MeghasandesamSerial Today Episode: మేఘసందేశం సీరియల్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. పెళ్లి కాకముందే తార శారదకు వార్నింగ్ ఇస్తుంది. శారద ఇంట్లో దేవుడి ముందు నిలబడి మొక్కుతూ ఉంటే.. అప్పుడే ఇంట్లోకి తార వస్తుంది. శారదను చూసి దగ్గరకు వెళ్లి అత్తయ్యా అని పిలుస్తుంది. దేవుడిని మొక్కుతున్న శారద తిరిగి చూస్తుంది. దీంతో ఇవాళ్టీ మేఘసందేశం సీరియల్ ఏపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
తార: ఏంటి అత్తయ్యా నాకు తార వద్దు.. నాకు భూమియే కోడులుగా కావాలని చెప్పి ఆ భూమి కోసం పూజలు చేస్తున్నారా..? నాకు తెలుసు అత్తయ్యా మీ మనసులో ఏముందో.. మీ అబ్బాయి వద్దంటున్నా కూడా మీరు మాత్రం కోడలుగా ఆ భూమి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఇక ఆ అవకాశం లేదు లేండి.. ఆ భూమి ఈ ఇంటికి రాదు.
శారద: ఏం చేశావు..
తార: నేను ఆ ఇంటికి వెళ్లాను. కానీ అది తప్పించుకుంది. ఉండి ఉంటే నా చేతులతో నేనే చంపేసేదాన్ని.. అపూర్వ ఆంటీతో చెప్పాను. వాళ్ల నాన్నతో చెప్తాను అంది. వాళ్ల నాన్న ఈ ఇంటికి రావొద్దని ఆల్‌రెడీ వార్నింగ్ ఇచ్చాడట. అయినా వచ్చింది కదా..? వాళ్ల నాన్న దాని పని చెప్తాడు లేండి..
పూర్ణి: మంచి పని చేశావు వదిన నేను నీ నుంచి కోరుకునేది ఇదే..
గగన్: మీరు ఆ ఇంటికి వెళ్లారా..?
తార: అవును వెళ్లాను. అది ఈ ఇంటికి వచ్చింది. మీరు నాకు కాబోయే భర్త. ఇది నా అత్తారిల్లు.. అది వచ్చి ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ఊరుకుంటానా.. అందుకే వెళ్లి చెప్పేశా..? ఇక అది మన మధ్య అడ్డుగా ఉండదు. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు.. బాయ్ గగన్ గారు.. బాయ్ పూరి ఉంటాను అత్తయ్య..
పూరి: నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నయ్యా..?
శారద: గగన్ ఏంట్రా ఇది.. తనను ఎవరు వెళ్లమన్నారు అక్కడికి…
గగన్: నాకు కూడా తెలియదు అమ్మా.. అసలు భూమి ఇంటికి వచ్చిందని అసలు తారకు చెప్పింది ఎవరు..?
పూరి: నేనే చెప్పాను..
శారద: నువ్వు చెప్పావా..? బుద్ది ఉందా నీకు
పూరి: ఆ బుద్ది తనకు ఉండాలి. మన ఇంటికి రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తుంది అమ్మా
గగన్: ఏంటి భూమి అందుకని తారకు వెళ్లి కంప్లైట్ ఇస్తావా..?
పూరి: ఇవ్వాలి కదా అన్నయ్య.. లేదంటే మన పెళ్లిళ్లు జరగనివ్వదు ఆ భూమి. తార మంచి పని చేసింది అన్నయ్య.
శారద: పూరి.. భూమి వాళ్ల నాన్నకు మనం అంటే ఎంత కోపమో తెలుసుకదా..? గగన్ మీరు ఇద్దరు కలవడమే ఆయనకు ఇష్టం లేదు. మీరు ఇద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత అసలు ఊరుకోడురా..?
పూరి: అయితే మనకేంటి అమ్మా.. వాళ్లు వాళ్లు కొట్టుకోని చావని.. నువ్వు ఎక్కువ రియాక్ట్ అవని..
శారద: నువ్వు ఎక్కువ మాట్లాడకు.. నా చేత్తో దెబ్బలు తింటావు..
గగన్: అమ్మా..?
శారద: గగన్ పాపంరా భూమి.. వెళ్లరా వెళ్లితనను ఎవ్వరూ ఏమీ అనకుండా చూడు..
పూరి: అన్నయ్య ఎందుకు వెళ్లాలి అమ్మా అన్నయ్య వెళ్లడు.. అన్నయ్య నువ్వు వెల్లడానికి వీల్లేదు.
శారద: అది కాదే అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అందరూ భూమిని నిలదీస్తారు.. ఆ అపూర్వ ఇదే మంచి అవకాశం అని అందరి ముందు భూమి పరువు తీస్తుంది.
పూరి: తీస్తే తీయని.. పరువే తీస్తారో.. ప్రాణాలే తీసుకుంటారో మనకెందుకు..?
శారద: పూరి నువ్వు ఆగు.. గగన్ నువ్వు వెళ్లరా నా మాట విను..
పూరి: అన్నయ్య వెళ్లరు అమ్మా.. చంపితే చంపుతారు.. చంపని దరిద్రం వదలిపోతుంది.
శారద కోపంగా పూరి చెంప పగులగొడుతుంది.
గగన్: ఎందుకు కొడుతున్నావు అమ్మా..?
శారద: అన్నయ్యతో మాట్లాడుతున్నాను కదా..? పో లోపలికి..
గగన్: పూరి.. అమ్మా ఎందుకు అమ్మా అలా కొడుతున్నావు..
శారద: నా కూతురుని ఒక్క చెంప దెబ్బ కొడితేనే నువ్వు నన్ను అడిగావు. అక్కడ భూమి వాళ్ల నాన్న ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు.. ఆ ఇంట్లో వాళ్లు రాబందులురా భూమిని పీక్కుతింటారు.. వెళ్లు గగన్. రేయ్ నువ్వు వెళ్తావా..? నన్ను వెళ్లమంటావా..?
గగన్: ఇప్పుడేంటమ్మా… ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను సరేనా..?
శారద: అక్కడికి వెళ్లగానే.. భూమితో నన్ను మాట్లాడించు..
అని చెప్పగానే.. గగన్ సరే అమ్మా అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు శరత్ చంద్ర ఆఫీసులో ఆలోచిస్తూ కూర్చుంటే.. అపూర్వ వెళ్లి శరత్ చంద్రకు ఆ భూమి మళ్లీ ఆ ఇంటి గడప తొక్కిందని చెప్తుంది. దీంతో శరత్ చంద్ర కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
