Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ ధీరజ్‌ మీద అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. ధీరజ్ బయట నుంచి ప్రేమని పిలుస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి వెళ్లిందని అనుకుంటే ఇదేంటి నిజంగా వెళ్లిపోయింది.. ఇంట్లో ఇప్పుడు ఏం అంటారా అని తెగ టెన్షన్ పడతాడు. ఇదంతా చూసిన ఆనంద్‌రావు, భాగ్యం చూసి ఆ పిల్లకు ఆ ఇంట్లో ఎంట్రీనే లేదు కదా మరి వెళ్లింది.. సమయానికి రామరాజు అన్న కూడా లేరు లేదంటే మంట పెట్టేసేవాళ్లం అని అనుకుంటారు.

Continues below advertisement

ధీరజ్ ప్రేమకి ఫోన్ చేసి వచ్చేయ్మని అంటాడు. నేను రాను అలిగి పుట్టింటికి వచ్చేశా అని అంటుంది. దాంతో ధీరజ్ నిన్ను అక్కడ ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది రావే అని అంటాడు. సారీ చెప్తే వస్తా అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ సారీ చెప్పడంతో ప్రేమ వస్తుంది. ప్రేమ రాగానే ధీరజ్ ఏంటే ఓవర్ యాక్షన్ అంటాడు. నువ్వు నన్ను తిడుతున్నావ్ మళ్లీ వెళ్లిపోతా అని ప్రేమ అంటే అమ్మ తల్లి సారీ లోపలికి రా అని ధీరజ్ ప్రేమని తీసుకెళ్తాడు. ఆ ప్రేమ జంట సరదాగా దాగుడుమూతలు ఆడుకుంటున్నారు.. మనం ఇలా గుడ్లగూబల్లా చూడటం అవసరమా అని భాగ్యం అంటుంది. ఎప్పుడూ వెళ్లని ఆ పిల్ల ఆ ఇంటికి వెళ్లింది అంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది అని ఇడ్లీబాబాయ్ అంటే అంతేం లేదని భాగ్యం కొట్టి పడేస్తుంది. 

ఉదయం భద్రావతి, సేనాపతి టీవీలో నర్మదకు సంబంధించిన న్యూస్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. కాసేపట్లో నర్మదని పోలీసులు అరెస్ట్ చేస్తారని పొంగిపోతారు. వేదవతి బాధ పడుతుంటే అందరూ అక్కడికి వస్తారు. భాగ్యం వచ్చి బాధపడొద్దు వదినా.. నర్మద నిజాయితీకి మారుపేరు అనుకున్నాం ఇలా లంచం తీసుకుంటుంది అని అనుకోలేదు అని భాగ్యం అంటే నా కోడలు ఏంటో నాకు తెలుసు ఇంకొసారి అలా అనొద్దు అని చెప్తుంది. పోలీసులు సాక్ష్యాలు చూస్తారు కానీ మంచితనం చూడరు అని  వల్లీ, భాగ్యం అంటారు. 

Continues below advertisement

నర్మద అరెస్ట్ అవుతుంది అనే బాధతో నా గుండె పగిలిపోతుంది అని వల్లీ అంటే నువ్వు అంత బాధ పడిపకు అక్క నర్మద అక్క తన మీద పడిన నింద నిరూపించుకొని నిర్దోషిలా బయటకు వస్తుంది అని ప్రేమ అంటుంది. ఇక భద్రావతి తమ్ముడితో అది ఎలా నిర్దోషిలా బయటకు వస్తుందిరా ఇరికించింది మనం అని ఎవరికి తెలుస్తుంది అని అంటుంది. 

ఆనంద్‌ రావు చాయ్ బిస్కెట్ తింటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. భాగ్యం అతనితో రామరాజు అన్నయ్య త్వరగా వస్తే బాగున్నా 4, 5 లక్షలు టెండర్ వేసి అట్టుకుపోవచ్చు అని అనుకుంటుంది. నువ్వు మామిడి కాయ టెంక గురించి ఆలోచిస్తున్నావ్ నేను మామిడి తోట గురించి ఆలోచిస్తున్నా.. అని అంటాడు. ఏం అంటున్నావ్ అని భాగ్యం అంటే ఈ ఆస్తి గురించి చెప్తున్నా.. నర్మద జైలు పాలు అయిపోతే.. ప్రేమ ఏం చేయలేదు..ఇక మిగిలేది మన అమ్మడు మాత్రమే.. మన అమ్మడు పేరు మీద ఆస్తి రాయించేస్తే మనకు ఆస్తి వచ్చేస్తుంది కదా అని అంటాడు. నీ ఆలోచన మామూలుగా లేదు కదా అని భాగ్యం అంటుంది. ఇందుకు మనం రెండు చేయాలి ఒకటి నర్మద పూర్తిగా జైలు పాలు అయ్యేలా చేయాలి.. రెండు ఇక్కడే మనం పాతుకుపోవాలి అని అనుకుంటారు.

నర్మదని అధికారులు మీరు లంచం  తీసుకుంటున్నట్లు దొరికిపోయారు కాబట్టి ఇక మీరు జైలుకి వెళ్లాలి.. అందుకు లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నట్లు సంతకం పెట్టమని అధికారులు అంటారు. అతని అకౌంట్‌లోకి అంత డబ్బు ఇలా వచ్చింది అని మీరు తెలుసుకుంటే అసలు నేరస్తుడు ఎవరు అని తెలుస్తుంది అని నర్మద అతని 6 నెలల అకౌంట్ డిటైల్స్ ఇస్తుంది. అప్పటి వరకు అతని అకౌంట్‌లో 20 వేలకు మించి లేదు.. ఇతను నా దగ్గరకు రావడానికి 1 గంట ముందు అతని అకౌంట్‌కి డబ్బులు వచ్చాయి,, ఎవరి అకౌంట్‌ నుంచి వచ్చాయో కూడా తెలుసుకోండి.. అని అంటుంది. అధికారి చూసి సేనాపతి అకౌంట్‌ నుంచి వచ్చాయని అంటారు.

సేనాపతి, భద్రావతిల ఇల్లీగల్ ల్యాండ్ కబ్జా చేయడం వల్ల ఇలా నా మీద కుట్ర చేశారని నర్మద నిరూపిస్తుంది. దాంతో అధికారులు నర్మదకి సారీ చెప్పి వదిలేస్తారు. నర్మద నిర్దోషిగా విడుదల అయిందని న్యూస్ వస్తుంది. భద్రావతి, సేనాపతి, వల్లీ బిత్తరపోతారు. మిగతా అందరూ పండగ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.