Meghasandesam Serial Today Episode: అపూర్వను బయటకు పిలిచిన కేపీ కత్తితో అపూర్వను చంపేయబోతాడు. దీంతో అపూర్వ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. విషయం తెలుసుకున్న శరత్ చంద్ర గన్ తీసుకుని అపూర్వను ఫాలో అవుతాడు. కేపీ కత్తితో అపూర్వను చంపడానికి ప్రయత్నిస్తుంటే శరత్ చంద్ర చూసి గన్ తో బెదిరిస్తాడు. అయినా కేపీ వినకపోవడంతో శరత్ చంద్ర నిజంగానే కాలుస్తాడు. బుల్లెట్ తగలడంతో కేపీ అక్కడికక్కడే కింద పడిపోతాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లినా బతకడు. దీంతో కేపీ వాళ్ల అమ్మ శారదకు ఫోన్ చేస్తుంది.
శారద: అత్తయ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది. అయినా ఎప్పుడూ లేనిది అత్తయ్య ఫోన్ చేయడం ఏంటి..?
అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది శారద. వాళ్ల అత్తయ్య ఏడుస్తూ ఫోన్ మాట్లాడుతుంది.
శారద: ఏంటి అత్తయ్య ఏమైంది.. ? ఎప్పుడూ లేనిది మీరు ఫోన్ చేశారేంటి.? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అత్తయ్య..
అత్తయ్య: నీకెలా చెప్పాలి శారద.. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా..?
శారద: ఏంటి అత్తయ్యా అలా మాట్లాడుతున్నారు.. ఏమైంది అత్తయ్యా చెప్పండి..
అత్తయ్య: నా కొడుకు మనల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు అమ్మా..
శారద: ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా..? అసలు ఏం జరిగింది….?
అత్తయ్య: అవునమ్మ శారద.. కేపీ మనకు ఇక లేడమ్మా..?
అంటూ ఏడుస్తుంటే.. శారద కూడా ఏడుస్తూ కూలబడిపోతుంది. శారద ఏడుపు సౌండ్ విని భూమి పరుగెత్తుకుంటూ వస్తుంది. శారద బోరున ఏడ్వడం చూసి షాక్ అవుతుంది. ఇంతలో పూర్ణి, శివ పరుగెత్తుకు వస్తారు.
భూమి: అత్తయ్యా ఎందుకు ఏడుస్తున్నారు..? ఏమైంది అత్తయ్యా చెప్పండి..?
శారద: ఏం చెప్పాలి భూమి… నా నోటితో నేను ఏమని చెప్పను భూమి..
భూమి: అత్తయ్యా ఏం జరిగిందో చెప్పండి అత్తయ్యా..
శారద: మీ మామయ్య మనల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయారు భూమి..
భూమి: అత్తయ్యా ఏం జరిగింది అత్తయ్యా మీరు అలా మాట్లాడకండి
అంటూ భూమి చెప్తుంటే.. లేదమ్మా భూమి ఇప్పుడే అత్తయ్యా ఫోన్ చేశారు అంటూ ఆమె ఫోన్ చేసి చెప్పిన విషయం శారద, భూమికి చెప్తుంది. వెంటనే భూమి కూడా ఉన్న చోటనే కూలబడిపోతుంది. మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో కేపీ శవం ఉంటుంది. శవం దగ్గర మీరా, చెర్రి, బిందు ఏడుస్తుంటారు. అపూర్వ, శరత్ చంద్ర నిలబడి చూస్తుంటారు. ఇంతలో శరత్ చంద్ర తాను కేపీని కాల్చింది గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. మరోవైపు ఇంట్లో శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. శారద ఏడుస్తూ ఉండటం చూసి కంగారు పడతాడు.
గగన్: అమ్మ ఏమైంది అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు.. చెప్పమ్మా..? ( శారద ఏడుస్తూనే ఉంటుంది. పక్కనే కూర్చున్న భూమి ఏడుస్తూనే ఉంటుంది.) ఏయ్ భూమి ఏమైంది ఎందుకు ఇద్దరూ కలిసి ఏడుస్తున్నారు.. చెప్పండి..
అంటూ గగన్ అడిగినా ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక భూమి, శారద ఏడుస్తుంటారు. ఇక లాభం లేదనుకుని గగన్ గట్టిగా అడిగేస్తాడు.
శారద: మీ నాన్న చచ్చిపోయారురా..? ఆయనిక మనకు లేరు నాన్న గగన్..
అంటూ శారద చెప్పగానే గగన్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!