Meghasandesam Serial Today Episode: శారద, భూమి కలిసి కేపీని ఎవ్వరికీ కనిపించకుండా ఒక పాత ఇంట్లో ఉంచుతారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. దీంతో కేపీ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. అయితే కేపీకి ఆకలి వేయడంతో ఏం చేయాలో అర్థం కాదు. బటయకు వెళ్లి తిందామని అనుకుంటాడు.. కానీ బయటకు వెళితే ఎవరైనా చూస్తే అని భయపడి ఇంట్లోనే ఉంటాడు. ఇంతలో ఆకలి బాగా కావడంతో కేపీ, శారదకు ఫోన్ చేస్తాడు.
శారద: హలో ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు..? చెప్పండి..
కేపీ: శారద నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..
శారద: చెప్పండి ఏమైంది..? ఎవరైనా వచ్చారా… అక్కడికి మిమ్మల్ని ఎవరైనా చూశారా..?
కేపీ: అదేం లేదు శారద ఇక్కడకు ఎవ్వరూ రాలేదు. నన్ను ఎవ్వరూ చూడలేదు..
శారద: మరి ఎందుకు అంత భయంగా మాట్లాడుతున్నారు.. ఏమైంది చెప్పండి..
కేపీ: శారద బాగా ఆకలిగా ఉంది. బయటకు వెళ్లి తిందామంటే.. ఎవరైనా చూస్తారేమోనని ఆగిపోయాను.. ఇక్కడేమో వండుకోవడానికి ఏమీ లేదు.. అందుకే నీకు ఫోన్ చేశాను.
శారద: అయ్యో నేను ఆ విషయమే మర్చిపోయానండి.. అసలు మిమ్మల్ని పస్తులు పెట్టాను..నన్ను క్షమించండి..
కేపీ: శారద ఆ మాటలు ఎందుకు…? నీకు ఇబ్బందిగా ఉంటుంది బయటకు రావడానికి అందుకే నీకు చెప్పడానికి ఆలోచించాను
శారద: ఏం లేదండి.. నేను పనిలో పడి మర్చిపోయాను.. పది నిమిషాల్లో భోజనంతో మీ దగ్గర ఉంటానండి..
అని చెప్పగానే కేపీ సరే శారద అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇంతలో భూమి రాగానే.. శారద కంగారు పడటం చూస్తుంది.
భూమి: ఏంటి అత్తయ్యా అంత కంగారు పడుతున్నారు..? ఏమైంది…?
శారద: ఏం లేదు భూమి.. మీ మామయ్యను అక్కడ ఇంట్లోనే ఉంచాము కదా ఆయనకు ఆకలిగా ఉందని ఫోన్ చేశారు. ఆయనకు భోజనం ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను.. గగన్ ఇంట్లోనే ఉన్నాడు కదా..? వాడు చూస్తాడేమోనని భయంగా ఉంది భూమి..
భూమి: గగన్ బావను నేను చూసుకుంటాను అత్తయ్య.. మామయ్యకు భోజనం నువ్వు తీసుకెళ్లు..
శారద: అది కాదు భూమి.. నేను భోజనం తీసుకెళ్లడం గగన్ చూసి నన్ను ఫాలో అయితే వాడికి మొత్తం నిజం తెలిసిపోతుంది.
భూమి: అయ్యో అత్తయ్య మీరు కంగారు పడకుండా వెంటనే మామయ్యకు భోజనం తీసుకెళ్లండి. పదండి నేను క్యారియర్ రెడీ చేస్తాను..
అంటూ భూమి శారదను తీసుకుని కిచెన్‌లోకి వెల్లి భోజనం క్యారియర్ రెడీ చేసి చాటుగా ఎవ్వరూ చూడకుండా శారదకు ఇస్తుంది. శారద మెల్లగా సౌండ్ చేయకుండా బయటకు వెళ్లి ఆటో మాట్లాడుకుని కేపీ దగ్గరకు వెళ్తుంది. భూమి టెర్రస్‌లోకి వెళ్లి శారద ఆటోలో వెళ్లడం చూస్తుంది. అయితే ఎస్పీ సూర్య కూడా శారదను ఫాలో అవడం చూస్తుంది.
భూమి: ఈ ఎస్పీ సూర్య గారేంటి..? అత్తయ్యను ఫాలో అవుతున్నారు. మామయ్య బతికే ఉన్నాడన్న విషయం ఆయనకు తెలిసిపోయిందా..?
అని కంగారు పడుతుంది. ఇప్పుడు ఎలా ఆని ఆలోచిస్తుంది. ఇంతలో శారద ఆటో ఎస్పీ సూర్యకు దొరక్కుండా వెళ్లిపోతుంది. శారద వెళ్లి కేపీకి భోజనం వడ్డిస్తుంది. మరోవైపు సూర్యకు శారదను డ్రాప్ చేసిన ఆటో ఎదురుగా రావడంతో సూర్య ఆటో డ్రైవర్‌ను పట్టుకుని శారద, కేపీ ఉన్న ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!