Meghasandesam Serial Today Episode: కేపీని స్టేషన్ తీసుకెళ్లగానే.. మీరా ఏడుస్తుంది. ఎలాగైనా కేపీని చూడాలని అనుకుంటుంది. వెంటనే పోలీస్ స్టేసన్‌కు బయలుదేరుతుంది. మరోవైపు శారద కూడా విషయం తెలుసుకుంటుంది. ఆగలేక వెంటనే శారద కూడా పోలీస్ స్టేసన్‌కు బయలుదేరుతుంది. దీంతో ఇద్దరూ శారద, మీరా ఒకరికి తెలియకుండా ఒకరు స్టేషన్‌కు వెళ్తారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. శారదను చూసిన మీరా కోపంగా లోపలికి వెళ్తుంది.
మీరా: సార్ మా ఆయనను ఇక్కడికి తీసుకొచ్చారు..? ఎక్కడున్నారు..?
కానిస్టేబుల్: మీ ఆయన అంటే ఎవరు మేడం..
మీరా: అదే శరత్ చంద్ర ఇంటి దగ్గర నుంచి ఏసీపీ సూర్య గారు తీసుకొచ్చారు కదా ఆయన..
కానిస్టేబుల్: ఏసీపీ సూర్య సార్ చాలా మందిని తీసుకొస్తుంటారు మేడం ఆయన అంటే ఎవరు ఆయన పేరు చెప్పండి మేడం..
ఇంతలో శారద లోపలికి వస్తుంది.
శారద: ఆయన పేరు కృష్ణ ప్రసాద్..
అంటూ చెప్పగానే..
కానిస్టేబుల్: ఓ ఆయనా అదే ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి కదా మా ఎస్సై గారిని దారుణంగా చంపిన వ్యక్తి కదా.. పదండి తీసుకెళ్తాను.
అంటూ శారద, మీరాను కానిస్టేబుల్ కేపీ ఉన్న సెల్ దగ్గరకు తీసుకెళ్తాడు.
కానిస్టేబుల్: అదిగో ఇలా వెళ్లండి అమ్మ ఆక్కడే ఉన్నారు చూడండి..
అని చెప్పగానే మీరా, శారద లోపలికి వెళ్తారు. గాయాలతో ఉన్న కేపీని చూసి ఏడుస్తుంటారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న కేపీ ఇద్దరినీ చూసి బాధపడుతుంటాడు.
మీరా: అయ్యో ఏవండి.. ఎంటండి మీరు ఇలా అయిపోయారు.. అసలు ఎందుకు మిమ్మల్ని ఇంతలా కొట్టారు.
శారద: అసలు మీరే తప్పు చేయడం ఏంటండి.. అయినా ఎవరో కావాలని మిమ్మల్ని ఇరికించారు.
మీరా: ఏవండి పలకండి.. ఇంతలా కొట్టారేంటండి.. పలకండి..
అంటూ ఇద్దరూ పిలిచినా కేపీ పలకడు. దీంతో మీరా, శారద బోరున ఏడుస్తుంటారు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి మేడం మీ టైం అయిపోయింది మీరు బయటకు రండి అని పిలుస్తాడు. దీంతో శారద, మీరా ఏడుస్తూనే అక్కడి నుంచి బయటకు వస్తారు.
మీరా: ఈ పరిస్థితుల్లో ఆయన్ని రక్షించాలంటే ఒక్క గగన్ వల్లే అవుతుంది. ఇప్పుడు గగన్ బెయిల్ ఇస్తే ఆయన బయటకు వస్తారు. లేదంటే పోలీసులు ఆయన్ని చంపేసేలా ఉన్నారు
శారద: కానీ గగన్ ఒప్పుకుంటాడో లేదో
అంటూ శారద అనుమానంగా అంటుంది.
మీరా: మీరు ప్రయత్నించి చూడండి..
ఇంతలో చెర్రి వస్తాడు.
చెర్రి: అవును పెద్దమ్మ మనం వెళ్లి అన్నయ్యను అడుగుదాం.. ఎలాగైనా అన్నయ్యను ఒప్పించి నాన్నకు బెయిల్ వచ్చేలా చేద్దాం
అనగానే శారద సరే పదా అంటుంది. చెర్రి, శారద, భూమి ముగ్గురు కలిసి గగన్ దగ్గరకు వెళ్తారు. ముగ్గురిని చూసిన గగన్ ఆశ్చర్యపోతాడు.
గగన్: ఏంటి సంగతి ముగ్గురూ ఒకేసారి వచ్చారు.
శారద: నాన్న గగన్ నీకో విషయం చెప్తాను. కోప్పడవుగా..?
గగన్: ఏంటో చెప్పమ్మా… నీ మీద నేనేందుకు కోప్పడతాను చెప్పు..
శారద: ఇప్పుడు మనమే ఆయన్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలి నాన్న..
అంటూ శారద చెప్పగానే.. గగన్ కోపంగా చూస్తుంటాడు. దీంతో శారద నువ్వు కాదనకు గగన్. ఇప్పుడున్న ఈ పరిస్తితుల్లో ఆయనకు మనం తప్ప ఎవరున్నారు చెప్పు అంటూ ఎమోషనల్ అవుతుంది శారద. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!