Meghasandesam Serial Today Episode: బ్యాచిలర్‌ పార్టీ అయిపోయాక ఉదయ్‌ కోపంగా శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లి గగన్‌, భూమిని ఎత్తుకుని వెళ్లడం.. భూమి కూడా గగన్‌తో క్లోజ్‌గా ఉన్న వీడియో చూపిస్తాడు. వీడియో చూసిన శరత్ చంద్ర కోపంగా భూమిని పిలుస్తాడు. భూమికి వీడియో చూపిస్తాడు.

శరత్‌: అడిగిన ప్రతిసారి ఆ గగన్‌ను ప్రేమించడం లేదు మర్చిపోయాను అని నాకు నువ్వు అబద్దం చెప్పావు. నాకు నువ్వు అబద్దం మాత్రమే చెప్పలేదు. మోసం చేశావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నట్టేట ముంచావు. మీ అమ్మ చచ్చిపోయి బతికిపోయింది. బతికి ఉంటే ఇప్పుడు చచ్చిపోయేది. చెప్పు.. నన్నెందుకు మోసం చేయాలనిపించింది.

అంటూ శరత్‌ చంద్ర కోపంగా భూమిని కొడతాడు. భూమి దూరంగా వెళ్లి కింద పడుతుంది. అప్పుడే భూమి మెడలో తాళి బొట్టు కనిపిస్తుంది. అది చూసిన శరత్‌ చంద్ర షాక్ అవుతాడు. అందరూ షాక్ అవుతారు.  

శరత్‌: ఏంటి ఈ తాళి బొట్టు ఏంటి..?

భూమి: ఇది రాత్రి గగన్‌ బావ నా మెడలో కట్టేశాడు.

అందరూ షాక్ అవుతారు.. చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు.

శరత్‌: వాడు కడుతుంటే.. నా అంగీకారమే లేకుండా వాడిని పెళ్లి చేసుకోను అన్న నువ్వు.. ఎలా తాళి కట్టించుకున్నావు అమ్మా..

అపూర్వ: ఎలా ఉంది బావ వీడియో చూస్తుంటే అర్తం కావడం లేదు. వాళ్లిద్దరూ రాత్రి పుల్లుగా తాగి ఉన్నారు. మత్తులోనే మనుషుల అసలు రూపాలు బయటు వస్తాయిగా.. వాడితో తాళి కట్టించుకోవడానికి నీ బోడి అనుమతి ఎందుకు అని కట్టించేసుకుని వచ్చి ఉంటుంది.

అని అపూర్వ చెప్పగానే.. ఎలా కట్టించుకున్నా ఈ తాళి చెల్లదు అంటూ శరత్‌ చంద్ర తాళి తీసేయబోతుంటే.. కేపీ అడ్డుపడి నీ కొడుకు కట్టిన తాళిని నా కోడలు మెడలోంచి మీరు తెంపేస్తే నేను మీ చెల్లెలు మెడలో కట్టిన తాళిని నేను తెంపేస్తాను అంటూ బెదిరిస్తాడు. దీంతో శరత్‌ చంద్ర భూమిని తీసుకుని గగన్‌ ఇంటికి వెళ్తాడు.  కోపంగా బయట నుంచే గగన్‌ను పిలుస్తాడు.

శరత్‌: ఓరేయ్‌ గగన్‌ బయటకు రారా..?

గగన్‌: రేయ్‌ శరత్‌ చంద్ర..  

అనుకుంటూ బయటకు వస్తాడు గగన్‌..

 శరత్: అరేయ్‌ చెప్పరా.. దీని మెడలో తాళి ఎందుకు కట్టావురా..

అంటూ శరత్‌ చంద్ర భూమి మెడలోంచి తాళి తీసి చూపించగానే.. అందరూ షాక్‌ అవుతారు. శారద ఏం జరుగుతుందో అర్తం కాక ఫ్రీజ్‌ అయిపోతుంది. ఇక గగన్‌కు భూమి మెడలో తాళి చూడగానే..  రాత్రి జరిగింది మొత్తం గుర్తుకు వస్తుంది. తాము తాగిన మైకంలో గుడి దగ్గరకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి దండలు మార్చుకున్నది.. గగన్‌ అక్కడే ఉన్న పసుపు కొమ్ము తీసుకుని భూమి మెడలో కట్టింది మొత్తం గుర్తుకు వస్తుంది. దీంతో గగన్‌ ఏమీ మాట్లాడాలో అర్థం కాక చూస్తుండిపోతాడు.

శరత్‌: నీతో తాళి కట్టించుకుందని తెలిసిన మరుక్షణమే నేను భూమిని చంపేయాలి. కానీ చంపకుండా నాలో ఉన్న తండ్రి మనసే.. నన్ను అడ్డుకుంది. నా దృష్టిలో భూమి బతికి ఉందని కాదు.. చచ్చిపోయింది. తల కొరివి పెడతావో గొయ్యి తవ్వి పాతి పెడతావో నీ ఇష్టం

అంటూ భూమిని లాగి గగన్‌ పాదాల దగ్గరకు తోసేస్తాడు శరత్‌ చంద్ర. భూమి ఏడుస్తూ ఉంటుంది పూర్ణి, శారద, శివ వచ్చి భూమిని పైకి లేపుతారు. శరత్‌ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!