Meghasandesam  Serial Today Episode: రంగ భయంతో అపూర్వ కాళ్ల మీద పడతాడు. దీంతో రంగను తిట్టి వెళ్లి తాళి కట్టు అని చెప్తుంది. రంగ తాళి కట్టబోతాడు. ఇంతలో అక్కడికి గగన్‌ వస్తాడు. రౌడీలను చితకొడుతుంటాడు.


సుజాత: యముడు వచ్చాడు మనం ఇప్పుడు బతకడం చాలా ముఖ్యం అమ్మాయి.  ఎద్దులా ఉన్న వాళ్లను ఎగిరెగిరి తంతున్నాడు. అదే మనల్ని ఒక్క గుద్దు గుద్దాడంటే.. ఇదిగో అమ్మాయి మనం ఇక్కడి నుంచి సేఫ్‌గా బయటపడాలి.


అపూర్వ: రా.. పిన్ని..


అని అక్కడి నుంచి పారిపోతుంది. గగన్ లోపలికి వచ్చి శారదను హగ్‌ చేసుకుంటాడు. శారద ఏడుస్తుంది.


గగన్‌: అమ్మా ఏడవొద్దు అమ్మా.. వెళ్దాం పద..


శారద: అరేయ్‌ భూమిరా.. భూమే కరెక్టు టైంకు రాకపోతే.. పెళ్లిని నా చావును అడ్డుకుని ఉండకపోతే నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోయి ఉండేదాన్నిరా..?


గగన్‌: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కూడా ఆ శరత్ చంద్ర గాడు ఇంత ఘోరానికి తెగబడ్డాడా..?


శారద: ఓరేయ్‌ హాస్పిటల్ కు తీసుకెళ్దామా..?


అని చెప్పగానే గగన్‌ భూమిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు పెళ్లి అయిపోయిందని మీరా సంతోషంగా ఇంటికి వస్తుంది. అందరూ రావడంతో శరత్‌ చంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. అందర్నీ లోపలికి పంపిస్తాడు. తర్వాత ప్రసాద్‌ కోపంగా శరత్ చంద్రను తిడతాడు. శారదను తీసుకెళ్లి బంధిస్తావా..? అంటూ నిలదీస్తాడు. దీంతో చంపలేదు సంతోషించు అంతేకానీ కూతురు పెళ్లి జరిగిందన్న సంతోషం పక్కన పెట్టి నన్ను తిడుతున్నావా..? నేను మంచోణ్ని కాబట్టే నువ్వు నా చెల్లెలిని రెండో పెళ్లి చేసుకున్నావని తెలిసినా చంపకుండా వదిలేశాను అంటాడు. మరోవైపు భూమి, శారదను హాస్పిటల్ కు పంపంచిన గగన్‌ కోపంగా శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తాడు. మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు.


ప్రసాద్‌: ఇందు చూశావా.. మీ అన్నయ్య గురించి మీ అత్తయ్యమామయ్యలకు కూడా అర్తం అయింది.  అమ్మా ఇందు ఒక్క నేను తప్పా మీ అన్నయ్యకు మీరంతా వాడి మనుషులే.. నీకు రెండు పుట్టిల్లు ఉన్నాయని మర్చిపోకు.


అపూర్వ: శభాష్‌.. బాగుంది ఇందు.. చాలా బాగుంది. మీ అన్నయ్యని మీ నాన్న సూపర్‌ మేన్‌ లా చూపించడం బాగుంది. నువ్వు చూడటం బాగుంది.


ఇందు: అదేం లేదు ఇందు.


అపూర్వ: లేదని నువ్వు చెప్పడం కాదు ఇందు. మీ అన్నయ్యని సూపర్‌ మేన్‌ లా చూస్తున్నావు కాబట్టే ఇంతసేపు మీ నాన్నను మాట్లాడనిచ్చావు. ఇలా మంచిగా నటించే మీనాన్న మాటలు మాత్రం కోటలు దాటిస్తాడు. ఎదురుగా ఉన్న ఇంటిని గుర్తిస్తాడు కానీ దాని కింద ఉన్న పునాదిని మర్చిపోతాడు. ఆ పునాదే మీ బావ శరత్ చంద్ర. అప్పటికి ఆయన నీ మీద ప్రేమ కారిపోయే చెల్లెలే సర్వస్వం అని చేయలేదు. మీ మామయ్య వాళ్ల అమ్మను బంధించి వాడి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. అందుకే వాడు ఇదంతా చేశాడు. ఒక ముద్ద పడేస్తే కుక్కలు కూడా విశ్వాసంగా ఉంటాయి. కానీ మీ నాన్న మాత్రం.


బామ్మ: అమ్మా అపూర్వ చాలు అంతటితో ఆపేయ్‌.. ఇన్నాళ్లు మా ముందు నా కొడుకును అవమానించింది చాలు. ఇప్పుడు కొత్త బంధువుల మధ్య కూడా నా కొడుకును దిగజార్చకు.


అపూర్వ: అయ్యోయ్యో అదేంటి పిన్ని గారు అలా మాట్లాడతారు. మీ కొడుకు ఎంత సమర్థులో ఇక్కడ అందరికీ తెలుసు. అంతే కదా..? రమేష్‌ గారు.


రమేష్‌: అంతే అంతే మీరు అన్నారంటే అంతే..


సౌందర్య: ఇస్తామన్న పెట్టిపోతలేమిటో మళ్లీ అడగండి..


అపూర్వ: ఏంటి ఏంటో సీక్రెట్‌ గా మాట్లాడుతున్నారు.


అని అపూర్వ అడగ్గానే మా ఆవిడ మీరా చెల్లెమ్మతో ఏదో మాట్లాడాలి అంటుంది. అని రమేష్‌ చెప్పగానే మాట్లాడండి అని అపూర్వ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!