Meghasandesam Serial Today Episode: గుడిలో ఉన్న తన మనుషులను అపూర్వ బయటకు పిలుస్తుంది. వాళ్లంతా ( బ్యాండ్‌ మేళం, పూలు కట్టేవాళ్లు అంతా అపూర్వ కిరాయి రౌడీలే ఉంటారు.) అందరూ తన దగ్గరకు వచ్చాక

అపూర్వ: ఓరేయ్‌ మీరంతా ఎవ్వరికీ అనుమానం రాకుండా జనంలో కలిసిపోండి ఆ భూమి ఇక్కడికి వస్తే నేను చెప్తాను. దాన్ని లేపేయండి..

రౌడీలు: అలాగే మేడం మేము చూసుకుంటాము..

అపూర్వ: ఏ పొరపాటు జరిగినా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ అవకాశం చేజారిపోతుంది.

రౌడీ: మేడం ఈరోజు ఆ భూమి చావు రాసిపెట్టి ఉంది. చంపేసి దాన్ని నదిలో కలిపేస్తాం.

అపూర్వ: అందులో కనక తేడా జరిగితే అదే నదిలో మిమ్మల్ని కలిపేస్తా. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయండి

అంటూ చెప్తుంది అపూర్వ. మరోవైపు భూమి, శారద, గగన్‌ గుడికి వెళ్తుంటారు.

గగన్‌: అమ్మా గుడికి వెళ్లాక  నన్ను రమ్మని గొడవ చేయకు నేను రాను..

శారద: అలా అనకు గగన్‌. పెళ్లి అయ్యాక తొలిసారిగా వస్తున్నారు. కలిసి దేవుడిని దర్శించుకుంటే మంచిది.

భూమి: చాలా థాంక్స్‌ అత్తయ్యా..

శారద: నా కోడలికి నేను వెంట లేకపోతే ఎలా..? భర్తగా వాడు నీ వెంట నడవకపోతే ఎలా..? ఇది మా బాధ్యత. మనసులో నువ్వు ఏదీ పెట్టుకోకుండా నాట్య నివేదన మీద మనసు లగ్నం చేయ్‌. మీ అమ్మ ఆశీస్సులు నీకు ఉంటాయి.

భూమి: అలాగే అత్తయ్యా..

అంటూ వెళ్తుంటారు. మరోవైపు నక్షత్ర రెడీ కాకుండా నగలన్నీ తీసేస్తుంది. ఇంతలో సుజాత వస్తుంది.

సుజాత: అమ్మాయి నక్షత్ర ఏం చేస్తున్నావు..?

నక్షత్ర: కనిపించడం లేదా..? జ్యువెల్లరీ తీసేసి వెళ్లిపోతున్నాన.

సుజాత: ఎక్కడికి వెళ్తున్నావు.. 

నక్షత్ర: ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తున్నాను.

సుజాత: మరి నాట్య నివేదన..

నక్షత్ర: నాకు రాదు నా వల్ల కాదు..

సుజాత: అయ్యయ్యో ఇప్పుడు ఇలాంటి బాంబు పేల్చావేంటి అమ్మాయి..ఉండు మీ అమ్మను పిలుస్తాను.

అంటూ వెళ్లి అపూర్వను తీసుకుని నక్షత్ర దగ్గరకు వెళ్తుంది. రెడీ కాకుండా నగలు తీస్తున్న నక్షత్రను చూసి అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. బలవంతంగా నక్షత్రన రెడీ చేయించి నాట్య నివేదన చేయిస్తుంది. ఇంతలో నక్షత్ర చేతిలో ఉన్న దీపం కిందపడబోతుంది. వెంటనే అక్కడకు వచ్చిన భూమి ఆ దీపం కింద పడకుండా పట్టుకుంటుంది. దీంతో నక్షత్ర మిగతా దీపాలు కూడా భూమికి ఇస్తుంది. భూమి నాట్యం చేస్తూ నివేదన ఇవ్వడానికి వెళ్తుంది. అపూర్వ మనుషులు పగిలిన సీపా ముక్కలు వేస్తారు. అందరూ షాక్‌ అవుతారు.

భూమి మాత్రం అలాగే వాటి మీద నాట్యం చేస్తూ వెళ్తుంది. కాళ్లంతా రక్తం కారుతుంది. దీంతో అపూర్వ మనుషులు ఇనుప మేకులు వేస్తారు.. అయినా కూడా భూమి నాట్యం చేస్తూనే వెళ్తుంది. ఇంతలో అపూర్వ వాళ్లకు సైగ చేస్తుంది. అది గమనించిన గగన్‌ కోపంగా వెళ్లి రౌడీలను కొడుతుంటాడు. ఆ ఫైటింగ్‌ లో దీపం కింద పడి భూమి వెళ్తున్న దారిలో మంటలు అంటుకుంటాయి. అయినా భూమి అలాగే నడుస్తుంది. దీంతో గగన్‌ మంటల మీద పడుకుని భూమిని తన మీద నుంచి వెళ్లమంటాడు. భూమి, గగన్‌ మీద నుంచి వెళ్లి నాట్య నివేదన పూర్తి చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!