Meghasandesam Serial Today Episode: హాస్పిటల్‌కు వచ్చిన గగన్‌ అక్కడే ఉన్న నక్షత్ర చూస్తుంది. వెంటనే డాక్టర్‌ దగ్గర నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి గగన్‌ ను పలకరిస్తుంది. గగన్‌, నక్షత్రను చూసి ఇరిటేట్‌ అవుతుంటాడు. అయినా వినకుండా నక్షత్ర, గగన్‌ పక్కన కూర్చుంటుంది.

Continues below advertisement

నక్షత్ర: ఏంటి బావ నా కోసం హాస్పిటల్‌కు వచ్చావా..? ఇంత దాకా వచ్చి నన్ను కోపంగా చూస్తావేంటి బావ.

గగన్‌: ఏయ్‌ నక్షత్ర నేను నీ కోసం రాలేదు. అయినా నేను ఎక్కడికి వెళ్లితే అక్కడకు రావడమేనా..?

Continues below advertisement

నక్షత్ర: నా కోసం రాలేదా..? మరి ఎవరి కోసం వచ్చావు ఆ భూమి కోసం వచ్చావా..? అయినా నువ్వు ఎక్కడికి వెళ్లితే నేను అక్కడికి రావడం లేదు బావ. నేను ఎక్కడికి వెళితే నువ్వు అక్కడికి వస్తున్నావు..

గగన్‌: ఏయ్‌ పో ఇక్కడి నుంచి చెబితే అర్థం కాదా..? నేను వేరే పనుండి ఇక్కడికి వచ్చాను.

నక్షత్ర: పో బావ.. అయినా నీకు మళ్లీ ఇంకోసారి చెప్తున్నాను విను. ఆ భూమి మహా దొంగది. నీతో పెళ్లి కాకుండానే పెళ్లి అయిందని అబద్దం చెప్తుంది. పైగా నీకు ఇష్టం లేకుండానే నీ ఇంట్లో ఉంది బావ. దాన్ని అసలు నమ్మకు నమ్మావనుకో నిన్ను చుక్కలు చూపిస్తుంది. అది చెప్పేవన్నీ అబద్దాలే

అంటూ నక్షత్ర చెప్తుంటే గగన్‌ ఇరిటేట్‌గా చూస్తూనే ఉంటాడు. ఇంతలో భూమి అక్కడికి వచ్చి నక్షత్ర చెప్తున్న మాటలు వింటుంది. ఎలాగైనా దీన్ని గగన్‌ బావ నుంచి దూరంగా వెళ్లేలా చేయాలనుకుంటుంది. అందుకోసం పక్కకు వెళ్లి ముసుగు వేసుకుని వచ్చి వాళ్ల వెనకాలే కూర్చుంటుంది. నక్షత్ర మాటలను వింటుంది.

గగన్‌: ఏయ్‌ నక్షత్ర నీకు ఎన్ని సార్లు చెప్పాలి. కొంచెం దూరంగా కూర్చో. అయినా నేను తిడుతుంటే నీకు సిగ్గుగా లేదా..?

నక్షత్ర: సిగ్గు ఎందుకు బావ. నీకు ఎలాగూ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు.. అసలు పెళ్లి అయిందో లేదో కూడా నీకు క్లారిటీ లేదు. ఎలాగూ ఆ భూమిని నువ్వు వదిలేస్తావు కదా..?  ఆ భూమిని వదిలేశాకా నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా బావ.

గగన్‌: అబ్బా నక్షత్ర నీకు పెళ్లి అయింది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్టు కాదు.. అయినా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతావు ఇలా..

భూమి: ( మనసులో) అది అలా పెట్టు దీనికి గడ్డి.. అయినా ఎంత చెప్పినా దీని బతుకు ఇంతేలే బావ

నక్షత్ర: ఎవరో ఒకరిని చేసుకోవడం ఎందుకు నువ్వు చేసుకోబోయేది నేనే అయితే ఇంకా ఫర్‌ఫెక్ట్‌ గా ఉంటుంది కదా..?

అనగానే వెనక కూర్చున్న భూమి కోపంతో నక్షత్రను లాగిపెట్టి కొడుతుంది. దీంతో నక్షత్ర కోపంగా వెనక్కి చూస్తుంది.

నక్షత్ర: ఏయ్‌ ఎవరే నువ్వు నన్ను కొడుతున్నావు.. అయినా నన్ను ఎందుకు కొడుతున్నావే..? చెప్పవే ఎవరే నువ్వు..

భూమి: అదిగో అక్కడ చూడు అక్కడ టీవీలో నా ఫేవరెట్‌ సీరియల్‌ వస్తుంది. నేను అది చూస్తుంటే అడ్డుగా వచ్చి కూర్చున్నావు అందుకే కొట్టాను..

నక్షత్ర: నీకు అడ్డంగా కూర్చుంటే చెప్పాలి కానీ ఇలా కొడతావా..? నీ సంగతి తర్వాత చెప్తాను..

అంటూ నక్షత్ర తిరిగి గగన్‌కు ఇంకోవైపు కూర్చుంటుంది.

నక్షత్ర: చెప్పు బావ నా ప్రపోజల ‌నీకు ఓకేనా..? నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా..? చెప్పు బావ

అంటూ అడుగుతుంటే.. భూమి మళ్లీ లాగి పెట్టి కొడుతుంది. నక్షత్ర కోపంగా తిరిగి చూసి

నక్షత్ర: ఏయ్‌ ఎవతివే నువ్వు.. ఈసారి నీకు అడ్డంగా లేను కదా..? ఎందుకు కొడుతున్నావు.. పిచ్చా నీకేమైనా..?       

అనగానే భూమి కోపంగా లేచి వచ్చి నక్షత్రను కొడుతూనే ఉంటుంది. నక్షత్ర ఆపవే అంటూ అసలు ఎందుకు కొడుతున్నావే.. అని అడగ్గానే.. నన్ను పిచ్చిది అంటే నాకు కోపం రాదా..? అంటూ కొడుతుంది. దీంతో నక్షత్ర వదలవే నేను వెళ్లిపోతాను అంటూ విదిలించుకుని మళ్లీ ప్రశాంతంగా ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లబోతుంటే.. గగన్‌ ఒక్క నిమిషం ఆగు నీ మనసులోంచి వచ్చిన చెత్తను అంతా తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయ్‌ అంటూ గగన్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!