Meghasandesam Serial Today Episode: అపూర్వ, శారద తో  కేపీ బతికే ఉన్నాడన్న నిజం చెప్పించాలని కేపీకి పిండ ప్రధానం చేయించాలని అలాగేతేనే నిజం బయటకు వస్తుందని అనుకుని అదే విషయం ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అంతా తెలుసుకున్న భూమి ఎలాగైనా పిండ ప్రధానం ఆపేయాలని డిసైడ్‌ అవుతుంది. హాస్పిటల్‌కు వెళ్లి శారద, కేపీలకు విషయం చెప్తుంది.

కేపీ: ఇప్పుడు ఎలా భూమి..? పిండ ప్రధానం ఎలా ఆపేస్తావు..?

భూమి: ఎలాగైనా ఆపాలి కదా మామయ్య.. మీరు హెల్ప్ చేస్తే ఆ పిండ ప్రధానం ఆపోచ్చు మామయ్య.

కేపీ: అవును నేను హెల్ప్‌ చేయడం ఏంటి..? భూమి.. అర్థం కాలేదు

భూమి: అవును మామయ్య మీరు హెల్ప్‌ చేస్తేనే ఇప్పుడు ఆ పిండ ప్రధానం ఆపోచ్చు

కేపీ: అవునా ఎలా అమ్మా చెప్పు చేస్తాను..

భూమి: మామయ్య మీరు రాత్రికి ఎలాగైనా మీరా అత్తయ్య దగ్గరకు ఆత్మ లాగా వెళ్లాలి.. అత్తయ్యకు పిండ ప్రధానం గురించి చెప్పి ఎవరికైనా పెద్ద కొడుకు పిండ ప్రధానం చేస్తేనే ఆత్మ శాంతిస్తుందని.. అలా కాకుండా చెర్రితో పిండ ప్రధానం చేయిస్తే.. మీ ఆత్మ శాంతించదు అని చెప్పాలి.

కేపీ: అలా చెప్తే పిండ ప్రధానం ఆపేస్తారని గ్యారంటీ ఉందా భూమి..

భూమి: తప్పకుండా మీరా అత్తయ్యే ఆపేస్తుంది మామయ్య. మీరు గగన్‌ కాకుండా వేరే ఎవ్వరూ పిండ ప్రధానం చేసినా మీ ఆత్మ శాంతించదు.. అంటూ అత్తను బెదిరిస్తే సరిపోతుంది. ఇక ఎలాగూ గగన్‌ బావ వచ్చి మీకు పిండ ప్రధానం చేయరు కాబట్టి ఇప్పటికైతే పిండ ప్రదానం ఆగిపోతుంది మామయ్య.

కేపీ: సరే భూమి చాలా మంచి ఆలోచన తప్పకుండా చేద్దాం..

అని కేపీ చెప్పగానే.. భూమి తాను అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను మామయ్య అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.   తర్వాత రాత్రికి కేపీ ఆత్మ లాగా గెటప్‌ వేసుకుని శరత్‌ చంద్ర ఇంట్లోకి మీరా రూంలోకి వెళ్తాడు. నిద్రిస్తున్న మీరాను పిలుస్తాడు. నిద్ర లేచిన మీరా దెయ్యం గెటప్‌లో ఉన్న కేపీని చూసి షాక్‌ అవుతంది. వెంటనే తేరుకుని ఏవండి ఏవండి అంటూ ఏడుస్తుంది.

కేపీ: మీరా ఏడవకు.. మీరా.. నేను చెప్పేది జాగ్రత్తగా విను..

మీరా: ఏవండి.. అసలు మీరు

కేపీ: మీరా నేను చెప్పేది విను. రేపు నాకు పిండ పెడుతున్నారు కదా..? ఆ పిండం చెర్రితో పెట్టించడం పెద్ద తప్పు.. అలా చేస్తే నా ఆత్మ శాంతిచదు సరికదా పిశాచమై తిరుగుతుందట. మీరా నాకు పెద్ద కొడుకు  గగన్‌ తోనే పిండ ప్రధానం చేయించండి

అంటూ చెప్పి మీరా ఏడుస్తుంటే.. కేపీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత శరత్‌ చంద్ర, అపూర్వ చెర్రి వెళ్లి కేపీకి పిండ ప్రధానం చేయిస్తుంటారు. ఇంతలో అక్కడికి మీరా వస్తుంది. చెర్రిని పిండ ప్రధానం చేయోద్దని ఆపేస్తుంది. భూమి, శారద దూరం నుంచి చాటుగా చూస్తుంటారు. మీరా ఆపడంతో శరత్, అపూర్వ షాక్‌ అవుతారు.

మీరా: మీ నాన్న గారికి నువ్వు పిండ ప్రధానం చేయోద్దు చెర్రి

శరత్: ఏం మాట్లాడుతున్నావు మీరా

మీరా: చెర్రి వాళ్ల నాన్నకు పిండం పెట్టకూడదు అన్నయ్య..

శరత్: ఎవరు చెప్పారు నీకు..

మీరా: మా ఆయనే చెప్పారు అన్నయ్య

అంటూ కేపీ వచ్చి చెప్పిపోయిన విషయం మీరా చెప్పగానే అపూర్వ షాక్‌ అవుతుంది. శరత్‌ చంద్ర ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!