Meghasandesam Serial Today Episode: గుడి దగ్గర పూజలో ఉన్న శరత్‌ చంద్రకు ఏసీపీ సూర్య ఫోన్‌ చేసి ఒక సారి అర్జెంట్‌గా స్టేషన్‌కు రమ్మని పిలుస్తాడు. పూజ మధ్యలో శరత్‌ చంద్ర  స్టేషన్‌కు వెళ్తాడు. అక్కడ ఏసీపీ సూర్య తాను రత్నను పట్టుకున్న విషయం చెప్తాడు. తనను ఇంటరాగేషన్‌ చేస్తున్నామని త్వరలోనే నిజాలు రాబడతామని చెప్తాడు.

శరత్: అయితే మొత్తానికి మీ అన్నయ్య కేసు సాల్వ్‌ చేస్తూ.. నా భార్య శోభా చంద్ర కేసులో ముద్దాయిని కూడా బయటకు రప్పిస్తున్నారన్న మాట

ఏసీపీసూర్య: త్వరలోనే అసలు నేరస్థురాలు బయటపడతారు. అన్నట్టు మీకో విషయం చెప్పలేదు. ఇన్ని రోజులు ఆ రత్నం తలదాచుకుంది గగన్‌ వాళ్ల ఇంట్లోనే.. అదే పని మనిషిగా తల దాచుకుంది.

శరత్‌: లేదు సార్‌ ఆ గగన్‌ గాడి మాట అసలు నమ్మకండి.. వాడు పచ్చి చీటర్‌. మీ అన్నయ్య హత్య కేసులో వాడి హస్తం కచ్చితంగా ఉండే ఉంటుంది సార్‌.

సూర్య: మీరు ఆలా ఇంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు..?

శరత్‌: నేను అంటేనే వాళ్లకు పడదు. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. దాంతో ఎప్పుడూ నా మీద కక్ష్య సాధించాలని ఏదో ఒకటి చేస్తుంటాడు.

సూర్య: ఏదో ఒకటి అంటే కాస్త జరిగింది చెప్తారా..?

శరత్‌: నాకు ఇష్టం లేకున్నా నా కూతురిని ప్రేమించాడు. వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నా.. పెళ్లి పీటల దాకా వచ్చాక తాళి కట్టకుండా వెళ్లిపోయి నా పరువు తీసేశాడు. నేను వేరే వాళ్లతో సంబంధం కుదుర్చుకున్నాక.. నా బిడ్డను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసి మీ అన్నయ్యను మర్డర్‌ చేయించి నన్ను ఇరికించాలని చూశాడు. తర్వాత వాళ్ల ఇంట్లోనే పని మనిషిగా పెట్టుకుని ఉంటాడు సార్. ఇదే నా అనుమానం..

సూర్య: మీరు చెప్తున్నదాన్ని బట్టి చూస్తే.. ఆ అనుమానం నాక్కూడా వస్తుంది. కానీ పూర్తి ఆధారాలు లేకుండా మనలో మనం ఊహించుకుని వాళ్లను దోషులుగా పరిగణించలేము కదా..? కానీ వాళ్లకు మా అన్నయ్య మర్డర్‌కు ఏదైనా సంబంధం ఉందేమో కనుక్కుంటాను. ఏది ఏమైనా చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు శిక్ష పడాల్సిందే..మా అన్నయ్య ఆత్మకు శాంతి కలగాల్సిందే..

శరత్‌: నేను మీ గురించి నిజమే.. మీరు కేసు తీసుకుంటే సాల్వ్‌ అవ్వాల్సిందే అని చెప్పారు. ఇప్పుడు మీరు నిరూపిస్తున్నారు.. ఎనీవే నేను వస్తాను..

అంటూ చెప్పి శరత్‌ చంద్ర వెళ్లిపోతారు. కారు దగ్గరకు వెళ్లిన శరత్ చంద్ర  ఆ రత్నం వాళ్ల ఇంటికు ఎందుకు వెళ్లింది. ఇన్ని రోజులు అక్కడే ఉందంటే ఏదో ఉంది. నా వేలో నేను కనుక్కుంటాను అని మనుసులో అనుకుని కారెక్కి గుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ పెల్లి చేసుకున్న ఆనందంలో గగన్‌, భూమి అమ్మ ముందు డాన్స్‌ చేస్తుంది. కొంత మంది వచ్చి వాళ్లకు తోడుగా డాన్స్‌ చేస్తుంటారు. అపూర్వ, నక్షత్ర కోపంగా చూస్తుంటారు. ఇంతలో అపూర్వ తన మనుషులకు సైగ చేస్తుంది. అపూర్వ మనుషులు కూడా డాన్స్‌ చేస్తున్నట్టు వెళ్లి కలర్స్‌ చల్లుకుంటూ భూమిని కిడ్నాప్ చేసి దహనం చేయబోతున్న రావణాసురుడి బొమ్మలో దాచేస్తారు. ఇంతలో పంతులు వస్తాడు.

పంతులు: బాబు ఇక మీ డాన్స్ ఆపితే మన మిగతా కార్యక్రమాలు పూర్తి చేయోచ్చు..

గగన్‌: ఇంకా ఏం కార్యక్రమాలు ఉన్నాయి పంతులుగారు..

పంతులు: ఇక ఈ కార్యక్రమంలో చివరి ఘట్టం మిగిలే ఉంది నాయనా.. అదే రావణ దహనం.. అది కానిచ్చేస్తే పూజ పూర్తయినట్టే..

గగన్‌: అవునా.. అయితే ఓకే గాయిస్‌.. అందరూ ఇక రావణాసురుడిని కాల్చేద్దామా

అంటూ స్టేజీ దిగి కిందకు వెళ్తాడు

శారద: అరేయ్‌ గగన్‌ భూమి ఎక్కడరా కనిపించడం లేదు..

అంటూ శారద చెప్పగానే.. గగన్‌, భూమి కోసం వెతుకుతాడు. ఇంతలో శరత్‌ చంద్ర రావణదహనం చేస్తాడు. గగన్‌ అక్కడి వచ్చి దహనం అవుతున్న రావణుడిలో భూమి ఉందని గమనిస్తాడు. వెంటనే భూమిని సేవ్‌ చేయడానికి గగన్‌ మంటల్లోకి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!