Meghasandesam Serial Today Episode: కేపీ కేసులో భూమి అనుమానిస్తుందని ఎస్పీ సూర్య వచ్చి శరత్‌చంద్ర, అపూర్వకు చెప్తాడు. దీంతో శరత్, అపూర్వ షాక్ అవుతారు. భూమికి ఈ విషయాలు ఎలా తెలిశాయని అడుగుతుంది అపూర్వ.
సూర్య: నాకు అర్థం కావడం లేదు మేడం.. ఆ స్పాట్‌లో ఉన్నది కేవలం మీ ఇద్దరే..? మీరే కేపీని కాల్చి చంపారని స్పాట్‌లోనే భూమి చూసి ఉంటే.. కేపీ డెడ్‌బాడీ ఇంటికి రాకముందే.. నా పై ఆఫీసర్‌కు కంప్లైంట్ ఇచ్చి నానా హంగామా చేసేది. అలా చేయలేదు అంటే తను చూడలేదు అని అర్థం. ఎలా తెలిసింది అని అడిగితే ఎస్పీగా మీరే తెలుసుకోండి అని నాకే చాలెంజ్ విసిరింది. తను మాట్లాడే కాన్ఫిడెంట్ చూస్తుంటే.. బుల్లెట్ తగిలే కేపీ చనిపోయాడన్న పక్కా ఇన్మఫర్మేషన్ తన దగ్గర ఉంది. కేపీ బుల్లెట్ తగిలి చనిపోయాడని తను నాకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే నేను ఈ కేసు తొక్కేసే వాడిని.. కానీ గగన్ సపోర్ట్ తీసుకుని నా పై ఆఫీసర్లను కలుస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి.. ఇది చెబుదామనే వచ్చాను..
అపూర్వ: ఓకే ఎస్పీ గారు మా జాగ్రత్తలో మేము ఉంటాము.. కానీ ఎస్పీ గారు భూమి మీద మీరు కూడా ఒక కన్నేసి ఉంచండి. తన గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి..
సూర్య: ఓకే.. చెప్తాను.. ఇక నేను వస్తాను..
అంటూ సూర్య వెళ్లిపోతాడు. శరత్ చంద్ర బాధపడుతుంటాడు.
శరత్: వద్దు అపూర్వ ఇక ఈ దొంగ పోలీస్ ఆట నేను ఆడలేను.. నేనే కేపీని చంపానని నా శత్రువును పెళ్లి చేసుకున్న ఆ భూమి నిరూపిస్తే అంతకంటే అవమానం నాకు ఉండదు.. అంతటి అవమానం కోసం క్షణాలు లెక్కపెడుతూ నేను ఎదురుచూడలేను. కేపీ చంపింది నేనే అంటూ పోలీసులకు లొంగిపోతాను.
అపూర్వ: పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడకు బావ. నువ్వు లొంగిపోతే నీ వెనక నన్ను.. ఆ తర్వాత మనకు సాయం చేసిన ఎస్పీ గారిని కేసులోకి లాగుతారు.
శరత్: లేదు నేను మీ దాకా రానివ్వను.. నేను అప్రూవర్‌గా లొంగిపోయి మీకేం తెలియదని చెప్తాను.
అపూర్వ: ఎమోషన్‌లో విచక్షణ కోల్పోతున్నావు బావ. చిన్న అనుమానం వచ్చినా చాలు చివరి వేరు వరకు అది తవ్వుకుంటూ పోతుంది. బావ నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను రావడానికి సిద్దం బావ. కానీ మనకు హెల్ప్ చేసిన పాపానికి ఆ ఎస్పీని ఎందుకు లాగాలని చూస్తున్నావు..
శరత్: అపూర్వ దీని అంతిమ ఫలితం నువ్వు ఊహించలేకపోతున్నావు.. కేపీని చంపి మనం తప్పు చేశాం. మన తప్పును దాచి ఎస్పీ గారు తప్పు చేశారు. ఎదో ఒక రోజు మనం అందరం ఇరుక్కుపోవాల్సిందే.. అది కూడా మన శత్రువు భార్య అయిన భూమి వలన. అంతకంటే ముందు నేను లొంగిపోవడమే బెటర్ అని చెప్తున్నాను..
అపూర్వ: బావ నేను చెప్పేది ఒకసారి విను.. నేను ఉండగా.. ఆ భూమి నిన్ను టచ్ చేయలేదు.. ఫ్లీజ్ బావ నా మీద వేసిన ఒట్టు నిలబెట్టుకో..? నీకేం కాకుండా నేను నిలబడతాను..
శరత్: సరే అపూర్వ. నీ మీద నమ్మకంతో నేను ఎక్కడా నోరు జారను.. కానీ కేపీ బుల్లెట్ తగిలి చనిపోయాడని భూమికి ఎలా తెలిసింది.
అపూర్వ: ఈ ప్రశ్న ఇప్పుడే కదా మనకు ఎదురైంది.. నేను ఎలాగైనా కనుక్కుంటాను..కాఫీ పంపిస్తాను ఉండు బావ
అంటూ అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న భూమి శారద మీద ఇంటికి వచ్చి అటాక్ చేసిన రౌడీని చూస్తుంది. వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాడు తప్పించుకుని పారిపోతుంటాడు.. భూమి వెనకాలే పరుగెడుతుంది. ఇంతలో గగన్ కారులో వస్తాడు. గగన్‌కు విషయం చెప్పగానే.. ఇద్దరూ కారులో వెళ్లి రౌడీని పట్టుకుంటారు. గగన్ రౌడీని కొట్టి ఎందుకు మా అమ్మను చంపాలనుకున్నావు అంటూ అడగ్గానే.. అపూర్వ చంపమంది అని చెప్తాడు. దీంతో గగన్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!