Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ తన మనసులో మాట ధీరజ్‌కి అర్థమవ్వాలని ధీరజ్‌కి ప్రేమ, ధీరజ్‌ ఫొటోలు ఉన్న లాకెట్ ఇవ్వాలని అనుకుంటుంది. ధీరజ్ దగ్గరకు వెళ్లి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటో త్వరగా చెప్పు అని ధీరజ్ అడిగితే ప్రేమ ధీరజ్ చేతికి లాకెట్‌ ఉన్న చైన్ చుట్టి చూడమని అంటుంది.

Continues below advertisement

ధీరజ్ అప్పుడే చూడటానికి లాకెట్ ఓపెన్ చేస్తుంటే ఇప్పుడొడ్డు 11:11కి చూడు అని అప్పుడైతే సక్సెస్ అవుతుంది అని అంటుంది. సరే అని ధీరజ్ తలూపుతాడు. టైం అయిందని ధీరజ్ తెరిచి చూస్తున్న టైంకి కాస్త దూరంలో అమూల్య వెంట విశ్వ పడుతూ చేయి పట్టుకొని వెంట పడటం ధీరజ్ చూసి అక్కడికి పరుగున వెళ్లి విశ్వని కొడతాడు. ప్రేమ ఆపాలని చూస్తుంది. మాట్లాడుతున్నా కదరా అనతో అని విశ్వ అంటాడు. చందు కూడా వచ్చి విశ్వని కొడతాడు. చంపేస్తారా నిన్ను అనుకుంటూ ధీరజ్ వస్తే ప్రేమ ఆపి రక్తం వచ్చేచా కొడుతున్నావ్.. చంపేస్తావా.. మనిషివా రాక్షసుడివా అని అంటుంది. నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా అని ధీరజ్ అంటాడు. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇదేంట్రా అని ప్రేమ కేకలేస్తుంది.

ధీరజ్ కోపంగా వాడు తప్పు చేసిన వెనకేసుకొస్తున్నావ్ అంటే మీ అన్నయ్య మీద ప్రేమ ఉంది.. దీంతో నీ అసలు రంగు బయట పడింది.. మీ వాళ్ల మీద కోపం చూపిస్తున్నా నువ్వు ఒకప్పటి ప్రేమవే.. మీ వాళ్లు తప్పు చేసినా వెనకేసుకొచ్చే ప్రేమవే.. ఈ గొడవలు అన్నింటికీ నువ్వే కారణ.. నిన్ను పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రేమ ఇచ్చిన లాకెట్ విసిరి కొట్టి వెళ్లిపోతాడు. ప్రేమ ధీరజ్ మాటలకు కింద కూలబడి ఏడుస్తుంది.

Continues below advertisement

రామరాజు ఆవేశంగా ఇంటికి వచ్చేస్తాడు. వేదవతి, తిరుపతి, శ్రీవల్లి వెనాకలే వస్తారు. కాస్త పెట్రోల్ వేస్తే నర్మద పుట్టింటికి వెళ్లిపోవడం ఖాయం అని అనుకుంటుంది. వేదవతి వెళ్లి మజ్జిగ కావాలా అంటే రామరాజు అరుస్తాడు. తిరుపతి మాట్లాడాలని చూస్తే రెండు చెంపలు వాయించేస్తాడు. వల్లీ పుల్లలు పెట్టడం మొదలెడుతుంది. మీరు ఒక్కో మెట్టు ఎక్కి పేరు తెచ్చుకుంటే అంతా మీకు నర్మద వల్లే పేరు వచ్చిందని వాళ్ల నాన్న అంటున్నాడు. ఊరి అందరి ముందు మీ తల తీసేసినట్లు అయిపోయింది.. మిమల్ని ఎందుకు పనికిరాని రబ్బరు స్టాంప్ అనేశారు.. అందరి ముందు మిమల్ని దారుణంగా అవమానించి సాగర్‌ని ఇల్లరికం పంపేయమని అంటారా.. ఈ ఇంట్లో నర్మదని అందరూ ఎంత ప్రేమగా చూసుకుంటే అలా అంటారా.. ఆయన ఉద్దేశం మీరు కోడల్ని రాసి రంపాన పెడుతున్నారు అనే కదా అర్థం అని అంటుంది.

రామరాజు చేతి సైగతో వల్లిని ఆపి రేపు పొద్దున్నకి మీ అమ్మానాన్న నా ముందు ఉండాలి.. వాళ్ల గురించి కొన్ని విషయాలు తెలిశాయి అని రామరాజు అంటాడు. నర్మదని ఇరికించాలని నేనే ఇరుక్కున్నా అని వల్లీ తలబాదుకుంటుంది.

నర్మద సాగర్‌తో ఎందుకు మా ఇంటికి వెళ్లావ్.. నువ్వు వెళ్లకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా.. మామయ్య గారు బాధ పడేవాళ్లు కాదు కదా అని అంటుంది. నువ్వు మా గురించి ఆలోచించినట్లే నేను నీ గురించి ఆలోచించాలి కదా అని సాగర్ అంటాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్లిన తర్వాత ఎంత గొడవ జరుగుతుందో అని నర్మద అంటే నేనేం తప్పు చేయలేదు నేను చూసుకుంటాలే అని సాగర్ అంటాడు. నర్మద భర్తని హగ్ చేసుకొని ఏడుస్తుంది.

నా కొడుకుని కొడతాడా అనుకుంటూ సేన కత్తి పట్టుకొని వచ్చి ధీరజ్‌ని చంపేస్తా అంటాడు. వద్దు అని విశ్వ ఆపుతాడు. నిన్ను వాడు కొడితే వదిలేయమంటావ్ ఏంట్రా నీలో భయం పుట్టిందా.. పౌరుషం చచ్చిపోయిందా నీలాంటి కొడుకుని కన్నానా అని తిట్టి సేన వెళ్లిపోతాడు. నువ్వు  ఇంత కూల్‌గా ఉండిపోవడం వెనక అర్థమేంట్రా అని భద్రావతి అడిగితే ప్రేమ, ధీరజ్ దూరం అవ్వబోతున్నారు. ఎప్పుడూ ధీరజ్‌ని సపోర్ట్ చేసినన్ను తిట్టే ప్రేమ ఇప్పుడు ఈ అన్నని సపోర్ట్ చేసింది. అమూల్యని అడ్డు పెట్టుకొని మనం చేయాలి అనుకున్న డ్రామా కరెక్ట్ మీటర్‌లో ఉంది అత్త అని చెప్తాడు. ప్రేమ ధీరజ్ మధ్య గొడవని సానుభూతిగా వాడుకుంటా.. అమూల్యని నా దారిలోకి వచ్చేలా చేస్తాను.. ప్రేమ, ధీరజ్ విడిపోయేలా చేస్తా అని విశ్వ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.