Brahmamudi Serial Today Episode:  ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న కావ్యను మూర్తి ఓదారుస్తాడు. తాను చేస్తున్న పోరాటంలో తప్పే లేదని అండగా నిలబడతాడు.

Continues below advertisement

కావ్య: కానీ నా యుద్దమే నా భర్తతో చేయాల్సి వస్తుంది నాన్న

మూర్తి: మనలో తప్పు లేనప్పుడు ఆ దేవుడితోనైనా యుద్దం చేయోచ్చని ఆ దేవుడే మనకు వరం ఇచ్చాడమ్మా నువ్వు చేస్తున్న పోరాటంలో తప్పేం లేదమ్మా

Continues below advertisement

కావ్య: అయితే నేను లేకుండా మాత్రం ఆయన ఉండలేరు నాన్న ఆయన మనసులో నాకు అంత స్థానం ఇచ్చారు. ఆయన నా కోసమైనా వస్తారు.. కనీసం కారణం అయినా చెప్తారు..

మూర్తి: నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరుగుతుంది. నీ సంకల్పం ఎప్పటికీ ఓడిపోదు.. ఇప్పటికే చాలా పొద్దు పోయింది. వెళ్లి పడుకో తల్లి

అని మూర్తి వెళ్లిపోతాడు. కావ్య ఒంటరిగానే కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటుంది. మరోవైపు రాజ్‌ కూడా బెడ్‌ రూంలో ఒక్కడే కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటుంటాడు.

రాజ్‌: నన్ను నమ్మి నా దారికి రావొచ్చు కదా కళావతి

కావ్య: నా ప్రాణం అడిగినా ఇస్తాను కానీ నా బిడ్డ ప్రాణాన్ని వదులుకోలేను.

రాజ్: కానీ నాకు నీ ప్రాణమే ముఖ్యం నిన్ను నేను వదులుకోలేను.

కావ్య: కోపంతో గొడవలు పడి విడిపోయేవాళ్లను చూశాను. కానీ ఇలా ప్రేమిస్తూ విడిపోయేవాళ్లు కూడా ఉంటారా..?

రాజ్‌: ప్రేమించాను కాబట్టే కాపాడుకోవాలి అనుకుంటున్నాను..

కావ్య: మీకు దూరంగా నేను ఉండలేనండి

రాజ్: నేనూ ఉండలేను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను.. తిరిగి కలుస్తాను..

కావ్య: మన బిడ్డతో తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను. మన బిడ్డను కళ్లారా చూసైనా మీ మనసు మారుతుందని ఆశపడుతున్నాను

ఇలా ఎవరికి వారు మనసులో అనుకుంటుంటారు. తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా రాజ్‌ వస్తాడు.

రాజ్‌: ఏంటి అందరూ సోఫాలో మీటింగ్‌ పెట్టారు టైం అవుతుంది ఎవ్వరూ టిఫిన్‌ చేయరా..?

సుభాష్‌: మేము ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము

ఇందిరాదేవి తేన్పుతుంది.

రాజ్‌:  మరి ఆ తేన్పులేంటి..? అందరూ పుల్లుగా తినేసినట్టు అలా వస్తున్నాయి.

అపర్ణ: అవి తినడం వల్ల వచ్చిన తేన్పులు కాదు.. తినకపోవడం వల్ల వచ్చిన తేన్పులు

రాజ్: ఏంటి ఈ మధ్య అలా కూడా వస్తున్నాయా..?

ప్రకాష్‌: ఈ మధ్య కొత్తగా స్టార్ట్‌ అయ్యాయిలేరా

 అంటూ ప్రకాష్‌ కూడా తేన్పుతాడు. అందరూ నవ్వుకుంటారు.

ఇందిరాదేవి: చూశారా..? చూశారా వాడికి కూడా వచ్చాయి ఆకలి తేన్పులు..

ప్రకాష్‌: అవును ఆకలి తేన్పులు..

రాజ్‌: ఇంతకీ ఈ దీక్షలు ఎందుకో..

ధాన్యం: ఎందుకేంటి రాజ్‌ మా దీక్ష కావ్య కోసమే

రాజ్: అయితే మీరు ఇలాగే దీక్షలు చేసుకోండి నాకు మాత్రం ఆకలిగా ఉంది.. నేను వెళ్లి టిఫిన్‌ చేస్తాను

అని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్తాడు. ఎలాగైనా రాజ్‌ ను ఇరిటేట్‌ చేసి కావ్యను తీసుకొచ్చేలా చేయాలనుకుంటారు. అలాగే అందరూ డైనింగ్‌ టుబుల్‌ దగ్గరకు వెళ్లి రాజ్ కు ఇరిటేట్‌ వచ్చేలా మాట్లాడతారు. దీంతో రాజ్ టిపిన్‌ చేయకుండా వెళ్లిపోతాడు. అంతా పై నుంచి గమనించిన రుద్రాణి చెప్తా మీ పని అనుకుని మీడియాకు ఫోన్‌ చేస్తుంది. మీడియా వాళ్లు మొత్తం కావ్య ఇంటికి వెళ్తారు. దీంతో కావ్య గురించి దుగ్గిరాల ఫ్యామిలీ గురించి రాజ్‌ గురించి మీడియాలో వస్తుంది. అది చూసిన రుద్రాణి కావ్యను తిడుతుంది. ఇంటి పరువు మొత్తం తీసేసిందని రేపటి నుంచి మనం ఎలా తల ఎత్తుకుని బతకాలి అంటూ రాజ్‌ను హేళన చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!