Meghasandesam Serial Today Episode: భూమి ఇచ్చిన బట్టలు వేసుకున్న శరత్ చంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. భూమే మన బిడ్డ అయితే బాగుండు అని శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చెప్తుంటాడు. భూమి మన బిడ్డ ఎందుకు కాకూడదు అంటూ బాధపడుతుంటాడు. అంతా వింటున్న భూమి ఏడుస్తుంది. నిజం చెప్పేస్తానని వెళ్లబోతూ గగన్ ను గుర్తు చేసుకుని ఆగిపోతుంది. ఆయన మీద మీ కోపం పోయేవరకు నేను మీకు నిజం చెప్పను నాన్నా అనుకుని శరత్‌చంద్ర దగ్గరకు వెళ్లి కండువా వేస్తుంది.
శరత్‌చంద్ర: నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అమ్మా..
భూమి: అందరికీ కూడా కనిపిస్తే బాగుంటుంది. పదండి.. పదండి..
బిందు: మామయ్యా అదిరిపోయింది. పంచె కట్టులో భలే ఉన్నారు.
చెర్రి: మామయ్యా మండపంలో మీరిలా తిరుగుతూ ఉంటే కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ మీరే అవుతారు.
శరత్: ఈ క్రెడిట్ అంతా భూమిదే.. తనే నన్ను ఇలా తయారు చేసింది.
బిందు: మామయ్యా మళ్లీ పంచె కడుతారో లేదో అందరం కలిసి షెల్పీ దిగుదాం.. రండి..
శరత్: నక్షత్ర రామ్మా..
భూమి: మీకు మా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి..
శరత్: నేను అలా వెళ్లి మా ఫ్రెండ్స్ కు కనిపించి వస్తానమ్మా వాళ్లు సర్‌ప్రైజ్ అవుతారు.
అని శరత్ వెళ్లిపోగానే నక్షత్ర, భూమిని బయటకు లాక్కెళ్లి కోపంగా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.
భూమి: పెళ్లి పనులు చేస్తున్నాను..
నక్షత్ర: పెళ్లి పనులు అంటే ఇందును రెడీ చేయ్. వచ్చిన వాళ్లకు టీ కాఫీలు అరెంజ్ చేయ్. అంతేకానీ మా డాడీని నువ్వు రెడీ చేయడమేంటి?
భూమి: తండ్రి లాంటి వారు కాబట్టి చేశాను అందులో తప్పేముంది.
నక్షత్ర: మా డాడీకి ఏం కావాలన్నా చేయడానికి నేనున్నాను. నన్ను కూడా ఏమీ చేయనివ్వకుండా నువ్వు అడ్డుపడతావేంటి? ఇక్కడ డాడీకి నాకు అడ్డుపడుతున్నావు. మా బావ ఇంటికి వెళ్తే అక్కడ అడ్డుపడుతున్నావు. ఏంటీ విషయం. కొంపదీసి నువ్వు కానీ లవ్ చేస్తున్నావా? ఏంటి?
భూమి: అనుమానం రాకూడని వాళ్లకే అనుమానం వచ్చిందేంటి? ఈ నక్షత్రకు చెప్తే ఇంకేమన్నా ఉందా? ( అని మనసులో అనుకుంటుంది.)
నక్షత్ర: ఏంటి ఆలోచిస్తున్నావు
అని నక్షత్ర అడగ్గానే నేను అడ్డు పడుతుంది నీ కోసమే అని భూమి చెప్తుంది. మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. అది మర్చిపోయి ఆ ఇంటి చుట్టు తిరిగితే మీ అమ్మా ఊరుకుంటుందా? నా మాట విని నీ ప్రేమని నీ మనసులోంచి తీసేయ్ అని చెప్పగానే నా ప్రేమను తీసేయ్ అని చెప్పడానికి నువ్వెవరు అంటూ తిడుతుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే మా బావ ఎగిరి గంతేస్తాడు అని చెప్తుంది. అయితే ఇప్పుడే తెలుసుకుందాం అని నక్షత్ర ఫోన్ తీసుకని గగన్‌కు కాల్ చేస్తుంది భూమి. నక్షత్ర మిమ్మల్ని ప్రేమిస్తుందట అని చెప్పగానే గగన్ పిచ్చతిట్టుడు తిడతాడు. ముక్కు చెవులు కోసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.
భూమి: అదీ విషయం.. ప్రేమిస్తుందేమో అంటేనే ముక్కు చెవులు మాత్రమే కాదు తాట కూడా తీస్తారట. నిజంగా ప్రేమిస్తున్నావని తెలిస్తే ఇక అంతే.. దీన్ని బట్టి పరిస్థితి ఏంటనేది నీకు అర్థం అయి ఉంటుందిగా.. వస్తాను చాలా పనులు ఉన్నాయి.
నక్షత్ర: దాన్నేమో ఏమీ అనలేదు. మరదలు అనగానే అన్ని మాటలు అనేశాడు. నిజంగానే నా లవ్వు కాదంటాడా?
అని మనసులో అనుకుంటుంది. మరోవైపు శారదను తీసుకుని ఇంటికి వచ్చిన ప్రసాద్ లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే నిలబడతాడు. శారద లోపలికి రమ్మని పిలుస్తుంది. నాకు రావాలని ఉన్నా వాడు నన్ను రానివ్వడు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు గుడి నుంచి ఇంటికి వచ్చిన మీరా ఏడుస్తూ ప్రసాద్ వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇందును తీసుకెళ్లి ఆ శారదతో ఆశీర్వాదం ఇప్పిస్తున్నాడు అని అపూర్వ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరును బంధించిన ఘోర