Meghasandesam Serial Today Episode:  క్యాంటీన్‌ దగ్గర వెయిట్‌ చేస్తున్న శివ దగ్గరకు బిందు వస్తుంది. ఎవరి కోసం వెయిట్‌ చేస్తున్నావు అని అడుగుతుంది. శివ నా బ్యాగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను.. నా బ్యాగ్‌ నాకు ఇవ్వు అంటాడు. బిందు బ్యాగ్‌ ఇస్తుంది. శివ బ్యాగ్‌ ఓపెన్‌ చేసి నోట్స్‌ చూస్తాడు.

శివ: బిందు నీ హ్యాండ్‌ రైటింగ్ చాలా బాగుంది.

బిందు: థాంక్స్‌ నీ రైటింగ్‌ ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను.

శివ: ఏమైంది బిందు.. అలా చూస్తున్నావు..

బిందు: రికార్డ్‌ అంతా చినిగిపోయి ఉంది..

శివ: చినిగిపోయి ఉందా..?

ఇంతలో అక్కడికి పూర్ణి వస్తుంది.

పూర్ణి: ఏంటి ఇద్దరూ షాక్‌ కొట్టిన కాకుల్లా అలా నిలబడిపోయారు.

శివ: పాపం బిందు రికార్డు చినిగిపోయి ఉందట. ఎవరు చేశారో తెలియడం లేదు.

బిందు: ఎవరో ఎందుకు చింపుతారు. ఇదిగో ఇదే చింపి ఉంటుంది.

పూర్ణి: చూసినట్టే చెప్తున్నావు.. నేను చింపేశానని నీకు ఎలా తెలుసు..?

అనగానే ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఒకరినొకరు కొట్టుకుంటుంటారు. మధ్యలో వెళ్లిన శివను ఇద్దరూ కలిసి కొడతారు. శివ తలకు గాయం అవుతుంది. బిందు వెళ్లిపోతుంది. తర్వాత భూమి కోసం పార్క్‌కు వెళ్లిన శారద అక్కడే భూమి దగ్గర ఉండిపోతుంది. ఇంట్లో శారద లేకపోవడంతో గగన్‌ ఎక్కడికి వెళ్లి ఉంటుందని పూర్ణిని అడుగుతాడు. భూమిని వెతుక్కుంటూ వెళ్లిందని పూర్ణి చెప్పగానే.. గగన్‌ కూడా శారదను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇద్దరూ పార్కులో కనిపించగానే కారు దిగి పార్కులోకి వెళ్తాడు గగన్‌.

గగన్‌: అమ్మా ఇక్కడేం చేస్తున్నావు.. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు..

శారద: నేను ఆ ఇంట్లో ఉండను.. భూమి ఎక్కడుంటే అక్కడ ఉంటాను..

గగన్‌: అమ్మా నువ్వు మరీ చిన్న పిల్లలా బిహేవ్‌ చేయకు.. మనకు సంబంధం లేని వ్యక్తులతో ఎందుకుంటావు..

శారద: చూడు నాన్న నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇక్కడే ఉంటాను.. ఇంటికి రాను గాక రాను..

గగన్‌:  సరే రామ్మా మన ఇంటికి వెళ్దాం..

శారద: పద భూమి ఇద్దరం కలిసే వెళ్దాం..

గగన్‌: అమ్మా నేను నిన్ను మాత్రమే రమ్మంటున్నాను.. తనను రమ్మనలేదు..

శారద: నేను ఒక్క దాన్నే రాలేను.. అయినా భూమిని ఒక్కదాన్నే ఇక్కడ వదిలేసి రమ్మంటావా..?

గగన్‌: అదే కదా నేను నీతో చెప్తుంది.

శారద: చూడు గగన్‌ నువ్వు భూమి మెడలో తాళి కట్టినా కట్టకపోయినా భూమి నా కోడలురా నేను తనను వదిలేసి రాలేను..

గగన్‌: నువ్వు చెప్పినట్టే భూమి మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్క కండీషన్‌.. నేను తాళి కట్టినట్టు తనను ప్రూవ్‌ చేయమను.

భూమి: నాకు ఈ షరత్తు ఓకే.. నేను ప్రూవ్‌ చేస్తాను..

అని భూమి చెప్పగానే.. సరే ముందు ప్రూవ్‌ చేయ్‌ తర్వాత నేనే వచ్చి నిన్ను గ్రాండ్ గా నా ఇంటికి తీసుకెళ్తాను.. నువ్వు అంతవరకు వచ్చేయ్‌ అమ్మా అంటూ గగన్‌ పిలవగానే.. శారద తాను రానని భూమికి సపోర్టుగా ఇక్కడే ఉంటానని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!