Meghasandesam Serial Today Episode: శారదను చంపాలనుకున్న రౌడీని గగన్‌ పట్టుకుని ఎవరు మా అమ్మను చంపాలనుకున్నది చెప్పు అంటూ కొడుతుంటాడు. గగన్‌ దెబ్బలకు తాళలేని రౌడీని నిజం చెప్తాను అంటాడు. చెప్పమని గగన్‌ అడుగుతుంటాడు.

Continues below advertisement

రౌడీ: ఆ అపూర్వనే చంపమని చెప్పింది.

అని చెప్పగానే గగన్‌ షాక్‌ అవుతాడు.

Continues below advertisement

గగన్‌: అరేయ్‌ ఎందుకు చంపమంది చెప్పరా..? చెప్పు..

రౌడీ: చెప్తాను.. చెప్తాను..

అంటూ గగన్‌ను తోసేసి పారిపోతాడు రౌడీ.. గగన్‌ వెనకాలే పరుగెడుతుంటాడు. వాళ్ల వెనకే భూమి కూడా పరుగెడుతుంది. కొంత దూరం వెళ్లాక గగన్‌ రౌడీని మళ్లీ పట్టుకుని రేయ్‌ చెప్పరా..? అంటూ కొడుతుంటాడు. రౌడీ మళ్లీ గగన్‌ నుంచి తప్పించుకుని రోడ్డు మీద పారిపోతుంటే.. ఎదురుగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే రౌడీ చనిపోతాడు. గగన్‌, భూమి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

భూమి: బావ నా మాట విను బావ.. వద్దు బావ.. ఆవేశపడొద్దు బావ.. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు.. మనం ఒక పని చేద్దాం.. మనం అర్జెంట్‌గా వెళ్లి ఎస్పీ సూర్యను కలుద్దాం.. బావ. అత్తయ్యను చంపబోయింది అపూర్వనే అని కంప్లైంట్‌ ఇద్దాం బావ.

గగన్‌: చెప్తే ఏం చేస్తాడు ఆ సూర్య

భూమి: కంప్లైంట్‌ బుక్‌ చేసుకుని అపూర్వను అరెస్ట్‌ చేస్తాడు.

గగన్‌: అప్పుడు అపూర్వ లాయర్‌ వచ్చి బెయిల్‌ ఇచ్చి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అపూర్వ, కోర్టుకు ఇంటికి తిరుగుతూనే ఉంటుంది. మా అమ్మను చంపాలనుకున్న వాడు చచ్చాడు కనక సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కూడా కేసు కొట్టేస్తుంది. అప్పుడు కోర్టు నుంచి బయటకు వచ్చిన అపూర్వ ఒక వ్యగ్యంగా నవ్వుతుంది చూడు ఆ నవ్వును చూస్తూ బతకడం నావల్ల కాదు..

భూమి: బావా..?

గగన్: అందుకే చట్టాన్ని న్యాయాన్ని నా చేతుల్లోకి తీసుకుని ఇవాళ తీర్పు ఇవ్వాలనుకుంటున్నాను. మా అమ్మను చంపాలనుకున్న ఆ అపూర్వను నా చేతులతోనే చంపేస్తాను.. తప్పుకో..

భూమి: బావ బావ వద్దు బావ.. ఆవేశం వద్దు బావ.. ఆవేశ పడకు బావ.. ఆవేశంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు బావ. అప్పుడే అనర్థాలు వస్తాయి బావ. ఫ్లీజ్‌ బావ నీకు దండం పెడతాను..

గగన్: నాకేమైనా పర్వాలేదు భూమి. కానీ అది మా అమ్మను టచ్‌ చేసింది. ఈరోజు వదిలితే తిరిగి మా అమ్మ ప్రాణం దగ్గరకే వచ్చేస్తుంది. అదే దాన్ని చంపేస్తే..? మా అమ్మ ప్రాణాలకు ఒక భరోసా వచ్చేస్తుంది.

భూమి: అయ్యో బావ నా మాట విను బావ. భరోసా దొరకని ప్రాణంతో నిన్న అత్తయ్య జైల్లో చూడలేదు బావ. అపూర్వ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం మనం వేరే దారి ఎంచుకుందా బావ.. ప్రతీకారం అంటూ వెళ్లే ఈ దారి కరెక్టు కాదు బావ.

గగన్‌: భూమి మాటలు మనఃశాంతి ఇవ్వవు.. కేవలం చేతలు మాత్రమే చరిత్రలో చేరతాయి. తప్పుకో..

అంటూ గగన్‌ కారేసుకుని వెళ్లిపోతాడు. భూమి భయంతో బావ.. అయ్యో బావ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి.. అపూర్వను చంపేస్తాడేమో..? అని భయపడుతుంది. వెంటనే అపూర్వకు ఫోన్‌ చేసి గగన్‌ నిన్ను చంపడానికి వస్తున్నాడని.. రౌడీ చెప్పిన విషయం చెప్పగానే.. అపూర్వ భయపడుతుంది. ఇంతలో గగన్‌ అపూర్వ ఇంటికి వెళ్లి అపూర్వను చంపడానికి గన్‌ తీసి ఎయిమ్‌ చేస్తాడు. అపూర్వ వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!