Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ ప్రేమ నగలు దిగేసుకుంటుంది. అది ఇంట్లో ఎవరూ చూడకుండా ఉండాలి అని కొంగు మొత్తం కప్పేసుకుంటుంది. తిరుపతి వల్లీని కనిపెట్టేశా అని అనడంతో నగలు గురించి తెలిసిపోయిందేమో అని వల్లీ కంగారు పడుతుంది.
నగలు వేసుకొని బయటకు వెళ్తే ప్రేమకి తెలిసిపోతుందని వల్లీ అనుకుంటుంది. చూసి మురిసిపోవడం తప్ప ఇంకేం చేయలేం అని అన్నీ తీసేసి పెట్టేస్తుంది. భద్రావతి, సేనాపతి వాళ్లు ప్రేమ నగలను ఇచ్చి మెరుగు పెట్టమని అంటే ఆయన అవి రోల్డ్ గోల్డ్ అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. రేవతితో సేనాపతి ఆ రోజు తిరుపతి తీసుకొచ్చినవి బీరువాలో పెట్టావా మధ్యలో ఎవరు అయినా తీశారా అని అంటే ఎవరూ రాలేదని మళ్లీ ఈ రోజే తీశామని రేవతి అంటుంది.
భద్రావతి కోసం ఇదంతా ఆ రామరాజు ప్లాన్ అని నగల కోసమే ప్రేమని ట్రాప్ చేశారని రగిలిపోతుంది. ఆ గిల్ట్ నగల్ని తీసుకొని భద్రావతి, సేనాపతి బయటకు వెళ్లి రామరాజుని పిలుస్తారు. మాతో గొడవ పెట్టుకోవడానికి మళ్లీ వచ్చావా అని రామరాజు అంటే డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా అని భద్రావతి అంటుంది. డబ్బు కోసం నీ చిన్న కొడుకుని నా మేనకోడల్ని ట్రాప్ చేయించావ్ అని అంటుంది. నా మేనకోడలు నగలు కొట్టేయాలని స్కెచ్ వేశావని రామరాజుని అంటారు.
నగలు గురించి తెలిసిపోయింది అని వల్లీ టెన్షన్ పడుతుంది. అందరూ కలిసి భద్రావతితో నగలు పంపేశాం కదా అంటే భద్రావతి కోపంగా ఇవేనా మీరు పంపిన నగలు అన్నీగిల్ట్ నగలు అని కింద పడేస్తుంది. రామరాజు ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. మేం ఒరిజినల్ పెట్టామని వేదవతి అంటే మెరుగు కోసం పంపిస్తే గిల్ట్ పంపామని మమల్ని అవమానించారు.. ఇవా నీ నగలు.. నీకు గోల్డ్‌కి రోల్డ్ గోల్డ్‌కి తేడా తెలీదా.. అని భద్రావతి ప్రేమని తిడుతుంది. రేపు మా నగలు మాకు తెచ్చి ఇవ్వకపోతే జైలుతో చెప్పకూడు తింటావ్ అనిభద్రావతి రామరాజుకి వార్నింగ్ ఇస్తుంది.
రామరాజు కోపంగా ఇంటికి వెళ్లిపోతాడు. వల్లీ చాలా టెన్షన్ పడుతుంది. ఈ గండం ఎలా గట్టెక్కుతా అని అనుకుంటుంది. ఇంట్లో ఏం జరుగుతుంది.. ప్రతీ సారి ఈ నగల గోల ఏంటి.. ఈ మాటలు ఈ అవమానాలు ఈ దరిద్రం ఏంటి నాకు అని కోప్పడతాడు. నేనే పంపానని ఇలా అవ్వడం ఏంటి అని వేదవతి అంటుంది. ప్రేమని కూడా అడుగుతారు. మనతో గొడవ పడాలని వాళ్లు నాటకం ఆడుతున్నారేమో అని చందు అంటే.. వాళ్ల కోసం చూస్తే నాటకం ఆడినట్లులేరు.. మన ఇంట్లోనే ఎవరో ఇలా చేసుంటారని రామరాజు అంటాడు.
ప్రేమకే ఈ గిల్ట్ నగలు గురించి తెలుసు అని ప్రేమ వాళ్ల అమ్మ నగలు ఇచ్చింది.. తిరిగి ప్రేమ ఇచ్చింది.. ప్రేమే ఏదో చేస్తుందని వల్లీ అంటుంది. ప్రేమకు నగలు దాచుకోవాల్సిన అవసరం ఏంటి అని వల్లీ అంటుంది. మరోసారి వాళ్లు మామయ్య గారి షర్ట్ చింపేస్తారు అని వల్లీ అంటుంది. ప్రేమని పోలీస్‌ని చేయాలి అనుకున్నారు కాబట్టి దానికి లక్షలు అవసరం కాబట్టి ప్రేమ, ధీరజ్‌లే నగలు దాచేసుంటారని వల్లీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.