Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో శారద కెమెరా గురించి అందులోని శోభా చంద్ర మర్డర్ గురించి గగన్ చెప్పడంతో గగన్ కోపంగా రివాల్వర్ తీసుకుని అపూర్వను చంపేస్తానని హాస్పిటల్ నుంచి వెళ్లిపోతాడు. గగన్ నేరుగా శరత్ చంద్ర ఇంట్లోకి వెళ్లి గట్టిగా అపూర్వ బయటకు రావే అంటూ అరుస్తుంటాడు. ఇంతలో ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు.
శరత్: అరేయ్ గగన్ ఏంట్రా అరుస్తున్నావు.. అయినా నా ఇంటికి మళ్లీ ఎందుకు వచ్చావురా.. నా ఇంటికి రావడానికి కొంచెమైనా సిగ్గు ఉందారా..? నీకు
గగన్: రేయ్ శరత్ చంద్ర నీ ఇంటికి రావడానికి సిగ్గు ఉండటం కాదురా నిజం తెలిస్తే నవ్వే సిగ్గుతో చచ్చిపోతావు.. నా తల్లిని చంపాలనుకుంది నీ భార్య..
శరత్: రేయ్ మీ అమ్మను అపూర్వ చంపడం కాదురా నేనే చంపేస్తాను.. అది నా చెల్లి కాపురానికి అడ్డుగా ఉంది. అయినా మీ అమ్మను చంపాల్సిన అవరసం అపూర్వకు ఎందుకు ఉందిరా..?
గగన్: ఎందుకంటే మా అమ్మ స్పృహలోకి వచ్చి నిజం చెప్తుందని.. ఆ నిజం బయటకు వస్తే నువ్వే నీ భార్యను చంపేస్తావని అందుకే చంపాలనుకుంది. అందుకోసం కిరాయి రౌడీలను నా ఇంటి మీదకు పంపిందిరా నీ అపూర్వ.. హాస్పిటల్ లో ఉన్న మా అమ్మ నాకు జరిగిన నిజం మొత్తం చెప్పింది. ఆ నిజం మీకు తెలిస్తే మీరే దాన్ని చంపేస్తారు.
అపూర్వ: మరో కొత్త నాటకం ఆడుతున్నావారా..? అసలు ఆ నిజం ఏంటో చెప్పరా.. అపూర్వను చంపేస్తానా..? లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తానా తెలుస్తుంది కదా.. ఆ నిజం ఏంటో చెప్పరా.. అసలు ఏం జరిగిందో కెమెరాలో ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పరా..?
గగన్: చెప్తాను.. అంతా చెప్తాను.. వీడియో కెమెరాలో మా అమ్మ చూసింది. నాకు చెప్పింది అంతా చెప్తాను..
అపూర్వ: బావా వీడేదో మళ్లీ కొత్త కథ అల్లుతున్నాడు బావ
గగన్: కొత్త కథ కాదు..చాలా పాత కథ శోభా చంద్ర చావు వెనక ఉన్న కథ.. మా అమ్మ తెలుసుకున్న కథ..
శరత్: రేయ్ గగన్ పిచ్చి కూతలు కూయకుండా అసలు ఏం జరిగిందో చెప్పరా..? అయినా నా శోభ మరణం గురించి నీకేం తెలుసురా.. చెప్పు..
గగన్: శోభాచంద్రను చంపింది నీ అపూర్వే.. అపూర్వనే నీ భార్య శోభాచంద్రను చంపింది. కెమెరా వీడియో రికార్డు అయింది. ఆ వీడియో కోసమే నీ అపూర్వ నా ఇంటికి ఇద్దరు కిరాయి రౌడీలను పంపించింది. ఆ వీడియో చూసిన మా అమ్మ ఎక్కడ నిజం చెప్తుందోనని మా అమ్మను చంపమని చెప్పింది. ఇప్పుడు మా హాస్పిటల్ లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
అపూర్వ: రేయ్ గగన్ మీ అమ్మ, నువ్వు కావాలని డ్రామాలు ఆడుతున్నారా..? అసలు వీడి మాటలు నమ్మొద్దు బావ.. వీడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు.. శోభా అక్క మరణాన్ని మర్డర్ గా చిత్రీకరించి మనల్ని విడగొట్టాలని ప్లాన్ చేశారు. వీడు కావాలనే నిన్ను రెచ్చగొడుతున్నాడు.
గగన్: నేను కొత్తగా చిత్రీకరించడం కాదు అపూర్వ.. అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి. అవి బయటకు తీస్తాను.. అప్పుడు నీ మొగుడే నీకు ఉరిశిక్ష వేస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయ్ అపూర్వ..
శరత్: రేయ్ గగన్ పిచ్చి కూతలు కూస్తే నిన్ను ఇక్కడే చంపేస్తానురా..?
అంటాడు. దీంతో వీడియో చూశాక నువ్వు ఎవరిని చంపాలో డిసైడ్ చేసుకుందువులే శరత్ చంద్ర అంటూ గగన్ చెప్పగానే.. అపూర్వ భయంతో వణికిపోతుంది. శరత్ చంద్ర అనుమానంగా అపూర్వను చూస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!