Meghasandesam Serial Today Episode: కేపీకి గగన్ పిండ ప్రధానం చేస్తుంటాడు అక్కడే నిలబడిన శారద, భూమి బాధపడుతుంటారు. ఇంటి దగ్గర నుంచే పిండ ప్రధానం లైవ్‌లో చూస్తుంటారు శరత్, అపూర్వ. ఇప్పుడైనా కేపీ బయటకు వస్తాడని అపూర్వ మనసులో అనుకుంటుంది. మరోవైపు ఏడుస్తున్న శారదను భూమి ఓదారుస్తుంది.
శారద: అది కాదు భూమి.. ఆయన బతికి ఉన్నారని తెలిసి కూడా నేను ఈ పని చేస్తుంటే.. ఎందుకు అడ్డుకోలేదని వాడు నిలదీస్తాడమ్మా అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి.
భూమి: ఆ రోజుకు ఏదో ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య. అప్పటి వరకు మామయ్య సేఫ్‌గా ఉండటం మనకు ముఖ్యం. సమస్యలన్నీ తీరి మామయ్య నిర్దోషిగా నిరూపించబడితే బావే అర్థం చేసుకుంటాడు అత్తయ్య. ఇదంతా మనం ఎందుకు చేశామని అప్పటి వరకు మీరు నోరు విప్పకండి
అంటూ శారదను ఓదారుస్తుంది భూమి. మరోవైపు ఎస్పీ సూర్య కూడా పిండ ప్రధానం కార్యక్రమాన్ని తన ఫోన్‌లో లైవ్ చూస్తుంటాడు. శరత్ చంద్ర ఇంట్లో లైవ్ చూస్తున్న మీరా కూడా ఎమోషనల్ అవుతుంది. కేపీ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. పిండం పెడుతున్న గగన్ కూడా ఎస్పీ సూర్య తనతో చెప్పిన మీ నాన్న కృష్ణ ప్రసాద్ బతికే ఉన్నాడు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ పిండ ప్రదానం చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి గగన్ అంటూ కేపీ వస్తాడు. కేపీని చూసిన అందరూ షాక్ అవుతారు. వెంటనే ఎస్పీ సూర్య పిండ ప్రధానం దగ్గరకు వెళ్తాడు.
శరత్: మన కేపీ బతికే ఉన్నాడు మీరా..
మీరా: అన్నయ్య ఆయన బతికే ఉన్నారు.
శరత్: అపూర్వ కేపీ బతికే ఉన్నాడు.
అంటూ అందరూ సంతోషంగా ఫీల్ అవుతుంటే.. అపూర్వ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. మరోవైపు కేపీని చూస్తూ దగ్గరకు వెళ్లి చెర్రి ఏడుస్తుంటాడు.
కేపీ: గగన్ నేను బతికి ఉండగా నువ్వు ఈ పాపం చేయోద్దురా.. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా నువ్వు ఈ పని చేయడం ఇష్టం లేకే నేను బయటకు వచ్చాను.
అంటూ చెప్పి కేపీ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఎస్పీ సూర్య వచ్చి కేపీని కొడుతుంటాడు. చెర్రిని అడ్డు వెళ్లితే చెర్రిని బేడీలతో కట్టేస్తాడు. భూమి అడ్డు వెళితే భూమిని తోసేస్తాడు.
భూమి: సార్ ఎందుకు మామయ్యను కొడుతున్నారు..?
సూర్య: మా అన్నయ్యను చంపిన హంతకుడు వీడిని అంత ఈజీగా వదిలేస్తానా..? తప్పుకో..
భూమి: సార్ ఆగండి.. మామయ్యను ఏం చేయోద్దు.. సార్..
చెర్రి: భూమి.. ఆపేయ్..
సూర్య: భూమి.. ఒక నేరస్తుడిని కాపాడటం అంటే ఆ నేరం నువ్వు చేసినట్టే మర్యాదగా తప్పుకో..
భూమి: లేదు సార్ మామయ్య తప్పు చేయలేదు.. మీరు అర్థం చేసుకోండి..
సూర్య: లేదు భూమి నాకు అంతా తెలుసు.. నువ్వు తప్పుకో..
అంటూ సూర్య రాడ్ తీసుకుని కేపీని కొట్టబోతుంటే.. ఇంతలో గగన్ వచ్చి ఎస్పీ సూర్యను అడ్డుకుంటాడు. సూర్య కోపంగా గగన్ చూస్తుంటాడు.
సూర్య: నాన్నంటే పడదు అంటావు. నీ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు అంటావు. మరి ఇప్పుడు ఎలా కాపాడాలి అనిపిస్తుందిరా..?
గగన్: కాపాడటానికి బంధం ఉండాల్సిన అవసరం లేదు. మన కళ్లెదురుగా అన్యాయం జరుగుతుందన్న ఆలోచన వస్తే చాలు.
అంటూ సూర్యను కొడుతుంటాడు గగన్. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!