Prema Entha Madhuram Serial Today Episode: అమ్మకు నిజం చేస్తేస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే ఇంతలో శంకర్ ఫోన్ చేస్తాడు. ఆ పెళ్లి జరగదు అంటూ యాదగిరికి తన ప్లాన్ చెప్తాడు శంకర్. మరోవైపు వినయ్ ని తీసుకుని మంటపానికి వెళ్తున్న పాండుకు ఎదురొచ్చిన యాదగిరి నేను వెళ్లిపోతున్నాను అని చెప్తాడు. దీంతో పెళ్లి ఆపడానికి వచ్చి చేతకాక వెళ్లిపోతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో మా శంకర్ సార్ ఉంటే నీ ఆటలు సాగేవి కావు అంటూ పాండును రెచ్చగొడతాడు యాదగిరి. ఆయన ఎదురుగా ఉంటే మీరు పెళ్లి జరిపించేవారే కాదు అంటాడు. దీంతో రేయ్ యాదగిరి, శంకర్ ఉంటే ఈ పెళ్లి జరగదా? అంటూ పిలవరా వాణ్ని ఏం చేస్తాడో చూస్తాను అంటాడు. పాండే ఫోన్ చేసి శంకర్ న పెళ్లికి పిలుస్తాడు. ఇంతలో శంకర్ వస్తాడు.
పాండు: ఇంత పాస్టా..?
శంకర్: నీ ఇన్విటేషన్ లో ఉన్న ఇంటెన్సన్ నాకు బాగా అర్థమైంది. అందుకే నువ్వు అలా కోరుకోగానే నేను ఇలా ప్రత్యక్ష్యం అయిపోయా.. నేను రాను, కూడదు అంటే నువ్వు ఫీలవుతావు కదా?
చిన్నొడు: ఎంతైనా నువ్వుంటే మన ఓనరు గారికి బాగా అభిమానం అన్నయ్యా..
పెద్దోడు: మీ అన్నయ్యకు అభిమానులంటే ప్రాణం. తలుచుకుంటేనే తథాస్తు అంటాడు. అలాంటిది పిలస్తే ప్రత్యక్షం అవ్వడా..?
శంకర్: ఒరే తమ్ముళ్లు ఓనరు గారు షాక్ లో ఉన్నట్టున్నారురా. పదండి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాం.
పాండు: యాదగిరి ఇప్పుడే కదా ఫోన్ చేశాను. అప్పుడే ఎలా వచ్చాడు.
యాదగిరి: సంకల్పం అండి సంకల్పం. మీరు గట్టిగా సంకల్పించుకుని పిలిచారు అలా వచ్చేశారు.
పాండు: ఇది పిలిస్తే వచ్చినట్టుగా లేదు. రావడానికి రెడీగా ఉండి వచ్చినట్టు ఉంది.
అని చెప్పుకుంటూ వినయ్ ని తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. వినయ్ మాత్రం భయంగా పెళ్లి జరుగుతుందో లేదోనని పాండును తిడతాడు. మరోవైపు రాకేష్ పెళ్లి అయిపోయి ఉంటుందని సంతోషపడుతుంటాడు. ఇంతలో వినయ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన రాకేష్ హ్యాపీగా పెళ్లి అయిపోయింది. అది నీ పెళ్లాం అయిపోయింది అని చెప్పు అంటాడు. దీంతో లేదని జరిగిన విషయం మొత్తం రాకేష్‌కు చెప్తాడు వినయ్. దీంతో రాకేష్, పాండును తిడతాడు. పెళ్లిమండపంలో శంకర్ ను చూసిన అకి, శ్రావణి, సంధ్య హ్యాపీగా ఫీలవుతారు. ఇక పెళ్లి జరగదు అనుకుంటారు. ఇంతలో జెండే కూడా అక్కడికి వస్తాడు. జెండేను చూసిన అకి హ్యాపీగా ఫీలవుతుంది.
జెండే: కంగారు పడకు అకి ఈ పెళ్లి జరగదు.
అకి: నాన్నను ఇక్కడ చూడగానే నాన్ను ఇక్కడ చూడగానే నాకా నమ్మకం కలిగింది ఫ్రెండ్.
జెండే: కమాన్… శంకర్ ఏంటి పరిస్థితి
అని అడగ్గానే శంకర్ ఏదో చెప్తాడు. అందరూ వెళ్లి ముందు వరుసలో కూర్చుంటారు. పంతులు పెళ్లికూతురును తీసుకురమ్మని చెప్తాడు. సంధ్య, శ్రావణి హ్యాపీగా గౌరిని తీసుకురావడానికి లోపలికి వెళ్తారు.
గౌరి: ఇంతకు ముందు వరకు డల్ గా ఉన్నారు. ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
సంధ్య: పెళ్లి ఎలాగూ జరగదు కదాని..
గౌరి: ఏమన్నావు.
శ్రావణి: అదే జరక్కుండా ఆగదు కదా అనబోయి అలా అంది. పద వెళదాం రా..
సంధ్య: అక్కా నీకో సర్‌ప్రైజ్ కూడా ఉంది.
గౌరి: ఎంటది..?
శ్రావణి: చూద్దువు కానీలే పదా..?
మంటపం దగ్గరకు వచ్చిన గౌరి కోపంగా శంకర్ ను చూస్తుంటుంది. దీంతో గౌరి గారు మీరు అలా కోపంగా చూడకండి మీ పెళ్లికి మీ శ్రేయోభిలాషి ఇంటి ఓనరు పిలిస్తే వచ్చానని చెప్తాడు. దీంతో పాండు వచ్చి కంగారు పడుతుంటే గౌరి మాత్రం ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి ఆగదు అంటుంది. ఇంతలో పాండు వచ్చి పంతులును పెళ్లి త్వరగా చేయమని చెప్తాడు. దీంతో తాళిబొట్టు లేకుండా పెళ్లి ఎలా చేయాలంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి గురించి ఫీల్ అయిన గగన్ – అపూర్వకు నిజం చెప్పిన భూమి