Meghasandesam Serial Today Episode: గగన్‌ ఇంటి ముందు రాత్రంతా వానలో నిలబడిన భూమి స్పృహ తప్పి పడిపోవడంతో శారద చూసి గగన్‌ ను పిలుస్తుంది. వెంటనే అందరూ కలిసి భూమిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. భూమికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి బయటకు వస్తుంది.

శారద: డాక్టర్‌ మా భూమికి ఏమీ కాలేదు కదా..? తను క్షేమంగానే ఉంది కదా..?

డాక్టర్‌:  తను అంతలా తడవాల్సిన అవసరం ఏమొచ్చింది.

గగన్‌: వర్షంలో చిక్కుకుపోయింది డాక్టర్‌. తల దాచుకోవడానికి ఎక్కడా షెల్టర్‌ దొరకలేదు.

డాక్టర్‌: టైంకు తీసుకొచ్చారు కాబట్టి సేఫ్‌ అయింది. ఏమాత్రం అటాక్‌ అయినా న్యూమోనియా అటాక్‌ అయ్యేది. అది ప్రాణానికి ప్రమాదం అయ్యేది.

శారద: డాక్టర్‌ ఒకసారి చూడొచ్చా..?

డాక్టర్‌: నర్సు చెప్తుంది అప్పుడు వెళ్లి మాట్లాడండి.. డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి తీసుకెళ్లండి.

శారద: థాంక్యూ డాక్టర్‌.. ( డాక్టర్‌ వెళ్లిపోతుంది.) ఏంట్రా తనకు షెల్టర్‌ దొరకలేదా.? నువ్వు ఇంట్లోకి రానివ్వలేదా..?

అంటూ శారద తిడుతుంది. ఇంతలో నర్స్‌ వచ్చి మేడం భూమి గారికి స్పృహ వచ్చింది మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్తుంది. వెంటనే శారద లోపలికి వెళ్తుంది.

శారద: ఎందుకమ్మా ఇలా చేశావు.. రాత్రంతా వర్షంలో తడవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎక్కడికైనా వెల్లొచ్చు కదా

భూమి: ఇంకెక్కడికి వెళ్లమంటారు అత్తయ్య. నాకు నా పుట్టిల్లు లేదు. అక్కడ నేను చచ్చిపోయి ఒక రోజు అవుతుంది. మెట్టినిల్లు దిక్కు అనుకుని వస్తే బావ కూడా నేను చస్తే చావమని వదిలేశాడు. ఇంక ఎక్కడికి వెళ్లమంటారు.

గగన్‌: ఇంకెక్కడికైనా వెళ్లు కానీ నా ఇంటికి మాత్రం రాకు.  ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలనుకుంటే వెళ్లు కానీ నా కళ్ల ముందు చావకు ఇంకెక్కడికైనా వెళ్లి చావు.

శారద: ఒరేయ్‌ గగన్‌ ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా.?

గగన్‌: అమ్మా నీకే అర్థం కావడం లేదు. పొందిన ఆ జాలితో తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది.

అనడంతో శారద గగన్‌ ను తిడుతుంది. అక్కడి నుంచి గగన్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత భూమి హాస్పిటల్‌  నుంచి పార్కులోకి వెళ్లిపోతుంది. అక్కడ దీనంగా కూర్చుని ఉంటుంది. ఇంతలో తనలోని మరో భూమి బయటకు వస్తుంది.

భూమి ఆత్మ: ఒక రోజు  ఎలీ ఈ ఊరికి వచ్చావో అలాగే ఒంటరిగా నిలబడిపోయావు. ఈ ఊరికి వచ్చి నువ్వు ఇప్పటి వరకు ఏం సాధించావు భూమి.

అంటూ ఆత్మ నిలదీస్తుంటే.. భూమి దీనంగా వింటుంది. ఇంతలో అక్కడకు శారద వస్తుంది. భూమిని చూసి ఏడుస్తుంది.

శారద: భూమి..

అంటూ గట్టిగా పిలవగానే భూమి, శారదను చూసి ఎమోషనల్‌ అవుతుంది. దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. తర్వాత శారద తాను తీసుకొచ్చిన భోజనాన్ని భూమికి తినిపిస్తుంది. భూమి కూడా శారదకు అన్నం తినిపిస్తుంది.

భూమి: అత్తయ్యా మీరు ఎందుకు వచ్చారు.. మీరు నన్ను కలిశారు అని తెలిసినా..?  మీ అబ్బాయికి కోపం రావొచ్చేమో మీరు వెళ్లండి అత్తయ్యా

శారద: వాడికి కోపం వచ్చినా సరే నేను ఎక్కడికి వెళ్లేది లేదు.. నేను కూడా ఇక్కడే నీతోనే ఉంటాను భూమి.

భూమి: నాతోనే ఇక్కడ ఉంటారా..? నాకే దిక్కు లేదు. మీరు ఎక్కడ ఉంటారు..?

శారద: నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా కొడుకు నిన్ను తన భార్య అని ఒప్పుకోకపోవచ్చేమో కానీ నువ్వే నా కోడలివి

అంటూ శారద ఎమోషనల్‌ అవుతుంది. దీంతో భూమి ఏడుస్తూ శారదను హగ్‌ చేసుకుంటుంది. ఇద్దరూ బాధపడుతుంటే మరోవైపు ఇంట్లో గగన్‌ కూడా బాధపడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!