Meghasandesam Serial Today Episode: కేపీకి భోజనం తీసుకుని వెళ్తున్న భూమిని గగన్‌ను ఫాలో అవుతాడు. భూమి కేపీ ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లగానే.. గగన్ కూడా ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు.
గగన్: అదేంటి మా పాత ఇంటికి ఎందుకు వచ్చినట్టు..? అది కూడా క్యారేజ్ పట్టుకుని నో డౌట్ ఎస్పీ సూర్య చెప్పనట్టు కృష్ణ ప్రసాద్ బతికే ఉన్నాడు. ఆయన్ని వీళ్లు ఇలా దాస్తున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అప్పుడు చెప్తాను ఈ భూమి పని
అనుకుంటూ గగన్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లిన భూమి మామయ్య అని పిలుస్తుంది. భూమిని చూసిన కేపీ అమ్మా భూమి వచ్చావా..? నిన్ను ఎవరూ చూడలేదు కదా అని అడగ్గానే ఎవ్వరూ చూడలేదు మామయ్య ముందు మీరు భోజనం చేయండి అని చెప్తుంది. కేపీ అన్నం తినబోతుంటే.. గగన్ డోర్ దగ్గరకు వచ్చి గట్టిగా భూమి అని అరుస్తాడు. గగన్ అరుపులకు కేపీ, భూమి షాక్ అవుతారు.
గగన్: భూమి మీ నాటకం మొత్తం తెలిసిపోయింది నాకు.. కేపీ ఇక్కడే ఉన్నాడని నాకు తెలిసిపోయింది. భూమి ఏయ్ తలుపు తీయ్..
కేపీ: అమ్మా భూమి నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయ్ నేను లోపల దాక్కుంటాను.
భూమి: అలాగే మామయ్య
అనగానే.. కేపీ లోపలికి వెళ్లి దాక్కుంటాడు.. భూమి వెళ్లి తలుపు తీస్తుంది. గగన్ స్పీడుగా లోపలికి వస్తాడు.
భూమి: బావ వచ్చావా బావ.. నాకు తెలుసు బావ నువ్వు వస్తావని..
గగన్: ఏయ్ ఆపు నీ యాక్టింగ్ ఎక్కడ నువ్వు దాచిన ఆ పెద్ద మనిషి
భూమి: మన ఇంట్లో నీకంటే పెద్ద మనిషి ఎవరున్నారు బావ. హైట్ లో కూడా..
గగన్: ఏయ్ ఈ రోజు ఆయన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాక అప్పుడు చెప్తాను నీ సంగతి..
అంటూ గగన్ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడా కేపీ కనిపించడు..
గగన్: ఎక్కడ ఎక్కడ అతను..
భూమి: పెద్ద మనిషి అంటావు.. పట్టుకోవాలి అంటావు.. ఎక్కడ బావ. ఇంకా నీకు అర్థం కావడం లేదా బావ. ఇది నేను నీకు వేసిన ట్రాప్ బావ. నా ట్రాప్‌లో భలే పడ్డావు నువ్వు.. ఈ మధ్యే ఈ ఇంటి గురించి చెప్పారు. జీవితంలో నువ్వు ఎదగడం ఇక్కడి నుంచే కదా మొదలు పెట్టావు. మన కాపురం కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని ప్లాన్ చేశాను బావ. నన్ను ఫాలో అవుతూ వస్తావు.. నా కౌగిలిలో నిన్ను బంధించేయాలని డిసైడ్ అయిపోయాను. బయటికి కదలకుండా ఉండిపోవచ్చని క్యారేజ్ కూడా తెచ్చాను.
గగన్: ఏయ్ చీ తప్పుకో.. కానీ పెళ్లిని అయింది అన్నావు. ఇలా నన్ను రప్పించి కాపురం చేస్తున్నాను అన్నా అంటావు..నువ్వే పెద్ద దిన కంత్రివే.. నిన్ను అసలు నమ్మడానికే లేదు. చూడు ఆ కృష్ణ ప్రసాద్ బతికే ఉన్నాడని మీరందరూ అతన్ని దాస్తున్నారని నా అనుమానం. ఎంత దాచినా రేపు నేను ఆయనకి పిండ ప్రధానం చేసేటప్పుడు బయటికి రాకుండా ఉండలేడు కదా..? ఆయన రాలేదనుకో నిజంగా చచ్చిపోయాడని అప్పుడు నమ్ముతాను నేను
అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు నది దగ్గరకు వెళ్లి గగన్, కేపీకి పిండ ప్రధానం చేస్తుంటాడు. పక్కనే నిల్చున్న శారద, భూమి ఏడుస్తుంటారు. గగన్ చేసే పిండ ప్రధానం కార్యక్రమాన్ని శరత్ చంద్ర వాళ్లు ఇంట్లో లైవ్ చూస్తుంటారు. కేపీ ఇప్పుడు నువ్వు ఎలాగూ వస్తావని నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కేపీ ఓరేయ్ గగన్ అనుకుంటూ వస్తాడు. కేపీని చూసిన అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!