Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున అత్త, ప్రమోదినితో త్వరలోనే నేను దేవా కలిసిపోతాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. నీ ధైర్యం చూస్తుంటే నీ మాటలు నిజం అవుతుందని సంతోషంగా ఉందని శారద అంటుంది. మిథున దేవాకి ఆకలేస్తుంది వంట చేసేయాలి అని పరుగులు తీస్తుంది. ఇంత మంచి భార్యని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అని శారద బాధ పడుతుంది.
లలిత జరిగింది అంతా తలచుకొని బాధ పడుతుంది. అలంకృత తల్లిని ఓదార్చుతుంటే రాహుల్, త్రిపురలు రౌడీ భారీ నుంచి మన మిథున సేవ్ అయిందని సంతోషించమని అంటారు. దేవా డబ్బు కోసం ఏం చేయడు..స్వార్థపరుడు కాడు. ఎప్పుడో మిథునకు మనస్ఫూర్తిగా భార్య స్థానం ఇచ్చేశాడు. కానీ హాస్పిటల్‌లో నుంచే ఏదో జరిగింది.. అందుకే మిథునని దూరం పెడుతున్నాడు అని లలిత అంటే అంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు అని హరివర్ధన్ అంటాడు. దేవాకి నిజంగా మిథున మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే చెప్పేవాడు. ఇలా ఇంటికి రాగానే ప్రేమ మొదలైందా ఏదో ఇన్‌టెన్షన్‌తోనే ఇంటికి వచ్చాడని అలాంటి వాడితో మన మిథునకు ఎప్పటికైనా ప్రమాదమే వాడి అంత వాడు వెళ్లి పోవడం మంచిదైంది.. ఇప్పటికైనా మిథునని వచ్చేయమని చెప్పు అని హరివర్ధన్ అంటాడు.
మిథున దేవా కోసం వంట చేస్తుంటే ఎవరో బిర్యాని వండుతున్నారు అని కాంతం కిచెక్‌ని పరుగులు పెడుతుంది. దేవా మెట్టెలు తొడగలేదని ఓ మూల కూర్చొని బాధ పడకుండా ఇంత జోష్‌లో వంట చేస్తున్నావ్ ఏంటి అని కాంతం అడిగితే నేను ఈ బిర్యానీ మా ఆయన కోసం వండుతున్నాఅని మిథున అంటే కాంతం షాక్ అయిపోతుంది. నువ్వు వండితే దేవా తింటాడా అని కాంతం అంటే నాకు తెలుసులే అని అంటుంది. ఇక ప్రమోదిని మిథునతో దేవా తాగి వస్తాడేమో జాగ్రత్త అని అంటుంది.
మిథున దేవా కోసం వంట సిద్ధం చేస్తుంది. దేవాని చూసి తాగొచ్చావన్న మాట తాగితే ఆకలేస్తుందంట కదా.. నీ కోసం నా ప్రేమ అంత పెట్టి బిర్యాని వండాను తిందువురా అని పిలుస్తుంది. దేవా వెళ్లిపోతుంటే మిథున చేయి పట్టుకుంటుంది. చేయి వదులు అని దేవా అంటే పట్టుకున్నది జీవితాంతం వదలకుండా ఉండటానికి తినకపోతే రెండు వేసి అయినా తినిపిస్తా అని దేవాని తీసుకెళ్లి వడ్డిస్తుంది. దేవా మిథునని అలా చూస్తూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటే మాత్రం అలా చూపులతో తినేస్తావా నాకు సిగ్గేస్తుంది అని మిథున అంటుంది. నిన్ను వెళ్లిపోమన్నా వెళ్లడం లేదని ఎందుకు అని దేవా అంటాడు. దానికి మిథున నువ్వేంటో తెలీనప్పుడే నువ్వు వెళ్లమంటే పోలేదు.. ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు.. నీ మీద నాకు మనసు నిండా ప్రేమ ఉంది.. నీ గుండెల నిండా నా మీద ప్రేమ ఉంది.. మరి ఇప్పుడు నిన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతా మొగుడ్స్ అని అంటుంది.
మిథున దేవాతో ఈ జన్మకి నువ్వే నా భర్తవి.. ఇదే నా మెట్టెనిల్లు నేను నిన్ను వదిలేసి వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు కూడా ఫిక్స్ అయిపో.. అని అంటుంది. దేవా మందు తాగుతూ మిథున మాటలు తలచుకొని ఏడుస్తాడు. మిథున నువ్వు మనసులో సముద్రం అంత దుఃఖాన్ని మోస్తూ పైకి నవ్వుతున్నావు అని నాకు తెలుసు నేను అంతే నీపై సముద్రం అంత ప్రేమ ఉన్నా పైకి నీ మీద కోప్పడుతున్నా.. నీకు ఎలా దూరం కావాలో అర్థం కావడం లేదు ఐలవ్‌యూ మిథున అని అంటాడు.
నేత్ర ఇంటి దగ్గరకు ఎవరో వచ్చినట్లు అనిపించడంతో వెంటనే దేవాకి కాల్ చేసి భయపడుతూ మా ఇంట్లోకి ఎవరో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు ఉన్నాడు. దేవుడిలా మీరు గుర్తొచ్చారు నన్ను కాపాడండి సార్ అని ఏడుస్తుంది. దేవా నేత్రి ఇంటికి వెళ్తాడు.నేత్ర భయంతో దేవాని పట్టుకుంటుంది. దేవా ఇంట్లోకి వెళ్లి మొత్తం వెతుకుతుంటే నేత్ర దేవాని హగ్ చేసుకొని నవ్వుతుంది. దేవా భయపడొద్దు అని చెప్తాడు. నేత్ర కావాలనే దేవాని చుట్టు తిప్పించి హగ్ చేసుకొని నవ్వుతుంది. దేవా షాక్ అయిపోతాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.