Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్​బాస్​లో కెప్టెన్సీ రేస్ రసవత్తరంగా జరుగుతుంది. గేమ్స్​లో సీక్రెట్స్ టాస్క్​లు పెడుతూ.. వారిలో రెబల్స్​తో కంటెస్టెంట్లను గేమ్​ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాడు బిగ్​బాస్. అలాగే గేమ్స్​లో గ్రీన్ కార్డ్స్ ఇస్తూ.. వారు కెప్టెన్సీ రేస్​లో ఉండే ఆశను కల్పిస్తున్నాడు. అయితే దీనిలో భాగంగా టీమ్స్​లోనే గొడవలు పెట్టేస్తున్నాడు. తాజాగా ఆరెంజ్ టీమ్​లో కూడా అదే జరిగింది. తనూజ, ఇమ్మాన్యుయేల్ ఒకటైపోయి.. గౌరవ్​ని బయటకు పంపేందుకు చూస్తున్నారు. అసలు ఏమి జరిగింది.. ప్రోమోలో ఏమి చూపించారో చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో.. 

బిగ్​బాస్​ కెప్టెన్సీ టాస్క్​లో భాగంగా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసే పవర్ రెబల్స్​కి ఇచ్చాడు బిగ్​బాస్. అయితే ఇప్పుడు రెబల్స్ ఆరెంజ్​ టీమ్​లోని వ్యక్తిని తీసేసే అవకాశం ఉంది కాబట్టి.. ఆ టీమ్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు. ఆరెంజ్ టీమ్​లో తనూజ, రాము, ఇమ్మాన్యుయేల్, గౌరవ్ ఉన్నారు. అయితే గతవారం నుంచి నామినేషన్స్​ వరకు నువ్వా నేనా అనే రేంజ్​లో గొడవ పెట్టేసుకున్న తనూజ, ఇమ్మాన్యుయేల్ ఒక్క టీమ్​గా మారిపోయారు. వారిద్దరూ కలిసి గౌరవ్​ను గేమ్​ నుంచి తప్పించేందుకు ప్లాన్ వేశారు.

Continues below advertisement

రీతూ చెప్పింది.. తనూజ, ఇమ్మూ స్టార్ట్ చేసేశారు..

ఈ డిస్కషన్​కి ముందుగా రీతూ, తనూజ, ఇమ్మూ రెబల్స్ తీసేయడం గురించి మాట్లాడుకుంటారు. అయితే వారికి రీతూనే రెబల్ అని తెలియదు. అయితే ఇప్పుడు ఇమ్మూనే టార్గెట్ అని రీతూ చెప్పగా అవును అంటారు ఇమ్మూ, తనూజ. అయితే నువ్వు కాదు.. వెళ్లి గౌరవ్​ని తగలబెట్టు అంటూ నిప్పు అంటించింది రీతూ. తర్వాత తనూజ, ఇమ్మాన్యుయేల్ ప్లాన్ చేసుకున్నట్లు ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. 

గౌరవ్​కి అన్యాయం చేసేస్తున్నారు..

తనూజ, రాము, గౌరవ్, ఇమ్మూ కూర్చొని గ్రీన్ కార్డ్ గురించి డిస్కషన్ పెడతారు. అయితే తనూజ గ్రీన్ కార్డ్ నీకు ఇస్తే ఇమ్మూ డేంజర్​లో ఉంటాడు. ఇమ్మూకి ఇస్తే గౌరవ్ డేంజర్​లో ఉంటాడు. అలాంటప్పుడు ఇద్దరికీ కాకుండా నా దగ్గర ఉంటే న్యూట్రల్​గా ఉంటుందంటూ చెప్తుంది. దానికి ఇమ్మూ అవును ఇంతకముందు నేను రిస్క్ తీసుకున్నాను అంటాడు. అయితే గౌరవ్ అలా అయితే నేను కూడా రిస్క్ తీసుకున్నానుగా అని చెప్తాడు. కానీ తనూజ, ఇమ్మూ కలిసి గౌరవ్​ని ఎలాగోలా ఒప్పించేందుకు ట్రై చేస్తారు. 

నేను కెప్టెన్ అవుతా.. 

నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తే రెండ్రోజుల నుంచి గేమ్ ఆడిన నేను వేస్టే కదా.. నేను డేంజర్​లోకి వెళ్తాను కదా అంటాడు ఇమ్మూ. అలా అయితే నేను కూడా డేంజర్​లోకి వెళ్తాను కదా అంటాడు గౌరవ్. మొత్తానికి తిమ్మిని బమ్మి చేసి.. గౌరవ్​ని తప్పించాలనుకుంటే గౌరవ్ నేను కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. పూర్తి ఎపిసోడ్​లో గౌరవ్ కెప్టెన్సీ రేస్​లో ఉన్నాడో.. లేదో తెలుస్తుంది.