సుబ్బు: మరోసారి ఆలోచించుకో పంచమి నన్ను నిజంగానే వెళ్లిపోమంటున్నావా..


పంచమి: అవును సుబ్బు నిజంగానే అంటున్నా.. నువ్వు వెళ్లిపో


సుబ్బు: ఆ మాట నీ గుండెల్లోంచి రావడం లేదు పంచమి నాకు తెలుసుగా


పంచమి: ఏం తెలుసు నీకు నేను చెప్తున్నానుగా వెళ్లిపోమని


సుబ్బు: మరి ఎందుకు ఏడుస్తున్నావు. పంచమి నీ మాట వెళ్లమంటున్నా... నీ కళ్లు వెళ్లొద్దు సుబ్బు అన్నట్లు చూస్తున్నాయి. అందుకే నీకు ఈ కన్నీళ్లు


పంచమి: అదేం కాదు.. కంట్లో నలక పడింది.. అవన్నీ నీకు అనవసరం.. నేనే నున్ను ఇక్కడికి తీసుకొచ్చాను.. ఇప్పుడు నేనే నిన్ను వెళ్లిపోమంటున్నాను


సుబ్బు: చూడు పంచమి ఆమాట నిజంగా నీ మనసు నుంచి వస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. తెలుసా..


పంచమి: నా బాధ అర్థం చేసుకో సుబ్బు. నేను నా భర్త మాట వినాలి కదా తను నిన్ను పంపించే మంటున్నారు. 


సుబ్బు: నాకెందుకో నిన్ను వదిలి పెట్టి వెళ్లాలి అని లేదు పంచమీ. కావాలంటే నేను ఈ ఇంట్లో ఏమీ తినను.. నీళ్లు కూడా తాగను. అప్పుడు వీళ్లకి నా నుంచి ఏ ఇబ్బంది ఉండదు కదా


పంచమి: నేను నా భర్త మాట దిక్కరించలేను కదా సుబ్బు. నన్ను ఇరకాటంలో పెట్టకు. దయచేసి వెళ్లిపో


సుబ్బు: హా.. అర్ధమైంది. నీకు నా కంటే నీ భర్తే ఎక్కువ అయిపోయాడు కదా


పంచమి: నాకు నా భర్త తర్వాతే ఎవరైనా.. నువ్వు వెళ్లిపోవాల్సిందే


సుబ్బు: అడవిలో నీకు నేను చేసిన సాయం అంతా నువ్వు అప్పుడే మరచిపోయావా.. చిన్న పిల్లవాడివైనా చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్.. ఎప్పుడు నీ మాటలే నాకు దిక్కు సుబ్బు అంటూ గొప్పగా పొగిడావ్.. ఇప్పుడు చీపురు పుల్లలా తీసి పడేసి వెళ్లిపోమంటున్నావా.. ఇదేమైనా నీకు న్యాయమా పంచమి.. పంచమి ఏడవకు నేను ఏదో తమాషాగా అన్నాను.  నీ మనసు నాకు తెలుసు పంచమి.. నేను వెళ్లిపోయిన తర్వాత నన్ను పంచించేశానన్న బాధలో నువ్వు ఎంత కుమిలిపోతావో నాకు తెలుసు.


పంచమి: నీ సాయం ఏ జన్మలోనూ మర్చిపోలేను సుబ్బు. నిన్ను ఈ ఇంట్లో నలుగురు నాలుగు మాటలు అంటుంటే నేను తట్టుకోలేను సుబ్బు. నాకోసం నువ్వు అవమానం పడటం నాకు ఇష్టం లేదు సుబ్బు. 


సుబ్బు: పర్వాలేదు పంచమి. నేను చిన్న పిల్లవాడినే కదా వాళ్లు అన్నమాటలు నాకు ఏం అంటవు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పంచమి అందుకే వెళ్లబుద్ధి కావడం లేదు పంచమి


పంచమి:  అలా అనకు సుబ్బు. వాళ్లు నిన్ను తిడుతుంటే ఆ పాపం నాదే సుబ్బు


సుబ్బు: పంచమి నేను వెళ్తే మళ్లీ తిరిగి రాను.


పంచమి: పర్వాలేదు సుబ్బు. రావొద్దు


సుబ్బు: నువ్వు పిలిచినా మరిరాను పంచమి.. బాగా ఆలోచించుకో


పంచమి: నేను పిలవను సుబ్బు (పంచమి మనసులో.. అసలు నేను ఈ లోకంలో ఉంటానో లేదో కూడా నాకు తెలీదు)


సబ్బు: సరే పంచమి వెళ్లొస్తాను..


పంచమి: సుబ్బు నేను మళ్లీ పిలిచినా రానుఅన్నావ్ ఇప్పుడేమో వెళ్లొస్తా అంటున్నావు..


సుబ్బు: అయ్యయ్యో.. అన్నమాట వెనక్కి తీసుకోకూడదే.. సరేలే పంచమి నీకోసం మళ్లీ రావాల్సి ఉంటుందని నా నోటి నుంచి ఆ మాట వచ్చుంటుంది. 


అప్పుడే శిశిర పాప, మోక్ష అక్కడికి వస్తారు.. పాప బాబాయ్ సుబ్బును వెళ్లొద్దని చెప్పు బాబాయ్ అంటుంది. బాబాయ్ సుబ్బుకు చెప్పు బాబాయ్ ఇక్కడే ఉండమని..


మోక్ష: సుబ్బు ఇక్కడే ఉండు


పంచమి: బయలుదేరావు కదా సుబ్బు వెళ్లిపో


శిశిర పాప: పిన్ని బాబాయ్ ఉండమంటున్నాడు కదా నువ్వు ఎందుకు వెళ్లమంటున్నావ్.. సుబ్బు వెళ్లొద్దు బాబాయ్ ఉండమంటున్నాడు కదా


సుబ్బు: ఊహూ.. పంచమి చెప్తేనే ఉంటాను 


శిశిర పాప: ఉండమని చెప్పు పిన్ని


సుబ్బు: నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది పంచమి.. పంచమి చెప్తేనే ఉంటాను..


శిశిర పాప: బాబాయ్ పిన్నితో నువ్వు చెప్పు. సుబ్బుని ఉండమని


మోక్ష: సుబ్బుని ఉండమని చెప్పు


పంచమి: నాకు అంత అధికారం ఉందని అనుకోను


మోక్ష: ఆవిరి అయిపోయిన సంతోషాలు కొందరి జీవితాల్లో తిరిగి రావు.. శిశిర నీ సంతోషం కోసం ఉండమని చెప్తోంది. సుబ్బు ఉంటాడు. ( అని చెప్పి మోక్ష అక్కడి నుంచి వెళ్లిపోతాడు)


శిశిర  పాప: పిన్ని చెప్పు పిన్ని చెప్పు


పంచమి: సుబ్బు నువ్వు ఉండు


సుబ్బు: ఈ సారి వెళ్లిపొ అని చెప్తే మరి ఎప్పటికీ తిరిగిరాను


పంచమి: నీ ఇష్టం సుబ్బు


సుబ్బు: నాకు కోపం వస్తే నీకు కూడా చెప్పకుండా వెళ్లిపోతా పంచమి


పంచమి: నువ్వు చెప్పాలి అన్నా అప్పటికి నేను ఉండాలి కదా సుబ్బు అని చెప్పి పంచమి వెళ్లిపోతుంది. 


సుబ్బు: ఉంటావు పంచమి నువ్వు ఎక్కడికి వెళ్లవు


శిశిర: రా సుబ్బు మనం ఆడుకుందాం అంటూ పాప సుబ్బును తీసుకు వెళ్లిపోతుంది.


మరోవైపు తమ గదికి వెళ్లిన పంచమి అక్కడ బీరువాలోంచి తన చీరలు తీసు సర్దుకుంటుంటుంది. అప్పుడు అక్కడికి మోక్ష వస్తాడు


మోక్ష: నేను నిన్ను వెళ్లిపోమని చెప్పలేదు. ఇంకొకరి మనసు కష్ట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు అంటూ నేనే చెప్తాను. అప్పుడు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.


పంచమి: మీ మాట దిక్కరించి నేను ఏ పని చేయను నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం లేదు. నేను వెళ్లాల్సిన రోజు వచ్చే వరకు అవుట్ హౌస్‌లో ఉంటాను. నా ఉనికి ఎవరికి ఇబ్బంది కాకూడదు. మీ మానసిక స్థితి నేను అర్ధం చేసుకోగలను. నేనీ ఇంటికి కోరుకుంటే వచ్చిన దాన్ని కాదు. అనుకోకుండా వచ్చిన దాన్ని. నేను వెళ్లిపోవడం కూడా యాద్ధృశ్చికంగానే జరగాలి. మనసు విప్పి మాట్లాడలేని దౌర్భాగ్యపు స్థితి నాది. ఏం మాట్లాడినా నా తరఫున కాలమే సమాధానం చెప్పాలి. నా కారణంగా ఎవరికీ ఏ కీడు జరగకూడదు. అలాంటిది నా వల్ల ఎవరికైనా హాని ఉందంటే నేను భరించలేను.  ఎలా అయినా ఆ వ్యక్తిని కాపాడాలని చివరి క్షణం వరకు కాపాడుకుంటాను. మీకు నాగ గండం ఉంది మోక్ష బాబు. ఇప్పటికీ మీకు ఆ ప్రమాదం తప్పిపోలేదు. ఇప్పటికే ఆ పాము మీకు కాటేసి తీరాలి అది ఆ పాము విధిరాత. 


మోక్ష: ఈ మాటలు ఇంతకు ముందు నేను నమ్మేవాడికి కాదు. ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థతి. నాకున్న చాలా అనుమానాలను నేను ఇంకా క్లారిఫై చేసుకోవాలి. అప్పటివరకు నేను ఏలాంటి దృఢ నిర్ణయాలను తీసుకోలేను. నువ్వు ఇప్పటికీ ఈ ఇంటి కోడలివే. ఎక్కడో అవుట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంకా అనుమానాలు పెరుగుతాయి గానీ తగ్గవు. పరిష్కారం లేని సమస్య ఉండదు అని నా నమ్మకం. మధ్యలో వదిలేస్తే ఏ రహస్యం అయినా అంతు చిక్కకుండా ఉండిపోతుంది. నన్ను చంపడమే ఆ పాము లక్ష్యం అయితే నేను చేయగలిగింది ఏం లేదు. అప్పుడు ఆ పాముకి అయినా ప్రయోజనం కలుగుతుందంటే పర్వాలేదు. 


పంచమి: అలాంటి రోజు రాకూడదు అనే నా తపన మోక్ష బాబు. నా సాయశక్తుల మిమల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా. లేదంటే నేను ఇక్కడ ఉండటానికి అర్ధం లేదు. 


మోక్ష: నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు ఏం చేయలేవు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఆ క్షణం ఎలా ఉంటుందో ఊహించలేం. నాకు ఒకటి మాత్రం బాగా అర్ధం అయింది. మనం ముందుగా ఏం అనుకున్నా ప్రయోజనం లేదని. ఆ క్షణం ఏం జరగాలో అది జరిగిపోతుంది అంతే 


తర్వాత కరాళి ఉన్న చోటుకు పంచమి వస్తుంది. 


కరాళి: పంచమి.. ఇష్టరూపధారిజాతి నాగు.. నాగ పంచమి.. పంచమి 


పంచమి: నంబూద్రీ గారిని కలవాలి


కరాళి: నువ్ నిజంగా నా అన్నయ్య కోసమే వచ్చావా


పంచమి: మనసులో( అన్నయ్య అంటుంది అంటే ఈమె నంబూద్రీ చెల్లెలు కరాళి. నా భర్తను ముప్పతిప్పలు పెట్టిన మాంత్రికురాలు)


కరాళి: నిజం చెప్పు పంచమి నువ్వు నంబూద్రీ పేరుతో నన్ను కూడా చంపేయాలి అని వచ్చావా.. అమాయకంగా మొఖం పెడితే నిన్ను నమ్మేస్తానని అనుకోకు పంచమి నువ్వు మహా తెలివైన దానివని నాకు తెలుసు. నీ భర్తను మాత్రం కాపాడుకొని. నా అన్నని మాత్రం కాటేసి చంపేశావు. 


పంచమి: నంబూద్రీ గారు చనిపోయారా


కరాళి: చనిపోలేదు.. చంపేశావ్.. 


పంచమి: నేనా


కరాళి:  నువ్వే.. నువ్వే.. నువ్వే మా అన్నని చంపావ్.. నువ్వు పాముగా మారితే శత్రువులు తప్ప ఇంకా ఎవ్వరూ గుర్తుండరనేది అబద్దం. అదే నిజమైతే నీ పక్కనే ఉన్న నీ భర్తను కాటేయకుండా ఇంత దూరం వచ్చి నా అన్నని మాత్రమే ఎందుకు చంపుతావ్. 


పంచమి: నిజంగా నాకేమీ తెలీదు. పాముగా మారిన తర్వాత నేనేం చేశానో నాకు గుర్తులేదు. నంబూద్రీని గారిని నేను కాటేసి చంపేశానని నువ్వు చెప్తుంటే నేను ఇంకా నమ్మ లేకపోతున్నాను. 


కరాళి: ఇష్టరూపధారిజాతి నాగకన్యలు ఎంత రోషంగా ఉంటారో అంతే పవిత్రంగా ఉంటారని విన్నాను. నిజాయితీగా ఉండు పంచమి. మోక్షను చంపకుండా నంబూద్రీని మాత్రమే ఎందుకు కాటేసి చంపావు.. నీకు నీ భర్త ఎంత ముఖ్యమో నాకు నా అన్నకూడా అంతే ముఖ్యం. నీ నాగ జాతికి నిజంగా నీతి నియమం ఉంటే నీ భర్తను కూడా చంపాలి. లేదంటే నా అన్నని బతికించి. 


పంచమి: నిజానికి నా చేతిల్లో ఏమీ లేదు. పంచమిగా నేను ఎవర్నీ చంపలేను. బతికించలేను. 


కరాళి:  కాకమ్మ కథలు నాకు చెప్పకు పంచమి. నువ్వు విషం తాగి బతికించిన సంఘటనల గురించి నా అన్న నాకు చెప్పాడు. నువ్వు తలచుకుంటే ఇప్పుడే నువ్వు నా అన్నని బతికించవచ్చు. ఆ ఆశతోనే మా అన్న శరీరం చెడిపోకుండా జాగ్రత్తగా భద్రపరిచాను. నీ కన్నతల్లి చావుకు నా అన్న నీ భర్త ఇద్దరూ కారకులే. శిక్ష కూడా సమానంగా ఉండాలి. మా అన్నని బతికించు. లేదా నీ భర్తను కూడా చంపేయాలి 


పంచమి: నంబూద్రీని నేనే కాటేసి చంపేసిన మాట వాస్తవం అయితే మోక్ష బాబుకు కూడా అదే శిక్ష పడి తీరుతుంది. ఆ నాగ జాతి ప్రతీకారం నుంచి ఎవరూ బయటపడలేరు.


కరాళి:  ముందు నా అన్నని బతికించు పంచమి. ఆ తర్వాత నీ మోక్షని పాము పగ నుంచి కాపాడుకోవడానికి నేను నీకు సాయం చేస్తాను. 


పంచమి: నీ అన్ననే కాపాడుకోలేని దానివి నా భర్తను కాపాడుతావంటే నమ్మమంటావా. నా భర్తని నువ్వు ఎంత వంచన చేశావో.. నీ మాయ మంత్రాలతో ఎంతగా బాధించావో నాకు తెలుసు కరాళి. నీ కపట వేషాలు నేను పసిగట్టలేను అనుకోకు. నీ మాయల మరాటీవో నాకు  బాగా తెలుసు. 


కరాళి: నేను ఏంటో నీకు తెలుసు కాబట్టే చెప్తున్నా.. నాతో శత్రుత్వం అంటే నీకు చెడు కాలం దాపరించినట్టే లెక్క


పంచమి: నాలో ప్రేమకు ప్రాణం ఇచ్చే రక్తం ఎంత ఉందో.. పగతో ప్రాణం తీసే తత్వం అంతే ఉంది. 


కరాళి:  అయితే నా అన్నని బతికించనంటావ్ 


పంచమి: నాకు అలాంటి అవకాశం లేదు. పాము కాటేసినప్పుడు ఆ మనిషి ప్రాణంతో ఉంటే అప్పుడు మాత్రమే ఆ విషం బయటకు లాగే ప్రక్రియ పనిచేస్తుంది.  చనిపోయిన నంబూద్రీని బతికించడం అసాధ్యం. పంచమిగా నాకున్న శక్తి అంతే. ఇష్టరూపనాగ జాతి లక్షణాలు పూర్తిగా సంతరించుకున్న నాగ కన్యలు గాని నాగ రాజులు కానీ బతికించగలరేమోగాని నాకు తెలీదు. అలాంటి లక్షణాలు సంతరించుకొని నేను పూర్తిగా ఇష్టరూప నాగ కన్యగా మారినా కూడా నీ అన్న నంబూద్రీ లాంటి దుష్టుడిని మాత్రం బతికించే ప్రయత్నం అస్సలు చేయను. 


కరాళి:  ఆగు.. గుర్తుంచుకో పంచమి.. మీ ఇష్టరూపధారి నాగుల పగా ప్రతీకారాలకంటే రెట్టింపు పౌరుషం నాది. నీకన్న తండ్రి నాగ కన్య నాగేశ్వరి నా దగ్గర బంధీలుగా ఉన్నారన్న విషం నువ్వు మరచిపోవద్దు. మీ ద్వారానే మీ లోకంలో ఉన్న శక్తివంతమైన నాగమణిని సంపాదించి నా అన్న నంబూద్రీకి ప్రాణం పోస్తాను.


పంచమి: ప్రాణాలు అయినా అర్పిస్తాను కానీ.. నాగ లోకానికి శక్తిని ప్రసాదించే పవిత్రమైన నాగమణిని మాత్రం పరులెవ్వరినీ తాకనివ్వను కరాళి.  అది నీ దాకా రావడం కల. 


కరాళి:  వస్తుంది పంచమి. నువ్వు నాగలోక యువరాణివి. నీ చేతులతోనే ఆ నాగమణిని స్వయంగా తెచ్చి నాకు ఇచ్చేలా చేసుకుంటాను. 


పంచమి: మీ అన్న నంబూద్రీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే నీకు అదే గతి పడుతుంది. గుణపాఠంగా తీసుకుంటే ప్రాణాలు మిగులుతాయి. నిర్ణయించుకో కరాళి. అని వార్నింగ్ ఇచ్చి పంచమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


మోక్ష హాల్‌లో కూర్చొని గతంలో జరిగిన సంఘటనలు ఆలోచిస్తూ ఉంటాడు దీంతో నేటి ఏపిసోడ్ పూర్తవుతుంది.