ఇక కృష్ణ వదిలేయమని భవాని మారిపోతుంది తన మీద కోపం పెంచుకోవద్దు అని సర్దిచెప్తుంది. ఇక మురారి ఆ ఇంట్లో తనకి ఉండటం ఇష్టం లేదని మురారి అంటాడు. ఇక మురారికి భోజనం తీసుకొస్తాను అని కృష్ణ వెళ్తుంది. ఇక మురారి కృష్ణకు తినిపిస్తాడు. 


మురారి: బాధ అంతా దిగమింగి భయటకు హ్యాపీగా ఉండటం కృష్ణ దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణ నిన్ను పెద్దమ్మ గానీ ఇంకెవరు కానీ ఏం అంటే ఏం పట్టించుకోవద్దు నీకు నేనున్నాను. ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. అప్పుడు మనకు అడ్డుచెప్పేవారు అడ్డుకునే వారు ఎవరూ ఉండరు.  


ముకుంద: (మురారికి కాఫీ తీసుకొని వస్తూ..) మనసులో.. మురారి నీగురించి నేను ఎంత తపన పడుతున్నానో ఎన్ని అవమానాలకు గురవుతున్నానో నీకు తెలీదు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. గుడ్ మార్నింగ్ మురారి. 
మురారి: నువ్వేందుకు తీసుకొచ్చావు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నావు.
ముకుంద: నీకు కాఫీ ఇవ్వడం నాకు శ్రమా.. ఏం మాట్లాడుతున్నావు మురారి. 3 రోజుల్లో మనం పెళ్లి చేసుకుంటున్నాం అదైనా గుర్తుందా..
మురారి: నాకు అన్నీ గుర్తున్నాయి. గుర్తుండి స్ఫృహలోనే ఉండి మాట్లాడుతున్నాను.
ముకుంద: గుర్తుంటే ఇలా మాట్లాడవు.
మురారి: మాట్లాడుతాను నేను ఇలానే మాట్లాడుతా..
ముకుంద: ఎలా మాట్లాడుతావు మురారి మీ పెద్దమ్మ ఏం చెప్పిందో గుర్తుందా..
మురారి: పెద్దమ్మ ఏం చెప్పింది ఈ కేసులో దోషులు ఎవరో కనిపెట్టమంది ఆ పని లోనే ఉన్నాను.
ముకుంద: అది తేల్చలేవు అని చెప్తున్నాను కదా.. కృష్ణ వాళ్లే చేశారు అని తెలిసి ఎలా తేలుస్తావు మురారి చెప్పు. వచ్చే శుక్రవారమే మన పెళ్లి జరుగుతుంది గుర్తుపెట్టుకో.
మురారి: నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నేను ఈ కేసు క్లోజ్ చేస్తా.. కృష్ణ నిర్దోశి అని తేల్చుతా.. 
ముకుంద:  ఈ వాదనలు అన్నీ అనవసరం మురారి. అసలు నేను నిన్ను ఎలా వదిలేస్తా అనుకున్నావు. 
మురారి: ఎందుకిలా టార్చర్ పెడుతున్నావు. అసలు ఈ పెళ్లి మీ నాన్నకి ఇష్టం లేదు. మీ అన్నకి అసలు ఇష్టం లేదు. ఈ విషయం ఒకసారి ఆలోచించు నీకే అర్థం అవుతుంది. జ్ఞానోదయం అవుతుంది.
ముకుంద: అంత అజ్ఞానంలోనో అంధకారంలో ఉన్నది మీరు. ఎప్పుడూ ఆ కృష్ణతో ఉండటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా.. చూడు మురారి నువ్వు అంటే నాకు పిచ్చి.. నీ వెనక కుక్కపిల్లలా తిరుగుతుంటే అంత బాలేదు మురారి. 
మురారి:  అయిందా చెప్పడం అయిందా.. అయినా నా భార్యతో నేను..
ముకుంద: మురారి ఇంకా కేసు తేలలేదు. అప్పుడే కృష్ణ నీకు భార్య ఎలా అవుతుంది. ఏమైంది నీకు నువ్వు నన్ను ప్రేమించావు మురారి. 
మురారి: అది గతం ముకుంద. నీకు పెళ్లి అయింది నా ఫ్రెండ్‌ని నేను మోసం చేయలేను.  
ముకుంద: దాన్ని మోసం చేయడం అనరు ప్రాయచ్చిత్తం అంటారు. అవును నువ్వు నాకు చేసిన మోసానికి నన్ను పెళ్లి చేసుకుంటే ప్రాయచ్చిత్తం చేసినవాడివి అవుతావు.
మురారి: మరి అప్పుడు కృష్ణని వదిలేస్తే కృష్ణని మోసం చేసిన దానికి ఏ విధంగా ప్రాయచ్చిత్తం చేసుకోవాలి.


కృష్ణ తులసి కోటకు పూజ చేస్తూ భవాని మారాలి అని కోరుకుంటుంది. ఇక కృష్ణ వస్తాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఏసీపీ సార్ ఎవరు ఏం అన్నారు అని అడుగుతుంది. దీంతో ముకుంద చిరాకు తెప్పిస్తుంది అని మురారి చెప్తాడు. ఇక కాఫీ చేసి కృష్ణ ఫ్లాస్క్‌లో కాఫీ వేసి ఆ ఇంటికి తీసుకెళ్లడానికి తీసుకెళ్తే మురారి వద్దు అంటాడు. ఇక మురారి, కృష్ణ ఇద్దరూ కాఫీ తాగుతారు. 


ముకుంద: అత్తయ్య ఇది వరకు మీ మాట అంటే మురారికి శిలాశాసనం. కానీ ఇప్పుడు.. కోపం తెచ్చుకోకండి అత్తయ్య ఇప్పుడు మురారికి కృష్ణ మాటే శిలాశాసనం. ఇప్పుడే మురారికి కాఫీ ఇద్దామని వెళ్లాను. కనీసం తీసుకోలేదు. పైగా మనద్దరిని వెదవల్ని చేసి మాట్లాడాడు. అవును అత్తయ్య నన్ను ఏమన్నా నాకు పర్లేదు. ఎందుకంటే మురారితోనూ అందరితోనూ మాటలు పడటం నాకు అలవాటు అయిపోయింది. కానీ కృష్ణ ఒక్కర్తే అమాయకురాలు అన్నట్లు మాట్లాడి మనం తన జీవితాన్ని నాశనం చేశాం అన్నట్లు మాట్లాడాడు. నేను ఇచ్చిన కాఫీ కూడా తాగకుండా వెళ్లి పోయాడు. అదీ కూడా కృష్ణ దగ్గరకు వెళ్తున్నా అని చెప్పి మరీ వెళ్లిపోయాడు. 
భవాని: రేవతి.. రేవతి.. కాఫీ ఇవ్వు. 
రేవతి: అక్క అది.. కృష్ణ కాల్ చేసి కాఫీ తను తీసుకొస్తా అని చెప్పింది అక్కయ్య. 
భవాని: బాగుంది అమ్మా బాగుంది ఇవాళ కాఫీ రేపు టిఫిన్.. ఎల్లుండి భోజనాలు ఆ తర్వాత మన ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది తనే చూస్తుంది మన బిజినెస్‌లు కూడా చూస్తుందేమో అడుగు.
రేవతి: ఎందుకు అక్కయ్య అంత కోపం తను తెస్తానన్నది కాఫీ ఏ కదా..
భవాని: గతంలో చెప్పింది అప్పుడే మర్చిపోయావా.. కేసు తేలే వరకు రావద్దు అని చెప్పింది తను అప్పుడే మర్చిపోయిందా.. రావొద్దు అని చెప్పినా ఎందుకు తను కాఫీ తెస్తాను అంది. 
ముకుంద: వీళ్లందరి అండ చూసుకొని ఇంత ధైర్యం అత్తయ్య మీరు చెప్పినట్లు మన బిజినెస్‌లు చూసుకోవడం లోనూ సలహా ఇస్తుంది. 
భవాని: కాఫీ ఏం అవసరం లేదు. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ అవసరం లేదు అని చెప్పు. నందూ, మధు.. మీలో ఎవరైనా అవుట్‌ హౌస్‌కి కాల్ చేసి..
మధు: కృష్ణకి కాల్ చేసి కాఫీ తీసుకురమ్మని చెప్పాలా పెద్దమ్మ.. అంటే భవాని మధుని చెంప మీద ఒక్కటిస్తుంది.
మురారి: ఇంట్లో వాతావరణం అస్సలు బాలేనట్లు ఉంది. ఏమైంది పెద్దమ్మ మధు ఏం చేశాడు. 
భవాని: ఆ.. ఒక పనికి మాలిన పని చేశాడు అందుకే అలా.. 
కృష్ణ: అత్తయ్య ఆలస్యం అయినందుకు సారీ కాఫీ తీసుకోండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటని అన్నారు - ట్రోల్స్ పై రోషన్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు, ఎమోషనల్ అయిన సుమ!