Meghasandesham Serial Today Episode: గగన్ తనకు పెళ్లి ఇష్టమే అని చెప్పడంతో భూమి షాక్ అవుతుంది. శారద, పూరి హ్యాపీగా ఫీలవుతారు. మధ్యలో కల్పించుకున్న భూమి మీరు ఓకే అంటే సరిపోతుందా? ఆంటీ ఓకే అనొద్దా అని అడుగుతుంది. దీంతో గగన్ నేను మాట్లాడాను అని చెప్పాను కదా? అనడంతో ఏం మాట్లాడారు మా అమ్మను బాగా చూసుకుంటే చాలు.. నేను పెళ్ళి చేసుకునేది మా అమ్మ కోసం ఇదేగా.. అని భూమి అనగానే నేను అదే మాట్లాడాను అని నీకెలా తెలుసు అని గగన్ అడగ్గానే అంతకంటే మీరేం మాట్లాడరని నా నమ్మకం. అయినా మీరొక్కరు మాట్లాడితే ఆంటీ అడగాల్సినవన్నీ అడగాలి కదా? అంటూ ఆంటీ మీరు అడగండి. అనగానే శారద నేనేం అడుగుతాను. వాడు సరే అన్నాడు కదా? అంటుంది శారద. అదేం కాదు అని పెళ్లి కూతురును కన్పీజ్ చేసి గగన్ కు కోపం వచ్చేలా చేస్తుంది భూమి.
భూమి: చూశారా? ఎక్కడా నేను చూసుకుంటాను అనే మాట రాలేదు. ఇప్పుడు మీకు ఓకేనా..?
పెళ్లికూతురు: అంటే మరీ పరిస్థితి చేయిదాటిపోతే అలా చేస్తాను అన్నాను. అయినా అలా ఎలా చేస్తాం. నేనే చూసుకుంటాను.
భూమి: ఆలోచించి చెప్పడానికి ఆలోచించకుండా చెప్పడానికి తేడా అదే.. ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు. కానీ వచ్చిన వాళ్లు పూరిని కూడా బాగా చూసుకోవాలి. కోడలు అంటే భర్తను మాత్రమే చూసుకుంటే సరిపోదు. ఆంటీకి బాగాలేదు అంటే హాస్పిటల్ అని కాకుండా నేనున్నానుగా అని చెప్పి ఉంటే బాగుండేది.
అని భూమి చెప్పగానే గగన్ మీరు వెళ్లొచ్చు అని చెప్తాడు. దీంతో పెళ్లి వాళ్లు ఆ అమ్మాయి మాటలు విని నిన్ను ఇష్టపడిన మా అమ్మాయిని కాదంటావా? అనగానే తను ఎవరో కాదు ఈ ఇంటి మనిషి. నాకు కావాల్సింది. నన్ను ఇష్టపడ్డ అమ్మాయి కాదు. మా అమ్మని బాగా చూసుకునే అమ్మాయి. మీరిక బయల్దేరవచ్చు అని గగన్ చెప్పగానే పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. భూమి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత శరత్‌చంద్ర ఇంట్లో ఇందు పెళ్లి సందడి నెలకొంటుంది. హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తుంటారు. ఫంక్షన్ భూమి ఆడిపాడటం చూసి అపూర్వ కుళ్లుకుంటుంది. తర్వాత భూమి తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అవుతుంది. భూమిని చూసి శరత్‌చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ భూమిని ఓదారుస్తారు. తర్వాత రూంలోకి వెళ్లిన భూమి శోభ చంద్ర లాస్ట్ వీడియో ఉన్న పెన్‌డ్రైవ్ చూస్తుంది.
భూమి: ఇది నాన్నకు మిగిల్చిన జ్ఞాపకం కాదమ్మా.. నాకు నువ్వు దాచిన జ్ఞాపకం. నీ ప్రాణం పోతున్నా నన్ను బతికించావు. నీ ఒడిలో ఆడుకునే అదృష్టం నాకు లేకపోయినా కళ్లారా నిన్ను ఇలా చూసుకునే అదృష్టం నాకు మిగిల్చావు
అని ఆ వీడియో చూస్తుంది భూమి. మరోవైపు ఇందు తన పెళ్లి పనుల్లో తన తండ్రి కృష్ణప్రసాద్ కలగజేసుకోవద్దని గొడవ చేస్తుంది. దీంతో వాళ్ల అమ్మ ఏడుస్తుంది. కృష్ణప్రసాద్ మౌనంగా ఉండిపోతాడు. చెర్రి మాత్రం ఇందును తిడతాడు.
చెర్రి: ఇందు అమ్మ చెప్పిన మాట విను. నాన్నా ఏం చేయడానికి వీల్లేదు అంటావేంటి?
ఇందు: నీకేం తెలియదు నువ్వు మాట్లాడకు ఆయన నాక ఏమైనా చేస్తాడంటేనే భయమేస్తుంది. పెళ్లి సంబందం తెస్తున్నాను అని ఆ సంబంధం ఆ ఇంటికి పంపిచాడు. తాళిబొట్టు తీసుకురమ్మంటే అది పోయింది అన్నాడు. ఇప్పుడు పెళ్లి జరగకుండా చెడగొడతాడేమోనని భయంగా ఉంది
అని ఇందు భయపడగానే అందరూ సర్ది చెప్తుంటారు. కానీ ఇందు ఏవరు ఎన్ని చెప్పినా వినదు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే