Ammayi garu Serial Today Episode విరూపాక్షి డ్రస్ సూర్యప్రతాప్‌ గదిలో పెట్టి వేసుకొని వస్తావనే నమ్మకంతో వెళ్తున్నా అని అంటుంది. లక్ష్మీ పూజకి టైం అయిందని పంతులు చెప్తారు. విరూపాక్షి దిగులుగా వస్తుంది. విజయాంబిక దీపక్‌తో ఆ బట్టలు మీ మామయ్య చచ్చినా వేసుకోడు అని అంటుంది. 

Continues below advertisement


రూప తల్లి దగ్గరకు వెళ్లి నాన్న బట్టలు తీసుకున్నారా అంటే లేదు రూప అక్కడ పెట్టి వచ్చా అని అంటుంది. నాన్న ఏం చెప్పలేదా అని రూప అడిగితే మీ నాన్న ఏం చెప్పాడో నేను చెప్తా రూప అని విజయాంబిక అంటుంది. విజయాంబిక రుక్మిణిని రూప అనడం విని చంద్ర, సుమ షాక్ అయిపోతారు. మీ అమ్మ మీ నాన్నకి డ్రస్ ఇవ్వగానే వేసుకుంటాడు అనుకున్నావా.. ఛీ పో అని గెంటేశాడు అని అంటుంది. సిగ్గూ ఎగ్గు లేకుండా అక్కడే పెట్టి వచ్చింది.. నా తమ్ముడు నాలా నీతి నిజాయితీతో బతికే వాడు అని విజయాంబిక అంటుంది. నీకు లేనివి ఉన్నాయని చెప్పుకుంటావేంటి అత్త అని రూప అంటుంది. మా నాన్న ఆ బట్టలు వేసుకొని వచ్చేలా ఆ అమ్మవారు చూసుకుంటుందని రూప అంటే ఎంత మంది దేవుళ్లు చెప్పినా నా తమ్ముడికి మీ అమ్మ మీద ఉన్న అభిప్రాయం పోదు.. ఆ బట్టలు వేసుకోడు అని అంటుంది. ఆ అమ్మవారే నా నమ్మకం గెలిపిస్తుందని విరూపాక్షి అనగానే ఇప్పుడు తెలుస్తుందిలే అని విజయాంబిక అంటుంది. 


ఇంతలో సూర్యప్రతాప్‌ విరూపాక్షి ఇచ్చిన బట్టలు వేసుకొని వస్తాడు. విజయాంబిక, దీపక్‌, కోమలిలు బిత్తరపోతారు. విరూపాక్షి వాళ్లు చాలా సంతోషడతారు. సూర్యప్రతాప్‌ వచ్చి పూజకు కూర్చొంటాడు. పక్కనే విరూపాక్షి కూర్చొంటుంది. అందరూ కూర్చొంటారు. పూజ మొదలవుతుంది. తల్లీదండ్రుల్ని చూసి రూప మురిసిపోతుంది. విరూపాక్షి దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటుంది. పంతులు సూర్యప్రతాప్‌కి కుంకుమ ఇచ్చి విరూపాక్షికి పెట్టమని అంటారు. అదేమైనా రూలా నా తమ్ముడికి అవి నచ్చవు అని విజయాంబిక అంటే భర్త భార్యకి కుంకుమ పెట్టడానికి రూల్స్ ఏం ఉండవు అని పంతులు అంటారు.


సూర్యప్రతాప్‌ విరూపాక్షి నుదిటన కుంకుమ పెడతారు. విరూపాక్షి కూడా సూర్యప్రతాప్‌కి కుంకుమ పెడుతుంది. ఇక మిగతా దంపతులు కుంకుమ పెట్టుకుంటారు. రాజు కుంకుమ తీయగానే సూర్యప్రతాప్‌ వాళ్లు చూస్తారు. రాజు అందరి ముందు రుక్మిణికి కుంకుమ పెడతారు. రుక్మిణిలా ఉన్న రూప కూడా రాజుకి కుంకుమ పెడుతుంది. రాజు మళ్లీ కుంకుమ తీసి కోమలికి పెడతాడు. 


విజయాంబిక, దీపక్‌లు గదిలోకి వెళ్లి సూర్యప్రతాప్‌ ఇలా మారిపోవడానికి కారణమేంటి అని అనుకుంటారు. సూర్యప్రతాప్‌, విరూపాక్షి దగ్గర అవ్వడానికి వీళ్లేదని దీనికి రాజు, రూపలే కారణం వాళ్ల స్పీడ్‌కి బ్రేక్‌లు వేయాలి అని విజయాంబిక అంటుంది. వాళ్ల స్పీడ్‌కి నేను బ్రేక్‌లు వేస్తా అని కోమలి వస్తుంది. ముగ్గురం కలిసి నిర్ణయించుకొని మొదలు పెడదాం అని అంటుంది. కోమలి తన ప్లాన్ విజయాంబికకు చెప్తుంది. తల్లీకొడుకులు ఐడియా సూపర్ అంటారు. రాజు, రూపల పతనం మొదలైంది అని అనుకుంటారు. 


రూప దీపాలు వెలిగించే దగ్గర కోమలి కూడా వెలిగిస్తుంది. బంటి వాళ్లు క్రాకర్స్ తీసుకొని వస్తారు. అందరూ క్రాకర్స్ కాల్చుతారు. విజయాంబిక విరూపాక్షి చీర కాలిపోయేలా దీపాలు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.