Meghasandesam Serial weekly Episode: చెర్రిని అపూర్వ తిడుతుంటే కేపీ అడ్డు వస్తాడు. అపూర్వ గారు ఎవరు సక్రమంగా పెంచారో ఎవరు వంకరగా పెంచారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు.. అంటూ గట్టిగా మాట్లాడుతుంటే.. ఇంతలో  శరత్‌ చంద్ర నోర్మూయ్‌ అంటూ కోపంగా వస్తూ..  మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు. నేను నా శోభాచంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను. లేదంటే.. అప్పటికప్పుడే నిన్ను చంపేయాల్సింది. అంటూ తిడుతుంటే.. భూమి వస్తుంది. చంపేయాల్సింది నాన్న  మీరు ఆరోజు మామయ్యను చంపే ప్రయత్నం చేయాల్సింది. చావు భయంతోనైనా మామయ్య మీకు నిజం చెప్పే ప్రయత్నం చేసేవారు. అమ్మది ప్రమాదావశాత్తు జరిగిన మరణం కాదని ఎవరో తనని చంపారని అప్పుడే మీకు అర్థం అయ్యేది అంటూ భూమి అనగానే..

కోపంలో శరత్‌ చంద్ర  అమ్మని ఎవరు మర్డర్‌ చేశారో నాకు తెలుసు..? అంటూ గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అపూర్వ డబుల్‌ షాక్ అవుతుంది. ఇంతలో భూమి ఏంటి నాన్న మీరు అనేది అమ్మను ఎవరు చంపారో మీకు తెలుసా… అని అడగ్గానే.. తెలుసు కానీ ఆ ఎస్సై నిజం చెప్పకుండానే చనిపోయాడు. అంటూ ఎస్సై ఫోన్‌ చేసిన విషయం.. గెస్ట్ హౌస్‌కు వచ్చి మర్డర్‌ అయిన విషయం చెప్తాడు శరత్ చంద్ర. దీంతో మీరు ఫోన్‌ మాట్లాడినప్పుడు మీ పక్కన ఎవరున్నారు నాన్న అని శరత్‌ చంద్రను అడిగితే పక్కన లేను కానీ నేను విన్నాను అంతమాత్రం చేత నేను తప్పు చేశానంటే బావ నమ్ముతావా నువ్వు అంటుంది అపూర్వ. శరత్‌ చంద్ర నమ్మనని అసలు తప్పు చేసిన వ్యక్తి గాజు దొరికిందని అది నీ గాజుతో మ్యాచ్‌ కాలేదని చెప్తాడు శరత్.

తర్వాత ఉదయ్‌ కోపంగా శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి భూమి ఇంకా గగన్‌ను ప్రేమిస్తుందని చెప్తాడు. అలా ఏం లేదని ఇప్పుడే భూమితో పలికిస్తానని లోపలి వెళ్లి భూమిని పిలిచి ఇంకా గగన్‌ను ప్రేమిస్తున్నావా..? అని అడుగుతాడు శరత్ చంద్ర. దీంతో భూమి లేదని చెప్తుంది. అయితే ఇలా చెప్తే తాను నమ్మనని శోభాచంద్ర మీద ఒట్టేసి  చెప్పాలని అడుగుతాడు. దీంతో భూమి, అపూర్వ మీద ఒట్టేసి చెప్తుంది. ఎందుకు అపూర్వ మీద ఓట్టేశావని శరత్‌ చంద్ర అడిగితే చనిపోయిన అమ్మ మీద ఒట్టేసి నేను అబద్దం చెప్పినా అమ్మకు ఏం కాదని.. కానీ బతికున్న అపూర్వ మీద ఓట్టేసి అబద్దం చెప్పలేమని ఒకవేళ అబద్ద చెబితే పిన్నికి ఏమైనా అవుతుందన్న భయం ఉంటుందని అందుకే పిన్ని మీద ఒట్టేశానని చెప్తుంది భూమి.

ఇక శారద బర్తుడేను గ్రాండ్‌గా శారదకు తెలియకుండా సర్‌ఫ్రైజ్‌గా చేయాలనుకుంటాడు. అందుకోసం అకాడమీలో ఏర్పాట్లు  చేస్తాడు. తర్వాత శారదను అకాడమీకి వచ్చేలా చేస్తాడు. అక్కడకు గగన్‌ను తిట్టుకుంటూ వచ్చిన శారద తన బర్తుడే వేడుకులు చూసి ఆశ్చర్యపోతుంది. గగన్‌న హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత భూమి ప్లాన్‌ చేసి శారద, కేపీ గుడికి వెళ్లేలా చేస్తుంది. ఇద్దరూ గుడికి వెళ్లగానే అక్కడ ఉన్న గోరింటాకు పిన్ని ( సుజాత) చూసి అపూర్వకు ఫోన్‌ చేసి చెప్తుంది. అపూర్వ వెంటనే శరత్‌ చంద్రకు చెప్పి రెచ్చగొడుతుంది. రెచ్చిపోయిన శరత్‌ చంద్ర గన్‌ తీసుకుని గుడికి బయలుదేరుతాడు. అంతా గమనించిన చెర్రి, భూమికి కాల్‌ చేస్తాడు.

వెంటనే భూమి గుడికి బయల్దేరుతూ చెర్రిని కూడా తనతో పాటు మీరాను తీసుకురమ్మని చెప్తుంది. చెర్రి మీరా గుడికి దగ్గరకు వెళ్తారు. చెర్రి కారు పార్క్‌ చేసి వస్తాను నువ్వు వెళ్లు అని చెప్పగానే మీరా గుడి మీదకు వెళ్తుంది. అక్కడ రక్తంతో ఉన్న కేపీని చూసి షాక్ అవుతుంది. ఏమైందని అడుగుతుంది. చెర్రి, నక్షత్ర కాపురం బాగుండాలని మొక్కుకున్నాను. ఆ మొక్కు ఇలా తీర్చుకుంటున్నాను అని కేపీ అబద్దం చెప్తాడు. మీరా ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శరత్‌ చంద్రను మీరా ఆపేస్తుంది. కేపీ మొక్కు గురించి చెప్తుంది. శరత్‌ చంద్ర షాక్ అవుతాడు. దీంతో ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!