Chinni Serial Today Episode మధు మ్యాడీతో మీ నాన్నని పార్క్‌లో కలిశాను.. నన్ను ఇంటికి తీసుకెళ్లి టిఫెన్ పెట్టి ప్రేమతో మాట్లాడారు అని నీతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు అని మధు చెప్తుంది. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. సంతోషంలో మ్యాడీ మధుని హగ్ చేసుకుంటాడు.
మ్యాడీ, చందు, వరుణ్ క్రికెట్ ఆడుతారు. మ్యాడీ చిన్ని ఆలోచనలో పడి ఆటలో అవుట్ అయిపోతాడు. మధు చూసి మ్యాడీని ఆటపట్టిద్దాం అని కాల్ చేస్తుంది. అభిమానిని అని మాట్లాడుతుంది. ఇలా ఇంకెప్పుడు కాల్ చేయకు అని మ్యాడీ అంటాడు. ఇక మధు ఒక మాట చెప్పి పెట్టేస్తా అని నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడకపోయినా కాల్ కట్ చేసిన నీకు ఇష్టమైన హనుమాన్ మీద ఒట్టు అంటుంది. నాకు హనుమాన్ అంటే ఇష్టమని నీకు ఎలా తెలుసు అని మ్యాడీ అడుగుతాడు. దాంతో ఒకరి మీద ఇష్టం ఉంటే అన్నీ తెలిసిపోతాయి అని అంటుంది. ఇక మధు మ్యాడీతో ఈ షాట్‌లో నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్ బాస్ అని అంటూ సిగ్గు పడుతుంది. నేను ఏం వేసుకున్నానో నీకు ఎలా తెలుసు అని మ్యాడీ మొత్తం వెతుకుతాడు. ఇక మధు కాల్ కట్ చేసేసి సిమ్ తీసేస్తుంది.
మ్యాడీ ఆలోచనలో పడతాడు. ఎవరు ఈ అమ్మాయి చిన్ని అయింటుందా.. నా ముందుకు రాలేక ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. మధు కూడా వస్తూ మ్యాడీని ఢీ కొడుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుంటారు. కళ్లలోకి చూసుకుంటూ నవ్వుకుంటారు. చిన్ని గురించి ఆలోచిస్తూ చూసుకోలేదని మ్యాడీ చెప్పి వెళ్లిపోతాడు. చిన్నిని పక్కనే పెట్టుకొని చిన్ని గురించి ఆలోచిస్తున్నావా మహి అని మధు మురిసిపోతుంది.
లోహిత డల్‌గా ఉంటుంది. ఏమైంది అని వరుణ్ అడిగితే మా అమ్మ గురించి టెన్షన్గా ఉంది.. మీ మామయ్య వాళ్ల మనసు మారుతుందా లేదా అని టెన్షన్‌గా ఉంది.. మా అన్నయ్య బిజినెస్‌లు మానేసి ఉన్నాడని అంటుంది. మన కష్టాలు ఎప్పుడూ తీరిపోతాయా అని లోహిత అంటే దానికి స్వరూప వచ్చి ఓ మార్గం ఉంది చేస్తాను అంటే చెప్తా అంటుంది. చెప్పమని అందరూ అడుగుతారు. దాంతో నల్లపూసల కార్యక్రమం జరిగిపోతే అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. మధు, మ్యాడీ ఒకే అంటారు. అయితే స్వరూప మీ పుట్టింటి వాళ్లు ఉండాలి అని అంటే కష్టం ఆంటీ నాకు పెళ్లి అయింది ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను అంటే వాళ్లు తట్టుకోలేరు అని అంటుంది.
మ్యాడీ లోహితతో మీ అమ్మని ఏదో ఒకటి చెప్పి కార్యక్రమానికి వచ్చేలా చూడు మిగతాది మేం చూసుకుంటాం అని అంటారు. తప్పక లోహిత సరే అంటుంది. మనసులో మాత్రం ఇలాంటి ఫిటింగ్ పెట్టారు ఏం చేయాలి అనుకుంటుంది. దేవా వల్లీతో రేపు మ్యాడీని కలుస్తున్నా అంటాడు. ఆ మధు చెప్పింది అని నువ్వు మ్యాడీని కలుస్తావాఅని అంటుంది. మ్యాడీ ఇంటికి వచ్చేలా నేను మాట్లాడుతా అని అంటాడు.
నల్లపూసల తంతుకి అన్ని ఏర్పాట్లు మధు వాళ్లు ఇంట్లో జరిపిస్తారు. మధు లోహిత దగ్గరకు వెళ్లి మీ పేరెంట్స్ ఇంకా రాలేదు వాళ్లకి కాల్ చేయొ అని అంటుంది. వరుణ్ కంగారు పడుతుంటే మ్యాడీ ధైర్యం చెప్తాడు. లోహిత తల్లిదండ్రులుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీబాబాయ్ వస్తారు. రిచ్ వాళ్లలా వస్తారు. స్టేజ్ ఆర్టిస్ట్‌ల్ని ఎందుకు తీసుకొచ్చావే అని లోహిత అంటుంది. ఇద్దరూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.