Meghasandesam Serial Today Episode: హాస్పిటల్‌ లో కేపీని చూసిన అపూర్వ వెతుక్కుంటూ వార్డులు తిరుగుతుంటుంది. అపూర్వకు కనిపించకుండా మాస్కులు పెట్టుకుని తప్పించుకుని వెళ్తుంటారు కేపీ, శారద. ఒక దగ్గర కేపీ చేతికి ఉన్న వాచ్‌ పడిపోతుంది. అక్కడికి వచ్చిన అపూర్వ  ఆ వాచ్‌ను చూసి షాక్‌ అవుతుంది.

Continues below advertisement

అపూర్వ: ఈ వాచ్‌ కేపీ వాళ్ల యానివర్సరీకి గిఫ్ట్‌ గా ఇచ్చిన వాచ్‌ కదా..? కన్‌ఫంగా అదే.. కేపీ..

అంటూ బయటకు వెతుక్కుంటూ వెళ్తుంది అపూర్వ. ఇంతలో ఒక వార్డులోంచి సుజాత పరుగెత్తుకుంటూ వస్తుంది.

Continues below advertisement

సుజాత: ఇదిగో అమ్మాయి డాక్టర్‌ గారు రమ్మంటున్నారు..

అపూర్వ: పిన్ని నువ్వు దగ్గర ఉండి నక్షత్రను చూపించు.. నేను ఈ లోపు హాస్పిటల్‌ మొత్తం వెతకాలి.

సుజాత: డాక్టర్‌ గారు లోపలే ఉన్నారు అమ్మాయి. వెతకడం ఎందుకు..?

అపూర్వ: అబ్బా పిన్ని నేను వెతకాలనుకుంటుంది డాక్టర్ని కాదు కేపీని ఇదిగో.

సుజాత: వాచ్‌ ను చూపించి చచ్చిపోయిన కేపీని వెతకాలంటున్నావేంటి..? అమ్మాయి నాకేం అర్థం కావడం లేదు.

అపూర్వ: అబ్బా పిన్ని కేపీ చావలేదని నేను మొట్టమొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను కదా.? ఇది వాడి వాచే.. నేను బావ వాళ్ల మ్యారేజ్‌ యానివర్సరీకి కొనిచ్చిన వాచ్‌. నా ఊహ నిజమే అయితే ఆ కేపీ డాక్టర్‌ క్యాబిన్‌ నుంచి బయటకు వస్తూ మనల్ని చూసి ఎటో పారిపోయి ఉంటాడు. ఆ కంగారులోనే ఈ వాచ్‌ పడిపోయి ఉంటుంది. వాచ్‌ పడిపోయినా చూసుకోలేదు అంటే వాడు ఈ సరౌండిగ్స్‌ లోనే తప్పించుకుని తిరుగుతుంటాడు పిన్ని. మనల్ని చూసి తప్పించుకున్నంత ఈజీగా ఈ హాస్పిటల్‌ నుంచి తప్పించుకోలేడు. అంగుళం అంగుళం వెతికాను అనుకో దొరికేస్తాడు. ఈరోజు వాణ్ని నేను పట్టుకుని తీరతాను.

సుజాత: అది కాదు అమ్మాయి మొన్న మన మీరాకు కలలోకి వచ్చినట్టు.. ఇప్పుడు వాడి ఆత్మ నీకు ఎదురు వచ్చిందేమో..? లేనిపోని రిస్క్‌ తీసుకుంటున్నావేమో అమ్మాయి..?

అపూర్వ: పిన్ని హాస్పిటల్‌ లో ఉన్నాం కదా అని అనవసరంగా నువ్వు రిస్క్‌ తీసుకోకు.. ఇంకా నన్ను ఇరిటేట్‌ చేశావు అనుకో నీ తల మీద కొబ్బరికాయ పగులుతుంది. వెళ్లు వెళ్లి నక్షత్రకు చూపించు..

అని అపూర్వ కోపంగా చెప్పగానే సుజాత సరే అంటూ నక్షత్ర దగ్గరకు వెళ్తుంది. మరోవైపు కేపీ, శారద కంగారు పడుతుంటారు. డాక్టర్‌ కట్టుకడుతుంటే నక్షత్ర పెయిన్‌ కు తట్టుకోలేక ఏడుస్తుంది. కట్టుకట్టగానే డాక్టర్‌ వచ్చి సుజాతను పేరేంటి అని అడుగుతాడు.

సుజాత: అసలు పేరు సుజాత అండి. ఆ పేరుతో నన్ను ఎవ్వరూ గుర్తు పట్టరు అందరూ గోరింటాకు పిన్నిగానే తెలుసు..అందరూ ఈ పేరుతోనే పిలుస్తారు.

నక్షత్ర: గోరింటాకు డాక్టర్‌ గారు అడిగింది నన్ను..

సుజాత: ఓ తన పేరే అండి నక్షత్ర అండి..

నక్షత్ర: గోరింటాకు.. నేను చెప్తాను నువ్వు ముయ్‌.. నక్షత్ర డాక్టర్‌..

డాక్టర్‌: పెళ్లి అయిందా అమ్మా…?

సుజాత: కాలేదు డాక్టర్‌.. ఇంట్లో సంబంధాలు వెతుకుతున్నారు. మై సెల్ఫ్‌ నేను కూడా వెతుక్కుంటున్నాను అనుకోండి.

డాక్టర్‌: హలో మేడం నేను పేషెంట్‌ ను అడుగుతున్నాను. మీరు పేషెంట్‌ కాదు కదా..? మీరు కాస్త సైలెంట్‌గా ఉండండి.. మీరు చెప్పండి పెళ్లి అయిందా..?

నక్షత్ర: అయింది డాక్టర్‌ గారు..

డాక్టర్‌: మీ బ్యాక్‌ బోన్‌ చిన్న క్రాక్‌ ఇచ్చింది. మీరు కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలి.

సుజాత: కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు డాక్టర్‌ గారు.. ఇంచు మించుగా..?

డాక్టర్‌: మీకు పెళ్లి కాలేదు కదండి..?

సుజాత: అవును కదూ మర్చేపోయాను..?

డాక్టర్‌: ముందు మీరు బయటకు వెళ్లి కూర్చోండి.. కావాలంటే మళ్లీ పిలుస్తాను.  

అంటూ డాక్టర్‌ చెప్పగానే.. సుజాత వద్దులేండి ఇక నేనేం మాట్లాడను మీరు కానివ్వండి అంటుంది. దీంతో డాక్టర్‌ ఎలా భరిస్తున్నారమ్మా ఈ ముసలావిడను అంటాడు. దీంతో సుజాత షాక్‌ అవుతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!