Meghasandesam Serial Today Episode: భూమికి ఏసీపీ సూర్య ఫోన్ చేస్తాడు. రూంలో ఉన్న భూమి ఏసీపీ ఫోన్ చూసి ఇప్పుడు చేస్తున్నారేంటి..? ఏదైనా క్లూ దొరికిందా..? అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి.
భూమి: నమస్తే ఎసీపీ గారు..? ఏంటి ఈ టైంలో కాల్ చేశారు. మీ అన్నయ్య మర్డర్ కేసులో ఏదైనా సాక్ష్యం దొరికిందా..? చెప్పండి
సూర్య: అదే కాదండి.. మా అన్నయ్యను మర్డర్ చేయించిన వాళ్లు.. మీ అమ్మను మర్డర్ చేసిన వాళ్లు ఒక్కరే వాళ్లను పట్టుకున్నాము. ఒక ప్లాన్ ప్రకారం స్కేచ్ వేసి పట్టుకున్నాము. మీరు వెంటనే వస్తే చూడొచ్చు.. మేము ఇంటరాగేషన్ చేస్తున్నాము. మర్డర్ చేశానని ఒప్పుకోవడం లేదు. తెల్లారేసరికి ఎలాగైనా నిజం ఒప్పిస్తాము..
భూమి: థాంక్యూ సార్ చాలా మంచి న్యూస్ చెప్పారు. నేను ఇప్పుడే ఆ మర్డర్ చేసిన వ్యక్తిని చూడాలి. నేను ఇప్పుడే వస్తున్నాను.. మీరు ఎక్కడున్నారో లోకేషన్ షేర్ చేయండి సార్.
సూర్య: ఆ భూమి గారు మీకు లోకేషన్ షేర్ చేస్తాను. కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు.. అలాగే లోకేషన్ కూడా ఎవ్వరికీ షేర్ చేయ్యోద్దు. చాలా కాన్పిడెంన్షియల్ మ్యాటర్.. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
భూమి: అయ్యో సార్ నేనెందుకు చెప్తానండి.. అసలు ఎవ్వరికీ చెప్పను ఇంకా చెప్పాలంటే.. మా ఇంట్లో వాళ్లకు కనీసం మా బావకు కూడా చెప్పకుండా వస్తాను. మీరేం వర్రీ కావొద్దు సార్..
సూర్య: ఓకే మీకు ఇప్పుడే లోకేషన్ షేర్ చేస్తున్నాను
అని సూర్య చెప్పగానే.. సరే అంటూ భూమి బయలుదేరుతుంది. ఇంతలో శారద వస్తుంది. భూమి బయటకు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో భూమి శారదకు నిజం చెప్పకూడదని ఏదో అబద్దం చెప్తుంది. అయితే భూమిలో కంగారు చూసిన శారద అనుమానిస్తుంది.
శారద: భూమి నేను నీ అత్తయ్యను ఎందుకు కంగారు పడుతున్నావు. అయినా నువ్వేదో టెన్షన్‌లో ఉన్నావని అర్థం అవుతుంది. ఏంటో చెప్పమ్మా..?
భూమి: ఏం లేదు అత్తయ్యా.. చిన్న పని ఉంది డాన్స్ స్కూల్ దాకా వెళ్లొస్తాను.. అంతే..
శారద: డాన్స్ స్కూల్ లేదని గగన్ చెప్పాడు. ఇవాళ హాలిడే అన్నాడు కదమ్మా.. నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు భూమి..
భూమి: అత్తయ్య అదేం లేదు.. నేను చెప్తున్నాను కదా..? వెళ్లొచ్చాక అంతా చెప్తాను. ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అత్తయ్యా
అంటూ భూమి చెప్పగానే.. సరే భూమి కానీ జాగ్రత్త అంటూ శారద చెప్పగానే.. భూమి పరుగు పరుగున సూర్య దగ్గరకు వెళ్లిపోతుంది. స్టేషన్‌లోకి వెళ్లి సూర్య గురించి అడగ్గానే కానిస్టేబుల్ సెల్‌లో ఉన్న సూర్య దగ్గరకు తీసుకెళ్తుంది. భూమిని చూసిన సూర్య కోపంగా మాట్లాడతాడు.
సూర్య: మా అన్నయ్యను మీ అమ్మను చంపిన క్రిమినల్ ఎవరో తెలుసా..? ఇదిగో వీడే..
అంటూ సూర్య కోపంగా కుర్చిలో కట్టేసిన కేపీని తల పైకెత్తి చూపిస్తాడు. కేపీని చూడగానే భూమి షాక్ అవుతుంది. ఒళ్లంతా దెబ్బలతో కేపీ మూలుగుతుంటాడు. భూమి ఏడుస్తూ కేపీ కాళ్ల దగ్గర కూర్చుంటుంది.
భూమి: మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేసి నేను మిమ్మల్ని విడిపించుకుంటాను. విడిపించుకుంటాను.
అంటూ భూమి ఏడుస్తూ చెప్తుంది. కేపీ కూడా ఏడుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!