Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్లి కేపీని చూసిన గగన్ షాక్ అవుతాడు. కోపంగా భూమిని చూస్తుంటాడు. అంతకు ముందు భూమి చెప్పిన మాటలు (పెద్ద కొడుకుగా ఆయనకు నువ్వే తలకొరివి పెట్టాలి) గుర్తు చేసుకుంటాడు.
గగన్: బతికి ఉన్న ఆయనని చచ్చిపోయాడని చెప్పి ఈ నాటకం ఆడావా..? ఈ నాటకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా..? లేదంటే.. మా అమ్మ కూడా ఉందా..?
భూమి: బావ ఫస్ట్ నేను చెప్పేది విను బావ.
గగన్: వినను.. వింటే నువ్వు ఇంకో కట్టుకథ చెప్తావు.. కథలు చెప్పడం.. మోసం చేయడం నీకు మొదటి నుంచి అలవాటే కదా..? నన్ను మాయ చేసి ఈయన బాగయ్యాక పోలీసుల నుంచి తప్పిద్దామనుకుంటున్నావా..? అది నేను జరగనివ్వను నేను ఇప్పుడే ఈయనను పోలీసులకు పట్టిస్తాను.
అంటూ గగన్ వెళ్లబోతుంటే.. భూమి ఆపేస్తుంది.
భూమి: అది కాదు.. ముందు నా మాట విను బావ.. నా మాట విన్నాక నీకు నచ్చింది చేసుకో బావ.. నా మాట విను.. అయ్యో..
అంటూ బాధపడుతుంది. ఇంతలో గగన్ ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తాడు.
ఎస్పీ: హలో ఎవరు మాట్లాడేది..?
గగన్: ఆ ఎస్పీ గారు నేను గగన్ మాట్లాడుతున్నాను..
ఎస్పీ: ఆ ఏంటో చెప్పండి..
గగన్: మనం చనిపోయాడనుకున్న కృష్ణ ప్రసాద్ బతికే ఉన్నాడు.
ఏస్పీ: ఏం మాట్లాడుతున్నావు..
గగన్: అవును ఎస్పీ గారు.. ఇక్కడ అవంతి హాస్పిటల్‌లో ఉన్నాడు.
అని చెప్పగానే. భూమి షాక్ అవుతుంది. అంతా కలగంటుంది. హాస్పిటల్ లోకి వచ్చిన గగన్‌ను చూసి లోపలికి పారిపోతుంది. గగన్‌ను నిజం తెలియకూడదు అనుకుంటుంది. మరోవైపు కాలేజీ క్యాంటీన్‌లో కూర్చుని బాధపడుతున్న బిందు దగ్గరకు పూర్ణి వెళ్లి ఓదారుస్తుంది. తను తీసుకొచ్చిన లంచ్ బాక్స్ తీసి బిందుకు తినిపిస్తుంది. ఇంతలో శివ వస్తాడు.
శివ: ఆహా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో..? చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.. మీరిద్దరూ రోజు ఇలాగే కలిసి ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా..?
పూర్ణి: చూడు శివ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు.. ఏదో పాపం పిల్ల తినలేదని పెడుతున్నాను అంతే..
శివ: అదే చెప్తున్నాను.. మీరు నార్మల్ గా కలిస్తేనే ఇలా ఉందంటే మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు కలిసి ఉంటే
బిందు: ఎలా కలుస్తాము.. దీని అమ్మ వేరు.. నా అమ్మ వేరు..
అనగానే మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ పెద్దదవుతుంది. ఇద్దరూ కొట్టుకుంటుంటే.. శివ మధ్యలో వెళ్తాడు. శివను కొట్టి వెళ్లిపోతారు. మరోవైపు రూంలో ఉన్న గగన్ ఫోన్ మాట్లాడుతూ భూమి, గగన్ పెళ్లి ఫోటో చూస్తాడు. కోపంగా భూమిని పిలుస్తాడు. భూమి వస్తుంది.
భూమి: ఏంటి బావ అంత గట్టిగా పిలుస్తున్నారు..?
గగన్: మర్యాదగా ఆ ఫోటో తీసేయ్ ఇక్కడి నుంచి..
భూమి: తీసేస్తాను..కానీ మీరేం చేసినా నేను కాదనను.. నేనేం చేసినా మీరు కాదనకూడదు.. అలా ఒక చిన్న పందెం వేసుకుందామా..?
అనగానే గగన్ సరే అయితే ముందే నేనే అంటూ భూమిని లాగిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకు భూమి కళ్లు బైర్లు కమ్ముతాయి. తర్వాత తేరుకున్న భూమి.. ఇప్పుడు నేను అంటుంది. దీంతో గగన్ అయితే కొడతావా..? కొట్టు అంటాడు. భూమి తాను కొట్టనని ముద్దు పెట్టుకుంటానని గగన్ మీదకు వెళ్తుంది. గగన్ వద్దని అంటుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!