Meghasandesam Serial Today Episode: నువ్వు లేని టైం చూసి వచ్చి ఆ గగన్ గాడు నన్ను చంపబోయాడు అని ఏడుస్తుంది అపూర్వ. నువ్వు వాణ్ణి ఏమైనా చేయాలని చెప్తుంది. సమయానికి ఆ భూమి వచ్చి వాణ్ని కొట్టడంతో వెళ్లిపోయాడు అంటుంది. నువ్వు ఏదైనా చేయాలి బావ అని చెప్పగానే ఇంకా మనం ఏం చేయాలి. ఆ ఇంట్లో ఉన్న మనిషే కొట్టిందంటే ఇంకా వాణ్ని మనం ఏం చేయాలి అంటాడు శరత్‌చంద్ర. నువ్విక ఆ ఆలోచన మానేసి ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్లిపోతాడు శరత్. మరోవైపు దేవుడి దగ్గర కూర్చుని మొక్కుతుంది భూమి.
భూమి: తల్లీ నీకు తెలియంది ఏముంటుంది. నిన్న ఏం జరిగిందో తెలుసు కదా? ఆ రాక్షసి ఏం చేస్తుందోనన్న భయంతో ఆయన్ని బయటకు పంపించాలని చూస్తే ఆయన బయటకు వెళ్లలేదు. అందకే ఆయన్ని కొట్టాల్సి వచ్చింది. అది అర్థం చేసుకోకుండా నాతో మాట్లాడటం మానేశాడు. ఏదో విధంగా ఆయన నాతో మాట్లాడేలా చేయి అమ్మా..
అంటూ మొక్కుతుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్తుంది భూమి.
భూమి: ఏం చేస్తున్నారు ఆంటీ..
శారద: టిఫిన్ చేస్తున్నాను అమ్మా..
భూమి: వద్దు మీరు ఏం చేయోద్దు.. నేను చేస్తాను.. ఆంటీ ఆఫీసుకు టైం అవుతుంది. ఆయన వచ్చేస్తారు. మీరు అలా కూర్చోండి నేను చేస్తాను.
అంటూ భూమి టిఫిన్స్ చేస్తుంది.
పూరి: ఏంటమ్మా ఇన్ని వెరైటీస్ చేశావు. ఎవరైనా బంధువులు వస్తున్నారా?
భూమి: ఆ మీ అన్నయ్యా వస్తున్నారు.
పూరి: ఏంటీ ఈ ఐటమ్స్ అన్ని మా అన్నయ్య కోసమా..? అయితే నేను ఒక పట్టుపట్టేస్తాను.
భూమి: అన్ని తిని పూర్ణిమ పూరిలాగా అయితే డాన్స్ ఎవరు చేస్తారు.
శారద: వాడేమో నిన్ను మల్లె తీగలా చేయాలనుకుంటాడు. నువ్వేమో పొట్లకాయలా అవుతానంటున్నావు. మీ ఇద్దరి మధ్యన నేను తట్టుకోలేకపోతున్నాను.
ఇంతలో అక్కడికి గగన్ వస్తాడు.
పూరి: ఏంటన్నయ్యా.. అమ్మా ఇన్ని రకాల వంటలు చేసిందని చూస్తున్నావా?
అని పూరి చెప్పగానే నేను కాదని భూమి ఇవన్నీ చేసిందని శారద చెప్తుంది. నువ్వు చేసింది ఏమైనా ఉందా అమ్మా అని గగన్ అడగ్గానే అవకాయ తప్ప వేరే లేదని పూరి చెప్తుంది. దీంతో ఆవకాయ తింటాడు గగన్. దీంతో భూమి ఏడుస్తుంది. గగన్ చేయి కడుక్కుని వెళ్లిపోతాడు. వీడికి ఏమైందని శారద ఆలోచిస్తుంది. తర్వాత భూమి, గగన్ కారుకు అడ్డు వెళ్తుంది.
భూమి: ఏంటీ మీరు మాట్లాడరా..? అంత తప్పు ఏం చేశానని.. నాతో మాట్లాడనని ఒట్టు వేసుకున్నారా? నేను మిమ్మల్ని కొట్టాననేగా మీ కోపం అప్పుడు మీరు నన్ను కొట్టండి. అంతే కానీ ఇలా మాట్లాడకుండా ఉండి నన్ను చంపేయకండి. అసలేంటి మీ సమస్య ఏం చేశానని ఈ మౌనవ్రతం. నేను ఎందుకు అలా చేశానని మీరు ఆలోచించరా..?
ఇంతలో శరత్ చంద్ర అక్కడికి వస్తాడు. భూమి దగ్గరకు వెళ్తాడు.
శరత్ చంద్ర: నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అమ్మా.. నా ఇంటి మీదకు ఎవడు పడితే వాడు వస్తే చెంపమీద కొట్టి మరీ చెప్పావంట కదా? అది విని నాకు ఆనందం వేసిందమ్మా.. ఆ ఇంట్లోనే ఉంటున్నా.. అన్యాయం జరిగితే ఊరుకోనని అపూర్వను కాపాడావు చూడు నిజంగా నువ్వు గ్రేట్ రా..
అని శరత్ చంద్ర మాట్లాడుతుంటే గగన్ కోపంతో ఊగిపోతుంటాడు. ఇక వాడితో నీకెందుకమ్మా పద వెళ్దాం అంటూ శరత్ చంద్ర భూమిని తీసుకుని వెళ్తుంటాడు. నేను కొంచెం ఆయనతో మాట్లాడి వస్తాను అని భూమి చెప్పినా వినకుండా బలవంతంగా భూమిని తీసుకుని వెళ్తాడు శరత్ చంద్ర. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!