Jagadhatri Serial Today Episode: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ధాత్రి,కేదార్‌కు వాడు బంపర్‌ ట్విస్ట్ ఇస్తాడు. నేను భయంతో పారిపోతానని ఎలా అనుకున్నావ్‌ జేడీ  అని అంటాడు. నేను మీ ఇంటికి వచ్చి అంత గొడవ చేసిన తర్వాత నువ్వు నన్ను వదిలిపెడతావని ఎలా అనుకుంటాను.ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసని అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నానని అంటాడు. మీ ఇంట్లో మాటలురాని ఓపాప ఉండాలి కదా ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండని అంటాడు.నువ్వు అబద్ధం చెబుతున్నావని అనగా....ఒకసారి మీ వదినకు ఫోన్ చేసి కనుక్కోమని అంటాడు.వెంటనే జేడీ కౌషికికి ఫోన్ చేసి పాపకు ఏమైందని అడుగుతుంది. ఇప్పుడే ఐస్‌క్రీమ్ కోసం రోడ్డుమీదకు వస్తే...ఎవరో పాపను కిడ్నాప్ చేశారని చెబుతుంది. మీరు ఏం భయపడొద్దని....పాపను కిడ్నాప్ చేయడంతో ఎవరో చూసి మాకు ఫోన్ చేశారని జేడీ చెబుతుంది. మేం పాపను తీసుకుని వస్తామని అంటుంది. పాపను ఏం చేయవద్దని కేదార్‌, జేడీ బ్రతిమలాడతారు. నువ్వు వచ్చి నా కాళ్లు పట్టుకుని సారీ చెబితే పాపను వదిలేస్తానని లేకపోతే చంపేయమని మామావాళ్లకు చెబుతానని అంటాడు. అలాగే రౌడీలకు ఫోన్ చేసి నిమిషంలో నేను ఫోనే చేయకపోతే పాపను చంపేయమని చెబుతాడు. దీంతో చేసిది లేక కేదార్ అవినాష్‌ కాళ్లు పట్టుకుని సారీ చెబుతాడు. దీంతో పాప బయట కారులోనే ఉందని వెళ్లి తీసుకోండని అవినాష్ చెబుతాడు. ఇప్పుడు కూడా నువ్వు గెలిచావని అనుకోవద్దని....నీ భయమే నిన్ను ఆడవాళ్లను, చిన్నపిల్లలపై ప్రతాపం చూపేలా చేస్తుందని జేడీ హెచ్చరిస్తుంది. అసలు భయం అంటే ఏంటో త్వరలోనే నీకు చూపిస్తానని చెప్పి వెళ్లిపోతుంది.                           పాపను తీసుకుని జగధాత్రి, కేదార్ ఇంటికి వస్తారు. అసలు వీళ్లవల్లే పాప ఇవాళ కిడ్నాప్‌కు గురైందని  నిషిక, వైజయంతి మండిపడతారు.ఆరోజే వీళ్లను బయటకు గెంటివేయమని చెప్పాం కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిజంగా వాళ్లే అయితే ఇప్పుడే గన్‌ తీసుకెళ్లి కాల్చిపడేస్తానని కౌషికి అనడంతో వాళ్లు కాదని జగధాత్రి అబద్ధం చెబుతుంది.అయినా పాపను పోలీసులు కాపాడాలి కదా మీరు ఎందుకు తీసుకొచ్చారని నిషిక నిలదీస్తుంది. మీరు చెప్పినట్లే ఆ రౌడీ వెధవలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాడనికి స్టేషన్‌కు వెళ్లామని...అప్పుడే జేడీ టీం పాపను తీసుకుని వచ్చారని మేం ఇంటికే వెళ్తున్నామని చెబితే ఇచ్చారని చెబుతుంది. అందరూ లోపలకి వెళ్లగా...రాగిణి వచ్చి ధాత్రితో మాట్లాడుతుండగా చెంపమీద ఉన్న వాతలు చూసి ఏమైందని అడుగుతుంది. నిషిక కొట్టిందా అని అంటే కాదని వైజయంతి కొట్టిందని చెబుతుంది. ప్రతిరోజూ ఇంట్లో బొబ్బాయి, ఫైనాపిల్ మాయమవుతుండటంతో నాకు అనుమానం వచ్చిందని....నేను నిషికక జ్యూస్ తీసుకెళ్లగా అక్కడ బొబ్బాయి ముక్కలు కనిపించాయని చెబుతుంది. కడుపుతో ఉన్న అమ్మాయి ఇలాంటివి తినకూడదని చెప్పినందుకు వైజయంతి నన్ను కొట్టిందని ఆవి తిన్నది నిషికకాదని...నేనే అంటూ చెప్పిందని అంటుంది. అయితే నిషిక కడుపు నిజం కాదా అని ధాత్రికి అనుమానం వస్తుంది.ఈ విషయం మనమధ్యే ఉంచుకుని నిషికను ఓ కంట కనిపెడదామని ధాత్రి అంటుంది.                              అందరూ డిన్నర్‌ చేస్తుండగా...జగధాత్రి నిషికనుఅడుగుతుంది.ఇంకాఎందుకు స్కానింగ్‌కు వెళ్లడం లేదని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే కాదులే అని చెప్పినా....కడుపులో ఉన్న బేబీ ఎలా ఉందో చూసుకోవాలని కదా అని అంటుంది.ఇంతలో కేదార్ యువరాజు వైపు చూస్తూ ఇలాంటివి నువ్వే చూసుకోవాలని కదాఅని అడుగుతాడు.దీంతో యువరాజుకు కోపం వస్తుంది.ప్రతి అడ్డమైన వాడు సలహాలు ఇచ్చేలా చేస్తున్నావని రేపే మనం స్కానింగ్‌కు వెళ్తున్నామని చెబుతాడు. ఆ మాటలకు నిషికకు,వైజయంతికి చెమటలు పడుతాయి. వెంటనే కౌషికి కలుగజేసుకుని  ఇప్పుడే డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటానని...రేపు వెళ్లి స్కానింగ్ తీయించుకోమని చెబుతుంది. ఆ మాటలకు నిషిక భయపడిపోగా....నేను చూసుకుంటానులే అని వైజయంతి అంటుంది.