Jagadhatri Serial Today Episode: లోపల మీనన్, టోనీ బంధువులతో మాట్లాడుతుంటారు. ధాత్రి, కేదార్‌లను అభి లోపలికి తీసుకెళ్తాడు. సేఫ్ ఫేస్ లోకి వెళ్లిన ధాత్రి, కేదార్, అభి తాము ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆరాధ్యను ఎక్కడ దాచి ఉంటారని ఆలోచిస్తారు. జేడీ ఫామ్ హౌస్ బ్లూ ప్రింట్ వేస్తుంది. ఆరాధ్యను పార్కింగ్ ప్లేస్ లో దాచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంది. ధాత్రి. అభిని పార్కింగ్ దగ్గరకు వెళ్లి కార్లన్నీ చెక్ చేయమని చెప్తుంది.
ధాత్రి: ఖదీర్ మీనన్ తమ్ముడు ఎక్కడున్నాడు.
ఖదీర్: రండి మేడం చూపిస్తాను.. అదిగోండి మీనన్ తమ్ముడు అతనే
కేదార్: ఈ టోనీ మీనన్ తమ్ముడా..?
ధాత్రి: అంటే మత్తు పదార్థాలు పంపిచింది యువరాజ్ జిమ్ముకేనా..? యువరాజ్ ఇదంతా తెలిసే చేశాడన్నమాట. అయితే వీళ్లందరి లెక్కలు సరి చేయాలి కేడీ.
రౌడీ: ఏయ్ ఇక్కడేంటి.. ఇక్కడేం చేస్తున్నారు మీరు. రేయ్ వీళ్లతో నీకు మాటలేంటి? అక్కడ భాయ్ ని చూపించి ఏం చెప్తున్నావు.
ధాత్రి: సార్ ఏ తప్పు చేసినా క్షమించరని వచ్చిన వాళ్లందరూ చాలా పెద్దవాళ్లు ఓళ్లు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్తున్నారు.
కేదార్: నిద్ర లేచినప్పటి నుంచి ఇదే పని మీద ఉంటాము. ఎవరికీ ఏ సమస్య రాకుండా చూసుకుంటామని చెప్తున్నాము అయ్యా..
రౌడీ: ఇక్కడి నుంచి వెళ్లండి. వెళ్లి భాయ్ వాళ్ల చుట్టాలకు ఏం కావాలో చూడండి.
ధాత్రి: అలగేనయ్యా..
రౌడీ: రేయ్ వాళ్లతో నీకేంటిరా మాటలు. ఇక్కడి నుంచి వెళ్లిపో..
ధాత్రి, కేదార్ పక్కకు వెళ్లిపోతారు. ఇంతలో హలో అనుకుంటూ మీనన్ వస్తాడు. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అంటాడు. నన్నా నన్ను ఎక్కడ చూసి ఉంటారు సార్ అని అడుగుతుంది. టోని వచ్చి అక్కడ అతిథులకు ఏం కావాలో చూడండి అని చెప్పగానే ధాత్రి, కేదార్ వెళ్లబోతుంటే ఒకసారి నీ మాస్క్ తీయ్ నీ ముఖం చూడాలి అంటాడు. దీంతో ధాత్రి.. తనకు దగ్గు జలుబు ఉందని చెప్పగానే అయినా పర్వాలేదు తీయ్ అంటాడు మీనన్. ధాత్రి అలాగే ఉండిపోతుంది. మీనన్ మాస్క్ తీయబోతుంటే అభి పరుగెత్తుకొచ్చి భాయ్ అక్కడెవరో అనుమానంగా ఉన్నారు. జేడీ కావొచ్చు అని చెప్తాడు. దీంతో మీనన్, టోని వెళ్లిపోతారు. మరోవైపు ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు సైలెంట్ గా ఉంటారు.
బూచి: కాచి ఇల్లంతా ఎందుకో బోసి పోయినట్లు అనిపిస్తుంది.
కాచి: కదా ఒక కొట్లాట లేదు. ఒక గొడవ లేదు.
బూచి: ఆఫీసు గొడవ అయినప్పటి నుంచి నిషిక కూడా చాలా సైలెంట్ అయిపోయింది కదా? పద ఒక నిప్పు అంటింద్దాం. ( నిషిక దగ్గరకు వెళ్తారు) హలో పెత్తనం కావాలి. కుర్చీ కావాలి అని అందని దానికి పోయి ఇంట్లో ఉన్న మర్యాదనంతా పొగొట్టుకున్నావు.
కాచి: ఇప్పుడు చూడండి. మన కళ్లముందే మనకు అన్యాయం జరుగుతున్నా..? మనల్ని వాళ్లు డైరెక్టుగా మోసం చేస్తున్నా ఏమీ చేయలేం. ఏమీ అనలేం.
వైజయంతి: మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు రవ్వంత కూడా అర్థం కావడం లేదు.
నిషిక: వదిన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారు అత్తయ్యా
బూచి: అబ్బా ఏం క్రిమినల్ బ్రెయిన్ సిస్టర్ నీది.. ఇట్టా చెప్పగానే అట్టా పట్టేశావు.
వైజయంతి: ఈ గొడవల్లో పడి అసలు విషయం మర్చిపోయాము అమ్మీ. కౌషికికి గర్భం ఇంకా అలాగే ఉందన్న అనుమానం ఇంకా తీరనే లేదు కదూ
నిషిక: నేను ఏదీ మర్చిపోలేదు అత్తయ్య. జగధాత్రి పక్కన లేనప్పుడు తేల్చుకుందామనుకున్నాను.
బూచి: అమ్మ దొంగ ముఖం దానా.. మౌనంగా ఉంటే మాట పడ్డావు కదా అలా ఉన్నావు అనుకున్నాను
అని అనడంతో అందరూ కోపంగా చూస్తుంటారు. ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు బూచి. నువ్వు మనసులో అనుకోవాల్సిన దాన్ని బయటకు అన్నావని కాచి చెప్పగానే బూచి షాక్ అవుతారు. తర్వాత కౌషికి కడుపు పోగొట్టేందుకు బొప్పాయి ఆకుల జ్యూస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. వైజయంతి తీసుకెళ్లి ఆ జ్యూస్ ఇస్తుంది. కౌషికి జ్యూస్ తాగుతుంటే కీర్తి చేతిలో బాల్ వచ్చి తగలడంతో జ్యూస్ కిందపడిపోతుంది. మరోవైపు ధాత్రి వాళ్లు ఎంత వెతికినా ఆరాధ్య అచూకీ లభించదు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను ఒప్పించిన రాజ్ – నిజం తెలుసుకున్న రుద్రాణి