Meghasandesham Serial Today Episode: గగన్‌ ఫోటో టీ షర్ట్‌ మీద ప్రింట్‌ వేయించుకుని రన్నింగ్‌ చేస్తుంది నక్షత్ర. ఫ్రెండ్స్‌ అందరూ నవ్వుతూ అసలు నీకు ఇంత పిచ్చి ఏంటే అంటారు. మీ ఫ్యామిలీలో తెలిస్తే మీ పరిస్థితి ఏంటని అడుగుతారు. ఇక్కడుంది నక్షత్ర అని నేను ప్రింట్‌ వేసుకుంటేనే ఇలా అయిపోయారు. మా బావ కూడా నా ఫోటో ప్రింటు వేసుకుని తిరుగుతే ఎలా అయిపోతారు అంటూ కారు దగ్గరకు తీసుకెళ్లి తన ఫోటో ప్రింటు వేసిన టీ షర్టు చూపిస్తుంది నక్షత్ర. మరోవైపు గగన్‌ రూంలోకి  కాఫీ తీసుకుని వెళ్లిన భూమి గగన్‌ను నిద్ర లేపుతుంది. నిద్ర లేచిన గగన్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు.

భూమి: ఎంటలా చూస్తున్నారు. కాఫీ తాగండి.  

గగన్‌: కాఫీ నువ్వు..

భూమి: ఉదయాన్నే బెడ్‌ కాఫీ తాగుతారు కదాని మీకోసమే స్పెషల్‌ గా తీసుకొచ్చాను. తీసుకోండి. కాఫీ తాగమంటే కప్పు తడుతారేంటి..?

గగన్‌: అంటే అది నువ్వు..

భూమి: తలతిక్కగారు ఏం చేస్తున్నారు అరే నా చేతులండి. ఏం చేస్తున్నారు.

పూరి: మా అన్నయ్యేనా.. ఏంటి భూమి చేతులు పట్టుకుని నలిపేస్తున్నాడు.

 అంటూ వెళ్లి శారద దగ్గరకు వెళ్లి అన్నయ్య భూమి చేతులు పట్టుకుని నలిపేస్తున్నాడు అని చెప్తుంది. ఇద్దరూ కలిసి భూమి, గగన్‌ ల గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు అపూర్వ ఇంట్లో ఇందుకు శారీ  పంపిస్తారు పెళ్లి వాళ్లు.

ప్రసాద్‌ అమ్మ: ఏమో అనుకున్నాను అబ్బాయి వాళ్లు ప్రధానం చీర చారే ఘనంగానే పంపిచారు.

మీరా: అవును అత్తయ్యా.. ఏమంటావు వదినా..?

బిందు: ఇవన్నీ చూస్తుంటే అక్కకు అత్తగారింట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటారు అనిపిస్తుంది.

ఇందు: అత్తయ్య ఉండగా నేను ఇక్కడున్నా అక్కడున్నా ఏ లోటు ఉండదు.

ప్రసాద్‌ అమ్మ: పద్దతిగా పూలు, పండ్లు స్వీట్లు పంపిచారంటే వారికి పద్దతులు బాగా తెలుసు.

మీరా: అవును

ప్రసాద్‌ వచ్చి కోపంగా అపూర్వను చూస్తుంటాడు.

అపూర్వ: ఏంటి కృష్ణప్రసాద్‌ అంత తీక్షణంగా నన్నే చూస్తున్నాడు. కళ్లల్లో భయం కనిపించడం లేదు. నేను చూస్తున్నానన్న తడబాటు కనిపించడం లేదు ఏమై ఉంటుంది.  ( అని మనసులో అనుకుని పక్కకు వెళ్తుంది.)

తర్వాత కృష్ణప్రసాద్‌, శారదకు ఫోన్‌ చేసి భూమిని జాగ్రత్తగా చూసుకోండని చెప్తాడు. భూమికి ఏ విషయంలోనూ తక్కువ చేయడం లేదని చెప్తుంది శారద. తర్వాత భూమితో ఫోన్‌ మాట్లాడిన కృష్ణప్రసాద్‌ నీతో పర్సనల్‌ గా మాట్లాడాలి మనం ఇంతకు ముందు కలిశాం కదా అక్కడికి రామ్మా అంటాడు. సరే అంటుంది భూమి. మరోవైపు కోటు తీసుకుని గగన్‌ ఇంటికి వస్తుంది నక్షత్ర. అప్పుడే బయటకు వెళ్లబోతున్న భూమికి ఎదురవుతుంది.

భూమి: ఎందుకొచ్చావు…?

నక్షత్ర: మా బావ కోసం వచ్చాను.

భూమి: ఆయనతో పనేంటి?

నక్షత్ర: కోటు తీసుకొస్తానని చెప్పాను కదా తెచ్చాను.

భూమి: నువ్వు తెచ్చినా ఆయన తీసుకోవాలి కదా?

నక్షత్ర: ఎందుకు తీసుకోడు. తీసుకుంటాడు. దర్జాగా వేసుకుంటాడు.

భూమి: అది జరిగే పని కాదు. బయలుదేరు.

నక్షత్ర: ఎలా జరగదో నేను చూస్తాను. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు బయలుదేరు.

భూమి: ఇంత నమ్మకంగా వెళ్తుందేంటి? ఆయినా ఆయనకు మించిన పని నాకేం ఉంటుంది.

 అనుకుంటూ భూమి పరుగెత్తుకెళ్లి నక్షత్రను తిడుతుంది. ఆంటీని అత్తయ్యా అని పిలుస్తావెందుకు అంటుంది. నువ్వు అయితే పరాయిదానివి. మేము బంధువులం ఇలాగే పిలుస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది నక్షత్ర. తర్వాత శారద కాళ్లు మొక్కి మమ్మీతో మీకు ఎలాంటి ప్రాబ్లమ్‌ రాదు. రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్యా అని చెప్తుంది. గగన్‌ కోసం తీసుకొచ్చిన కోటు శారదకు ఇస్తుంది. గగన్‌కు ఇవ్వమని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పెళ్లి మంటపానిక వచ్చిన శంకర్‌ – టెన్షన్‌ పడుతున్న పాండు