Meghasandesam Serial Today Episode: అపూర్వ గురించి ఆమె ప్రవర్తన గురించి భూమి, ప్రసాద్‌ ఇద్దరూ కలిసి ఏసీపీ నయనికి చెప్తారు. అయితే నేను అనుకున్న దాని కన్నా ఈ అపూర్వ చాలా డేంజర్‌ అని నాకు ఇప్పుడే అర్థం అయింది అంటుంది నయని. దీంతో ప్రసాద్‌ అవును మేడం నా మీద దొంగ అనే ముద్ర పడింది. దీంతో అపూర్వ గురించి నిజం చెప్పాలని నేను మా బావగారిని కలిశాను.

శరత్: ఏంటి కేపీ ఇలా వచ్చావు. అందరి ముందు కొట్టినందుకు కోపంగా ఉంది. తిరిగి కొట్టాలని ఉంది అని చెప్పడానికి వచ్చావా..?

ప్రసాద్‌: కోప్పడే హక్కు నాకు ఎక్కడుంది అండి. కొట్టినందుకు బాధ అనిపించింది. అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు కదా..?

శరత్‌: సారీ కేపీ అందరి ముందు అలా కొట్టి ఉండాల్సింది కాదు. కానీ అపూర్వను అందరి ముందు అలా అనే సరికి కొట్టాల్సి వచ్చింది.

ప్రసాద్‌: అపూర్వను మీరు అనవసరంగా నమ్ముతున్నారు. ఆ దెయ్యాన్ని దేవత అనుకుంటున్నారు.

శరత్‌: కేసీ మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడే కదా నిన్ను కొట్టినందుకు సారీ చెప్పాను. మళ్లీ కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు

ప్రసాద్‌: నేను నిజమే మాట్లాడుతున్నాను. సాయంత్రం నా మాటలకు ఆధారం లేదు. అందుకే నన్ను అవమానించినా మౌనంగా భరించాను. కానీ ఇప్పుడు ఆధారంతో మీ దగ్గరకు వచ్చాను. ఎవరో గుర్తు పట్టారా..?

శరత్‌: నాగరాజు.. మన డ్రైవర్‌ నాగరాజు.. మన శోభ పర్సనల్‌ డ్రైవర్‌..

ప్రసాద్‌: అవును చెల్లెమ్మ పర్సనల్‌ డ్రైవరే.. శోభమ్మ చనిపోయినప్పుడు ఇతనే డ్రైవర్‌ గా ఉన్నాడు.

శరత్‌: ఇన్నాళ్లు ఏమై పోయావు నాగరాజు..

ప్రసాద్‌: మీరు దేవత అనుకుంటున్న ఆ అపూర్వ మాయం చేస్తే మాయం అయిపోయాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో.. చెల్లెమ్మ మనకు ఎలా దూరం అయ్యిందో మీరే అడగండి..

శరత్‌: ఏం జరిగింది నాగరాజు..

నాగరాజు: ఆ రోజు స్టేజీ మీద అమ్మగారు నొప్పులతో కింద పడిపోగానే హాస్పిటల్‌కు వెళ్తుంటే..

అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు నాగరాజు. మరుసటి రోజు పేపర్‌లో అమ్మగారు చనిపోయారు అని చాలా బాధపడ్డాను అయ్యా నేను.. అంటూ  నాగరాజు ఏడుస్తుంటే.. నాగరాజు అక్కడి  నుంచి వెళ్లిపోయాక ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ జరిగింది ప్రసాద్‌ చెప్తాడు.

శరత్‌: నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు కేపీ. నిజంగా నా అపూర్వ అంత రాక్షసా..?

ప్రసాద్‌: బావ గారు సాక్ష్యం తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను. మీకు ఇంకా నమ్మకం కలగడం లేదా..?

శరత్‌: ఎలా నమ్మకుండా ఉంటాను కేపీ నా శోభకు నువ్వు ప్రియమైన అన్నయ్యవి.. ఇప్పుడు కూడా నమ్మకపోతే నేను మనిషినే కాదు. నాగరాజు నువ్వు చెప్తుంది నిజమే కదూ..

నాగరాజు: ఆ దేవుడి మీద ఒట్టు అయ్యా.. నేను నిజమే చెప్తున్నాను.

శరత్‌: దేవుడి దాకా ఎందుకు నాగరాజు. తీసుకున్న డబ్బులకు మధ్యలో దేవుడిని తీసుకురాకూడదు. తెస్తే ఆయన శిక్షించొచ్చు. మా ఇంట్లో కేపీ రెండు కోట్లు కొట్టేశాడు. అందులో నీకు ఎంతించాడురా..? చెప్పు..

ప్రసాద్‌: శరత్‌ చంద్ర దొంగ అని ముద్ర వేసి నా భార్య బిడ్డల ముందు నన్ను అవమానించావు సాక్ష్యం చూపించినా నీకు అర్థం కావడం లేదా..? నా చెల్లమ్మను చంపింది అపూర్వే ఇంకా నీకు ఎలా చెప్పాలి. ఇంక నువ్వు బతకకూడదు. చంపేస్తాను.

శరత్: చంపాలనుకుంటున్నావా..? కేపీ నన్నే చంపేయాలనుకుంటున్నావా..?

ప్రసాద్‌: నీలాంటి మూర్ఖుడిని చంపిన పాపం నాకెందుకు.. శరత్ చంద్ర నిజం ఏంటో తెలిసిన రోజు నువ్వే చస్తావు

అంటూ నేను అక్కడి న ఉంచి వచ్చేశాను మేడం అంటూ జరిగింది మొత్తం నయనికి  చెప్తాడు ప్రసాద్‌. అంతా విన్నాక నయని నువ్వు అక్కడి నుంచి వచ్చాక ఏదో జరిగింది. అంతా విన్నాక నాకెందుకో అపూర్వ మీదే అనుమానంగా ఉంది అంటుంది నయని. మరోవైపు అపూర్వ అసలు ఆ రోజు ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ జరిగింది విషయం సుజాతకు చెప్తుంది అపూర్వ. తాను గెస్ట్‌ హౌస్‌కు వెళ్లడానికి ముందే శరత్‌ చంద్ర తనను తాను కాల్చుకున్నట్టు.. అపూర్వే శోభను చంపినట్టు సూసైడ్‌ నోటు ఒకటి రాసి ఉంటాడు. అది చూసి అపూర్వ ఏడుస్తుంది. ఆస్థి కోసం శోభను చంపలేదని చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టుకున్నాను నీకోసమే శోభను చంపాను అంటూ ఏడుస్తుంది. ఇంతలో శరత్‌ చంద్ర లేస్తాడు. కోపంగా అపూర్వను చూస్తుంటాడు. శరత్‌ చంద్రను చూసిన అపూర్వ షాక్‌ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!